ఇసుక.. వేలానికి చకచకా | Five boats reach lottery of this month 28 | Sakshi
Sakshi News home page

ఇసుక.. వేలానికి చకచకా

Published Thu, Dec 12 2013 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

Five boats reach lottery of this month 28

 ఏలూరు, న్యూస్‌లైన్ :  గోదావరి ఇసుక కొర త త్వరలోనే తీరనుంది. జిల్లాలోని ఐదు బోట్స్‌మెన్ ఇసుక రీచ్‌లను ఈనెల 28న లాటరీ పద్ధతిలో ఆ సొసైటీలకు కేటారుుంచేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. మిగిలిన 14 రీచ్‌లను వేలం ద్వారా ఇసుక వ్యాపారులకు అప్పగిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని రీచ్‌లలో ఇసుకను తవ్వుకునే గడువు ఈ ఏడాది ఆగస్టుతో ముగిసిన విషయం తెలిసింది. దీంతో జిల్లాలోని ఇసుక రీచ్‌లన్నీ మూతపడ్డారుు. తిరిగి వాటిని వేలం వేసేం దుకు సంబంధిత శాఖల అధికారులతో మైనింగ్ అధికారులు ప్రణాళికను రూపొందించటం, పర్యావరణ అనుమతి పొందడంలో ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు ఆ ఇబ్బందులను అధిగమించిన గనుల శాఖ వాల్టా చట్టంలోని మార్గదర్శకాలకు అనుగుణంగా గోదావరి వెంబడి గల రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరిపేలా ప్రణాళిక రూపొందించింది.

 ఇప్పటివరకూ బోట్స్‌మెన్ రీచ్‌లు రెండు మాత్రమే ఉండగా, ఆ సంఖ్యను ఐదుకు పెంచారు. గూటాల, తాడిపూడి, ప్రక్కిలంక, ఔరంగాబాద్, కొవ్వూరు-1 రీచ్‌లను బోట్స్‌మెన్ సొసైటీలకు కేటారుుంచారు. వీటిని ఏడాది కాలానికి సంబంధిత సొసైటీలకు అప్పగించేందుకు ఈనెల 28న ఉదయం 11గంటలకు డ్వామా అధికారులు లాటరీ తీయనున్నారు. వీటిని పొందగోరు సొసైటీలు ఈనెల 24 సాయంత్రం 5 గంటల్లోగా డ్వామా పీడీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం డ్వామా పేరిట రూ.5వేలను డీడీ రూపంలో సమర్పిం చాలి. బోట్స్‌మెన్ రీచ్‌లలో ఇసుకను పడవల ద్వారా మాత్రమే సేకరించాల్సి ఉంటుంది.

1964 కో-ఆపరేటివ్ సొసైటీ యాక్టు కింద రిజిస్ట్రేషన్ అయిన బోట్స్‌మెన్ సొసైటీ సభ్యులు మాత్రమే ఈ రీచ్‌లలో ఇసుకను తవ్వుకోవాల్సి ఉంటుంది. గతంలో ఔరంగాబాద్, వాడపల్లి రేవులను మాత్రమే సొసైటీలకు కేటారుుంచేవారు. రీచ్‌లను పెంచాలన్న సొసైటీల కోరికను జిల్లా యంత్రాంగం పరిగణనలోకి తీసుకుని వాటి సంఖ్యను ఐదుకు పెంచింది. వీటిలో నిర్దేశిత పరిమితికి మించి ఇసుకను తవ్వకూడదనే నిబంధన విధించారు. క్యూబిక్ మీటరుకు రూ.40 చొప్పున కనీస ధర నిర్ణరుుంచి, రీచ్‌లో ఎంతమేర ఇసుక లభ్యత ఉంటుందనే విషయూన్ని లెక్కగట్టి రీచ్ ధర నిర్ణరుుస్తారు.
 మరో 14 రీచ్‌లకు త్వరలో వేలం జిల్లాలో మరో 14 రీచ్‌లలో ఇసుక తవ్వకం హక్కును వేలం వేసేందుకు గనుల శాఖ రూపొందించిన ప్రణాళి క చివరి దశకు చేరుకుంది. పోలవరం, బంగారమ్మపేట,  కొవ్వూరు-2, వాడపల్లి, ఆరికిరేవుల, తోగుమ్మి, కుమారదేవంలో రెండు రీచ్‌లు, పెండ్యాల, కానూరు, సిద్ధాంతం, మందలపర్రు, తీపర్రు, యలమంచిలి లంక, ఏనుగువాని లంకల్లోని రీచ్‌లకు త్వరలోనే వేలం నిర్వహించనున్నారు.
 తగ్గనున్న ఆదాయం!
 రీచ్‌లను గతంలో రెండేళ్ల కాలానికి కేటారుుంచేవారు. ఈసారి ఏడాదికి మాత్రమే ఇవ్వనుండటంతో ఆదా యం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉందని యం త్రాంగం భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement