అదృష్టం ఎవరిదో...!
- లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు
- మద్యం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
- ఫిక్స్‌డ్ లెసైన్స్‌డ్ పద్ధతిపై మద్యం షాపులు
- 142 దుకాణాలకు త్వరలో నోటిఫికేషన్
- ఎక్సైజ్ అధికారులకు మార్గదర్శకాలు జారీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : 2014-15 ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇప్పటి వరకు నడుస్తున్న విధానానికే సర్కారు పచ్చజెండా ఊపింది. ఫిక్స్‌డ్ లెసైన్స్‌డ్ ఫీజు పద్ధతిన దుకాణాలను కేటాయించేందుకు సిద్ధమైంది. మద్యం ుకాణాలను పొందేందుకు ఆసక్తి చూపేవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అందులో ఒకరిని లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ తదితర ప్రాంతాల్లో 142 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా అప్పగించేందుకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు అబ్కారీ శాఖ జిల్లా ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందినట్లు తెలిసింది. నేడో రేపో 2014-15 సంవత్సరానికి గాను టెండర్లు నిర్వహించే నోటిఫికేషన్ కూడా విడుదల కానుండటంతో మద్యం వ్యాపారుల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
జనాభా ప్రాతిపదికన లెసైన్స్ ఫీజు
లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనుండటంతో ఎక్సైజ్ కొత్త పాలసీలో అదృష్టం ఎవరిని వరిస్తుందనే చర్చ జరుగుతోంది. 2013 జూన్ 27న 2013-14 సంవత్సరానికి గాను మద్యం టెండర్లు జరగ్గా.. ఈ ఏడాది జూలైలో కొత్త దుకాణాల ద్వారా ఆదాయం పొందాలని సర్కారు భావిస్తోం ది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో దుకాణాల కేటాయింపు ప్రక్రియ ముగించాలని ఎక్సైజ్ అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిసింది. గతేడాది 142 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల కాగా 125 దుకాణాలకే 1,538 దరఖాస్తులు వచ్చాయి. మరో 24 దుకాణాలకు ఒక్కో దరఖాస్తు రాగా.. మొత్తం 101 షాపులను లాటరీ ద్వారా కేటాయించారు.
ఈ సారీ 142 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన ఆరు శ్లాబుల్లో ఫిక్స్‌డ్ లెసైన్స్‌డ్ పద్ధతిని అమలు చేయనున్నారు. 10 వేల వరకు జనాభా ఉంటే రూ.32.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేలలోపు రూ.34 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా వరకు రూ.42లక్షలు ఒక్కో దుకాణానికి లెసైన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుం ది. 3 లక్షల జనాభా నుంచి 5 లక్షల లోపు ఉంటే రూ.50 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల లోపుంటే రూ.68 లక్షలు, 20 లక్షల పైన జనాభా ఉంటే రూ.90 లక్షల లెసైన్స్ ఫీజు చెల్లించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
ధర్పల్లి దుకాణంపై మళ్లీ గురి!
2014-15 ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మద్యం వ్యాపారులు మళ్లీ వ్యూహాలకు పదును పెడుతున్నారు. సిండికేట్‌గా అధిక శాతం దుకాణాలను కైవసం చేసుకునేందుకు అత్యధికంగా మద్యం విక్రయా లు జరిగే దుకాణాలను ఎంచుకుంటున్నారు. ఆయా దుకాణాలపై అత్యధికంగా దరఖాస్తులను వేసి సిండికేట్‌కే ఆ దుకాణాలు దక్కేలా ముందస్తు జాగ్రత్తల్లో నిమగ్నమయ్యారు. గతేడాది మొత్తం 142 దుకాణాలకు 125 షాపులకే వ్యాపారులు ముందుకు వచ్చారు.
అయితే అత్యధికంగా ధర్పల్లి మద్యం దుకాణానికి 131 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్ షాపునకు 51 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో 101 దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించిన అధికారులు.. మిగిలిన 17 షాపుల కోసం ఐదారుసార్లు నోటిఫికేషన్ వేసినా ఎవరూ ముందుకు రాలే దు. అయితే ఈసారి కూడ అధిక మొత్తంలో మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఉన్న దుకాణాలు మిన హా.. తక్కిన షాపులకు పోటీ ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా త్వ రలో మద్యం దుకాణాలకు నో టిఫికేషన్ విడుదల కానుండ గా.. అదృష్టం ఉంటేనే ఆశించి న షాపులు దక్కనున్నాయి.