Lottery-England: Married Couple Wins Britain Biggest Ever Lottery Jackpot Of 1800 Crores - Sakshi
Sakshi News home page

Jackpot Wins Married Couple: అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట 

Published Fri, May 20 2022 8:04 AM | Last Updated on Fri, May 20 2022 11:26 AM

England: Married Couple Wins Britain Biggest Ever Lottery Jackpot Of 1800 Crores - Sakshi

లండన్‌: యూకేలోనే అతిపెద్ద యూరో మిలియన్స్‌ లాటరీని లండన్‌లోని గ్లూసెస్టర్‌కు చెందిన జంట గెలుచుకుంది. గురువారం నిర్వహించిన లక్కీడిప్‌లో జో(49), జెస్‌థ్వైట్‌(44) అనే దంపతులు సుమారు రూ.1,800 కోట్ల (184 మిలియన్‌ పౌండ్ల) జాక్‌పాట్‌ కొట్టేశారు. దీంతో, సాధారణ జీవితం గడుపుతున్న వీరు రాత్రికి రాత్రే కుబేరులైపోయారు.

భరత జో.. కమ్యూనికేషన్స్‌ సేల్స్‌ మేనేజర్‌ కాగా, జెస్‌ హెయిర్‌ డ్రెస్సింగ్‌ సెలూన్‌ నిర్వహిస్తోంది. వీరికి స్కూలుకెళ్లే వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. తమ కలలను సాకారం చేసుకునే గొప్ప అవకాశం వచ్చిందని జో, జెస్‌ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, 2019 అక్టోబర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి 170 మిలియన్‌ పౌండ్ల భారీ లాటరీ గెలుచుకోవడమే ఇప్పటి దాకా రికార్డుగా ఉంది. ఈ రికార్డును జో జంట తుడిచిపెట్టారు.
చదవండి: ఇదేం చిత్రం.. ముసుగు వేసుకుని వార్తలు చదవాలట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement