83 కోట్ల లాటరీ విన్నర్ వ్యధ!
డబ్బొచ్చి తన జీవితాన్ని నాశనం చేసిందని లాటరీలో రూ.83 కోట్లు గెల్చుకున్న జేన్ పార్క్ చెబుతోంది. 17 ఏళ్ల వయసులో రూ.83,46,01,293 బంపర్ లాటరీ గెలుచుకున్న జేన్ పార్క్ ఆ తర్వాత జీవితంలో నరకం చూస్తున్నానని చెప్పింది. 2013 సంవత్సరంలో పార్క్ కొన్న యూరో మిలియన్స్ లాటరీ టిక్కెట్టుకు ఒక మిలియన్ యూరోలు దక్కాయి. దీంతో ఆమె ఒక్కసారిగా మధ్యతరగతి కేడర్ నుంచి సంపన్నుల్లోకి చేరిపోయింది.
చిన్నవయసులో లాటరీ గెలుచుకున్న తనపై ఆ తర్వాత ఒత్తిడి బాగా పెరిగిందని పార్క్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్ధకు చెప్పింది. డబ్బుతో ఇళ్లు, లగ్జరీ జీవితం గడపొచ్చు గానీ ప్రేమించే బాయ్ ఫ్రెండ్ ను కొనలేమని చెప్పింది. తనను ప్రేమించే వారు ఎవరూ లేరని ఆ బాధతో తాను క్షోభ అనుభవిస్తున్నట్లు వెల్లడించింది. తన పరిస్ధితికి కారణమైన కేమ్లాట్(లాటరీ సంస్ధ)ను కోర్టులాగుతానని చెప్పింది.