రూ.20 కోట్ల లాటరీ గెలిచినా... | Rs 20-crore lottery goes unclaimed in China | Sakshi
Sakshi News home page

రూ.20 కోట్ల లాటరీ గెలిచినా...

Published Wed, Jan 13 2016 9:13 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

రూ.20 కోట్ల లాటరీ గెలిచినా...

రూ.20 కోట్ల లాటరీ గెలిచినా...

బీజింగ్ : అదృష్టాన్ని అనుసరించే దురదృష్టం కూడా ఉంటుందంటారు. ఈ నానుడి  చైనాలో ఓ వ్యక్తికి వర్తిస్తుంది. లాటరీ ద్వారా బంపర్ ఆఫర్ తగిలినా... ఆ భారీ మొత్తానికి ఆ వ్యక్తి సొంతదారుడు కాలేకపోయాడు. దీంతో ఆ డబ్బుంతా సంక్షేమ నిధికి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే... చైనాలో ఓ మెగా లాటరీని గెలుచుకున్న వ్యక్తి... సరైన సమయంలో తీసుకోకపోవడంతో ఆ లాటరీ మొత్తాన్ని సంక్షేమ నిధికి అందచేశారు.

2015 నవంబర్ 10న జరిగిన ఓ లాటరీ విజేత 25.64 మిలియన్ యువాన్లను గెలుచుకున్నాడు. అప్పటి నుంచి ఎవరూ దీన్ని క్లెయిమ్ చేసుకోలేదు. అయితే చివరి నిమిషం వరకూ లాటరీ గెలిచిన వ్యక్తి కోసం లాటరీ సంస్థ  వేచి చూసింది. సమయం మించిపోవడంతో చివరకూ ఆ మొత్తాన్ని సంక్షేమ నిధికి జమ చేసింది. కాగా   చైనా చట్టాల ప్రకారం లాటరీ మొత్తాన్ని ఎవరూ తీసుకోకపోతే వెల్ఫేర్ ఫండ్కు తరలించాల్సి ఉంటుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement