Canada Student Juliette Wins 36 Million Usd Lottery In First Attempt - Sakshi
Sakshi News home page

ఫస్ట్‌టైం సరదాగా లాటరీ కొంటే, వందల కోట్ల జాక్‌పాట్‌ కొట్టేసిన అమ్మడు

Published Sat, Feb 4 2023 5:02 PM | Last Updated on Sat, Feb 4 2023 6:02 PM

Canada student Juliette wins 36 million usd lottery in first attempt - Sakshi

న్యూఢిల్లీ: జాక్‌ పాట్‌ అంటే ఇదీ. కెనడా విద్యార్థి ఒకరికి లాటరీలో తొలి ప్రయత్నం లోనే అదృష్టం వరించింది. వందల కోట్ల రూపాయల లాటరీని గెల్చుకుంది. అంతేకాదు ఇంతపెద్ద లాటరీ గెలుచుకున్న దేశంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది 18 ఏళ్ల జూలియెట్ లామర్. ఒకటి కాదు రెండు  కాదు దాదాపు 287 కోట్ల రూపాయలు (48 మిలియన్ కెనడియన్ డాలర్లు లేదా 35.8 అమెరికా మిలియన్‌ డాలర్లు) జాక్‌ఫాట్‌  కొట్టేసింది.
 
వివరాల్లోకి వెళితే జూలియెట్ లామర్ సాల్ట్ స్టీలోని అల్గోమా విశ్వవిద్యాలయంలో విద్యార్థి. ఏదో సరదాగా అంటారియో  ఒట్టో లాటరీ అండ్‌ గేమింగ్ కార్పొరేషన్‌కు చెందిన లాటరీని కొనుగోలు చేసింది. అదీ 18వ పుట్టిన రోజు సందర్భంతా తాత కోరిక, తండ్రి సలహా మేరకు లోట్టో 6/49 లాటరీ కొనుగోలు చేసింది. కానీ జాక్‌పాట్‌ వస్తుందని ఊహించలేదు. అసలు ఫలితాలు ప్రకటించే సమయానికి జూలియట్ లామర్ ఆ టిక్కెట్ గురించి దాదాపు మర్చిపోయింది కూడా. తీరా వచ్చాక సంతోషం పట్టలేక భావోద్వేగానికి లోనైంది.

(ఇదీ చదవండి:  ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసిందిగా! ధర ఎంత?)

తన తొలి లాటరీ టిక్కెట్‌పై గోల్డ్ బాల్ జాక్‌పాట్ ..ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని లామర్ పేర్కొంది. మనీ మేనేజర్, తండ్రి సహాయంతో గెలుపొందిన మొత్తంలో ఎక్కువ భాగాన్ని జాగ్రత్తగా పెట్టుబడి పెడతానని పేర్కొంది.  ముఖ‍్యంగా డాక్టర్ కావాలనే తన కల నెరవేర్చుకోవడానికి  గెలిచిన మొత్తంలో కొంత పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందట.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement