సినీ నటి ఇంట్లో పనివాడు.. కట్‌ చేస్తే ఆ అలవాటే కోటీశ్వరుడిని చేసింది! | Assam Native Who Worked In Film Actors House Got Summer Bumper Lottery Rs 10 Crore | Sakshi
Sakshi News home page

సినీ నటి ఇంట్లో పనివాడు.. కట్‌ చేస్తే ఆ అలవాటే కోటీశ్వరుడిని చేసింది!

Published Tue, Mar 21 2023 11:07 AM | Last Updated on Tue, Mar 21 2023 12:00 PM

Assam Native Who Worked In Film Actors House Got Summer Bumper Lottery Rs 10 Crore - Sakshi

అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో ఎవరూ ఊహించలేదు. కొంతమంది ఒక్కోసారి రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ఘటనలు ఉన్నాయి. సరిగ్గా ఈ తరహాలోనే.. ఓ నటి ఇంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ఒక్కసారిగా ధనవంతుడిగా మారడు. ఎలాగో తెలుసుకుందాం.

బంపర్‌ లాటరీ.. దెబ్బకు దశ తిరిగింది
వివరాల్లోకి వెళితే.. అసోంకు చెందిన ఆల్బర్ట్ టిగా 1995లో పని కోసం కేరళకు వచ్చాడు. గత కొన్ని సంవత్సరాలుగా రజిని చాందీ అనే సినీ నటి ఇంట్లో అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఎప్పటిలానే ఇటీవల కూడా ఎస్​ఈ 222282 టికెట్‌​ కొన్నాడు. అయితే ఈసారి 

అతని లక్‌ మామూలుగా లేదు. కేరళ లాటరీ డిపార్డ్​మెంట్​ 'సమ్మర్​ బంపర్​ బీఆర్​ 90 లాటరీ'  విడుదల చేసిన ఫలితాలలో ఆల్బర్ట్‌కి  ఏకంగా రూ. 10 కోట్ల బంపర్​ లాటరీ తగిలింది. తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ డ్రా జరిగింది.

మొదటి బహుమతి పది కోట్లు కాగా రెండవ బహుమతి టికెట్ నంబర్ SB 152330కి లభించింది. ఎర్నాకులంలో విక్రయించిన టిక్కెట్‌లకు మొదటి, రెండు బహుమతులు లభించాయి. బంపర్‌ లాటరీ గెలుచుకున్న అల్బర్ట్​ ఇందుకు చేయవలసిన ప్రాసెస్​ పూర్తి చేసుకుని టికెట్​ను కొచ్చిలోని ఓ బ్యాంకులో తన లాటరీ టికెట్‌ను సమర్పించాడు. ఇక ఈ లాటరీ లక్కీ డ్రాలో.. రెండో బహుమతి రూ.50 లక్షలు, మూడో బహుమతి ఐదు లక్షలు, నాలుగో బహుమతి విజేతకు లక్ష రూపాయలు, ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు లభిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement