యూఎస్‌లోని అన్నాడేల్‌కు చెందిన జోస్ ఫ్లోర్స్ వెలాస్క్వెజ్ సోడా డ్రింక్ కోసం షాపింగ్ చేస్తున్నప్పుడూ సేఫ్‌వేలో 'ట్వంటీ ఎక్స్ ది మనీ స్క్రాచ్ ఆఫ్ లాటరీ' టికెట్‌ని కొనుగోలు చేశాడు. కానీ అతను లాటరీ తగులుతుందన్నకోలేదు. అకస్మాత్తుగా ఒకరోజు వెలాస్క్వెజ్‌కి లాటరీ తగిలినట్లు వర్జీనియా లాటరీ అధికారులు చెప్పడంతో కలెక్ట్ చేసుకోవడానికి లాటరీ కార్యాలయాలనికి వెళ్లాడు.
ఐతే అతను మాత్రం సుమారు రూ. 40 వేల ఖరీదు చేసే ఏ చిన్న బహుమతినో గెలుచుకుని ఉండొచ్చు అనుకున్నాడు. కానీ కార్యాలయానికి వెళ్లినవెంటను వారు దాదాపు రూ. 7 కోట్లు ఫ్రైజ్‌మనీ సొంతం చేసుకున్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా వెలాస్క్వెజ్ షాక్‌కి గురయ్యాడు. వర్జీనియా లాటరీ అధికారులు లాటరీ టికెట్‌ని విక్రయించిన సూపర్ మార్కెట్ స్టోర్‌కి కూడా దాదాపు రూ. 7 లక్షల ఫ్రైజ్ మనీని అందజేసింది.
అతను ఆ డబ్బును తన కుటుంబం కోసం, వ్యాపారం కోసం వినయోగించనున్నట్లు చెప్పాడు. చాలావరకు అమెరికన్లు ఇలాంటి లాటరీ టికెట్లను సూపర్ మార్కెట్‌లలోనూ, గ్యాస్‌స్టేషన్‌లలోనూ కొనుగోలు చేస్తుంటారు. గతంలో కూడా ఇలానే చాలామంది కనివినీ ఎరుగని రీతిలో ఊహించనంత పెద్ద మొత్తంలో డబ్బును సొంతం చేసుకున్నారు.
(చదవండి: బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....)
Comments
Please login to add a commentAdd a comment