jane park
-
లాటరీలో నెగ్గాను.. జీవితం కోల్పోయాను!
లండన్: లాటరీ గెలిస్తే జీవితంలో ఎన్నో సమకూర్చుకోవచ్చునని అందరూ భావిస్తుంటారు.. కానీ జేన్ పార్క్ అనే యువతి మాత్రం జీవితం కోల్పోయానంటోంది. ఒక్క లాటరీతో తన జీవితాన్ని నాశనం చేశారంటూ లాటరీ నిర్వాహకులపై మండిపడుతోంది. 2013లో 17 ఏళ్ల వయసులో జేన్ పార్క్ యూరో మిలియన్స్ లాటరీలో విజేతగా నిలిచి 1 మిలియన్ బ్రిటన్ పౌండ్లు (భారత కరెన్సీలో 8.34 కోట్ల రూపాయలు) అందుకుంది. 'డబ్బు చేతికి రావడమే తరువాయి నాకు ఎంతో ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్, ఫుట్ వేర్ కోసం షాపింగ్ చేశాను. ఆపై ఎప్పుడు చూసినా షాపింగ్స్, శరీర సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందు ఎన్నో సర్జరీలు చేయించుకున్నాను. అలా చూస్తుండగానే నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నా వద్ద డబ్బు లేదు. జల్సాలకు అలవాడుపడ్డాను. పని చేయలేకపోతున్నాను. జీవితంలో ఎంతో కోల్పోయాను' అని లాటరీ విన్నర్ జేన్ పార్క్ ఆవేదన వ్యక్తం చేసింది. రోజురోజుకు మార్కెట్లో కొత్త ఉత్పత్తులు వస్తున్నాయని, దీంతో పాతవాటిపై మోజు తీరిపోతుందని అభిప్రాయపడింది. ఎంత డబ్బు మనతో ఉన్నా సంతోషాన్ని, బంధాలను మాత్రం సంపాదించుకోలేమని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఆ లాటరీ తన జీవితాన్ని సర్వనాశనం చేసిందని యువతి ఆరోపిస్తోంది. 'కోట్ల రూపాయలు తనవద్ద లేనప్పుడు కేవలం గంటకు ఎనిమిది పౌండ్లు సంపాదించేదాన్ని. ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. అయితే కోట్ల డబ్బు నెగ్గకముందు తన జీవితం మరో పదిరెట్లు సంతోషంతో నిండి ఉండేదని. ఏ జాబ్ చేయలేకపోతున్నానని' ఆమె వాపోయింది. అతి పిన్న వయసు(17)లో యూరో మిలియన్స్ లాటరీ విజేతగా నిలిచి నాలుగేళ్ల కింద రికార్డు సాధించింది. అయితే లాటరీ నెగ్గాలంటే కనీస వయసు 16 నుంచి 18 ఏళ్లకు మార్చాలని అభిప్రాయపడింది. లాటరీలతో డబ్బు వృథా చేయడం కంటే చారిటీ సంస్థలకు డబ్బు విరాళంగా ఇస్తే ఎంతో మేలు జరుగుతుందని సలహా ఇచ్చింది. రొమాంటిక్ పార్ట్నర్ను వెతికి అతడితో కలిసి ఉండాలనుకున్నాను, కానీ తన డబ్బు చూసి వెంటపడేవారే ఉన్నారని ప్రేమ లాంటి వ్యవహారాలకు దూరంగా ఉన్నట్లు వివరించింది. -
83 కోట్ల లాటరీ విన్నర్ వ్యధ!
డబ్బొచ్చి తన జీవితాన్ని నాశనం చేసిందని లాటరీలో రూ.83 కోట్లు గెల్చుకున్న జేన్ పార్క్ చెబుతోంది. 17 ఏళ్ల వయసులో రూ.83,46,01,293 బంపర్ లాటరీ గెలుచుకున్న జేన్ పార్క్ ఆ తర్వాత జీవితంలో నరకం చూస్తున్నానని చెప్పింది. 2013 సంవత్సరంలో పార్క్ కొన్న యూరో మిలియన్స్ లాటరీ టిక్కెట్టుకు ఒక మిలియన్ యూరోలు దక్కాయి. దీంతో ఆమె ఒక్కసారిగా మధ్యతరగతి కేడర్ నుంచి సంపన్నుల్లోకి చేరిపోయింది. చిన్నవయసులో లాటరీ గెలుచుకున్న తనపై ఆ తర్వాత ఒత్తిడి బాగా పెరిగిందని పార్క్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్ధకు చెప్పింది. డబ్బుతో ఇళ్లు, లగ్జరీ జీవితం గడపొచ్చు గానీ ప్రేమించే బాయ్ ఫ్రెండ్ ను కొనలేమని చెప్పింది. తనను ప్రేమించే వారు ఎవరూ లేరని ఆ బాధతో తాను క్షోభ అనుభవిస్తున్నట్లు వెల్లడించింది. తన పరిస్ధితికి కారణమైన కేమ్లాట్(లాటరీ సంస్ధ)ను కోర్టులాగుతానని చెప్పింది. -
డబ్బు కోసమే నన్ను వాడుకున్నాడు!!
మూడేళ్ల కిందటి వరకు ఆమె అందరిలా మామూలు అమ్మాయే. కానీ 17 ఏళ్ల వయస్సులో తనకు మిలియన్ పౌండ్ల (రూ. 9.68 కోట్ల) లాటరీ తగలడంతో ఓవర్‌నైట్ సంపన్నురాలిగా మారిపోయింది. తనకు దాచుకోలేనంత డబ్బు వచ్చాక మార్క్ స్కేల్స్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. అతడితో ప్రేమలో పడింది. ప్రణయసల్లాపాల్లో మునిగిపోయింది. 'ట్రు లవ్' (నిజమైన ప్రేమ) తనకు దొరికిందని సంబురపడింది. అతనికి అడిగినంత డబ్బు ఇచ్చింది. బోలేడె కానుకలు ఇచ్చింది. అతడు తనపై ప్రేమతో కాకుండా, తన డబ్బుపై కన్నుతో తన వెంటపడ్డాడని తెలిసి ఇప్పుడు వాపోతున్నది ఇంగ్లండ్‌లోని ఎడిన్‌బర్గ్‌కు చెందిన జేన్ పార్క్ (20). ఆమెకు అదృష్టం కలిసివచ్చి మూడేళ్ల కిందట హిబ్స్ ఫ్యాన్ మార్క్ లాటరీ తగిలింది. లాటరీ తగలడంతోపాటు మార్క్ స్కేల్స్ అనే బాయ్‌ఫ్రెండ్ కూడా ఆమెను తగులుకున్నాడు. తన డబ్బుతో అతడు జల్సా చేసేవాడని, తనను కాకుండా తన డబ్బును మాత్రమే అతను ప్రేమించాడని ఆమె తాజాగా వాపోతున్నది. తాను ఎంతో ప్రేమగా ఇచ్చిన ఏడువేల పౌండ్ల రోలెక్స్ వాచ్ గిఫ్ట్‌ను మార్క్స్ అమ్మేశాడని, దీంతో అతని నిజస్వరూపం తెలిసి.. అతడ్ని విసిరికొట్టానని, తమ ప్రేమ పెటాకులైందని తాజాగా 'సన్' మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ లాటరీ మిలియనీర్ తెలిపింది. తాను డబ్బుతో అతడి ప్రేమను కొనాలని భావించిన మాట వాస్తవమేనని, కానీ అతడు తనను ప్రేమించకుండా వాడుకోవడం మొదలుపెట్టాడని, అదే బాధ కలిగించిందని జేన్ పార్క్ చెప్పుకొచ్చింది. 'అతడు వట్టి పాములాంటి వాడు. మేం ఎప్పుడూ వాదించుకుంటూ ఉండేవాళ్లం. గత నెలలోనే అతన్ని వదిలించుకున్నా' అని జేన్ సన్ మ్యాగజీన్‌కు తెలిపింది. 'డబ్బు కోసమే నిన్ను వాడుకుంటున్నాడని నాకు అందరూ చెప్పారు. కానీ ఎవరి మాట వినలేదు. నేను ప్రేమలో ఉన్నట్టు భావించాను. గుడ్డిగా మసలుకున్నాను. డబ్బు కోసం తప్ప నన్ను ఏమాత్రం గౌరవించని ఇంతటి మూర్ఖుడిని ఎలా ప్రేమించానో తెలియడం లేదు. ఎంతో బాధగా ఉంది' అంటూ జేన్ పార్క్ ట్విట్టర్లో తెలిపింది. తన కారును అతనే వాడుకుంటున్నాడని, తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని ఆమె పేర్కొంది.