Bumper Prize
-
‘బెంగళూరు గోల్డ్ షాపింగ్ ఫెస్టివల్’లో మెరిసిన జీఆర్టీ కస్టమర్లు
బెంగళూరు: అతిపెద్ద గోల్డ్ షాపింగ్ పండుగ ‘బెంగళూరు గోల్డ్ షాపింగ్ ఫెస్టివల్’లో జీఆర్టీ జ్యువెలర్స్ కస్టమర్లు మెరిశారు. పండుగ సీజన్లో ‘జ్యుయెలర్స్ ఆసోసియేషన్ బెంగళూర్’ నిర్వహించిన బంపర్ ప్రైజ్, లక్కీ డ్రా పోటీల్లో 177 మంది జీఆర్టీ జ్యువెలర్స్ కస్టమర్లు 20 గ్రాముల బంగారం నాణేల నుంచి 1 కేజీ వెండి వరకూ బహుమతులు గెలుపొందినట్లు కంపెనీ తెలిపింది. విజేతలందకీ జీఆర్టీ జ్యువెలర్స్ సంస్థ ఎండీలు జీఆర్ ఆనంద్ అనంతపద్మనాభన్, జీఆర్ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. -
ఇది కదా లక్ అంటే.. గంటలో కోటి!
Nagaland State Lottery: ఏదో అదృష్టం కలిసి వస్తుందని చాలామంది లాటరీలు కొంటారు. మరికొందరైతే ఏళ్ల తరబడి లాటరీ టికెట్లు కొంటూనే ఉంటారు. ఆ బంపర్ఎ ప్రైజ్ తమకు ఎప్పుడు తగులుతుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ లాటరీ టిక్కెట్ కొన్న గంటకే కోటి రూపాయలు గెలుచుకోవడం గురించి విన్నారా? పంజాబ్‌లో ఒక వ్యక్తికి ఇలాంటి జాక్‌పాట్ తగిలింది. ఈ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కావడం అతని వంతైంది. వివరాలను పరిశీలిస్తే.. పంజాబ్, గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన రూపీందర్‌జిత్ సింగ్ అగ్రికల్చర్ డెవలెప్మెంట్ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. అందరిలాగారే ఈయన కూడా గత ఏడాది కాలంగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు కానీ ఇంత తొందరగా లక్ష్మీ దేవి తన ఇంటికి నడిచి వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!) ఎప్పటిలాగే రూపీందర్‌జిత్ సింగ్ శనివారం మధ్యాహ్నం నాగాల్యాండ్ లాటరీ టిక్కెట్లు రూ.6 పెట్టి 25 టికెట్లను కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆఫీసుకెళ్లి తన పనిలో నిమగ్నమైపోయాడు. ఇంతలో దాదాపు గంట తరువాత లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఏకం రూ. కోటి గెలుచుకున్నట్టు సమాచారం అందించడంతో ఎగిరి గంతేశాడు రూపిందర్. ఇన్నళ్లకి తన కల నెలవేరిందని, ఈ డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానన్నారు. అంతేకాదు ఆపదలో ఉన్న పేదలకు కూడా సాయం చేస్తానని చెప్పాడు రూపీందర్ కొండంత సంబరంతో. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?) తన అలవాటే తనను కోటీశ్వరుడిని చేసిందని రూపిందర్జిత్ చెప్పాడు. లాటరీని గెలుచుకున్నందుకు బ్యాంకు సిబ్బంది అభినందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్లు చేశారు. కాగా గతంలో ఇదే ప్రాంతంలో కిరాణా దుకాణం యజమానికి రూ.2.5 కోట్ల లాటరీ బంపర్ ప్రైజ్ వచ్చింది. మరోసారి బంపర్ ప్రైజ్ గెలవడంతో డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగింది. ( -
సినీ నటి ఇంట్లో పనివాడు.. కట్ చేస్తే ఆ అలవాటే కోటీశ్వరుడిని చేసింది!
అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో ఎవరూ ఊహించలేదు. కొంతమంది ఒక్కోసారి రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ఘటనలు ఉన్నాయి. సరిగ్గా ఈ తరహాలోనే.. ఓ నటి ఇంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఒక్కసారిగా ధనవంతుడిగా మారడు. ఎలాగో తెలుసుకుందాం. బంపర్ లాటరీ.. దెబ్బకు దశ తిరిగింది వివరాల్లోకి వెళితే.. అసోంకు చెందిన ఆల్బర్ట్ టిగా 1995లో పని కోసం కేరళకు వచ్చాడు. గత కొన్ని సంవత్సరాలుగా రజిని చాందీ అనే సినీ నటి ఇంట్లో అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఎప్పటిలానే ఇటీవల కూడా ఎస్ఈ 222282 టికెట్ కొన్నాడు. అయితే ఈసారి అతని లక్ మామూలుగా లేదు. కేరళ లాటరీ డిపార్డ్మెంట్ 'సమ్మర్ బంపర్ బీఆర్ 90 లాటరీ' విడుదల చేసిన ఫలితాలలో ఆల్బర్ట్‌కి ఏకంగా రూ. 10 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. తిరువనంతపురంలోని గోర్కీ భవన్లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ డ్రా జరిగింది. మొదటి బహుమతి పది కోట్లు కాగా రెండవ బహుమతి టికెట్ నంబర్ SB 152330కి లభించింది. ఎర్నాకులంలో విక్రయించిన టిక్కెట్లకు మొదటి, రెండు బహుమతులు లభించాయి. బంపర్ లాటరీ గెలుచుకున్న అల్బర్ట్ ఇందుకు చేయవలసిన ప్రాసెస్ పూర్తి చేసుకుని టికెట్‌ను కొచ్చిలోని ఓ బ్యాంకులో తన లాటరీ టికెట్‌ను సమర్పించాడు. ఇక ఈ లాటరీ లక్కీ డ్రాలో.. రెండో బహుమతి రూ.50 లక్షలు, మూడో బహుమతి ఐదు లక్షలు, నాలుగో బహుమతి విజేతకు లక్ష రూపాయలు, ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు లభిస్తుంది. -
కళ్లు చెదిరే ఆఫర్, ఈ బైక్ కొంటే రూ.1లక్ష వరకు..!
బైక్ లవర్స్‌కు యమహా ఇండియా మోటార్ కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది.ఇండిపెండెన్స్ డే సందర్భంగా పలు వాహనాలపై గిఫ్ట్ ఓచర్లు, రూ.1లక్ష విలువైన బంపర్ ఫ్రైజ్లను అందిస్తున్నట్లు యమహా ప్రకటించింది. కరోనా కారణంగా చతికిల పడ్డ ఆటోమోబైల్ సంస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కష్టమర్లు లేక ఇబ్బందులు పడ్డ పలు ఆటో మొబైల్ సంస్థలు ఆఫర్లు ప్రకటించి సేల్స్‌ను పెంచుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, యమహా రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ, యమహా రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ, నాన్ ఐబ్రిడ్ వెహికల్ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ వెహికల్స్ ను ఆగస్ట్ 31లోగా కొనుగోలు చేస్తే రూ.2,999 గిఫ్ట్ ఓచర్స్, రూ.20వేల వరకు అడిషనల్ బెన్ ఫిట్స్ పొందవచ్చని యమహా ఇండియా మోటార్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఒక్క తమిళనాడు మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో యమహా రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ, యమహా రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ, నాన్ ఐబ్రిడ్ వెహికల్ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ వెహికల్స్ కొనుగోలు చేసిన వాహనదారులకు రూ.3,876 ఇన్స్యూరెన్స్ బెన్ ఫిట్స్, రూ.999కే లో డౌన్ పేమెంట్స్ తో బైక్ ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు రూ. 2,999 విలువైన గిఫ్ట్‌ను అందిస్తుంది. తమిళనాడులో యమహా బైక్ కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా రూ.30వేల విలువైన గిఫ్ట్ తో పాటు బంపర్ ఆఫర్ కింద రూ.1లక్ష రూపాయల్ని సొంతం చేసుకోవడమే కాదు..అడిషనల్ బెన్ ఫిట్స్ కింద రూ.20 వేలు దక్కించుకోవచ్చు. ఇక మిగిలిన అన్నీ మోడల్స్ పై రూ. 2,999 విలువైన బహుమతులు, రూ.20వేల అడిషనల్ బెన్ ఫిట్స్‌ను పొందవచ్చు. చదవండి: ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది -
క్రికెట్ ప్రేమికులకు జియో శుభవార్త
హైదరాబాద్ : ఐపీఎల్ మజాను ఆస్వాధించే ప్రేక్షకులకు జియో నెట్వర్క్ ఒక శుభవార్త చెప్పింది. జియో యూజర్లతో పాటు నాన్ జియో యూజర్లు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' యాప్ ద్వారా విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు గేమ్‌లో పాల్గొనేవారు తమ నైపుణ్యతను మెరుగుపరుచుకునేలా ప్రశ్నలను రూపొందించడంతో పాటు ఎంటర్టైన్మెంట్ను అందించనుంది. దీనికి అదనంగా ప్రీ-మ్యాచ్ ప్రశ్నలు, పోల్స్, క్విజ్‌లతో పాటు మీ ఫేవరెట్ టీమ్‌కు స్టికర్ చాట్ ఏర్పాటు, స్కోర్లు, మ్యాచ్ షెడ్యూల్లు, ఫలితాలను యాక్సస్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ‘డైలీ రివార్డ్స్’ ద్వారా పాల్గొనేవారు ప్రతిరోజూ బహుమతులు గెలుచుకోవచ్చు.. అంతేగాక ‘డైలీ ఛాలెంజెస్’ పూర్తి చేసిన తర్వాత బంపర్ బహుమతులు కూడా అందుకోవచ్చు. గేమ్ ప్రారంభమయ్యే ముందు రోజువారీ టాస్క్‌ల్లో భాగంగా గెలిచినవారికి అందించే బంపర్ ప్రైజ్ ఎంటనేది ముందే ప్రదర్శించడం జరుగుతుంది. కరోనా నేపథ్యంలో క్రికెట్ సీజన్‌ను ఎంజాయ్ చేస్తూ 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్'తో గెలుద్దాం! ఈ 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' గేమ్‌ను మై జియో యాప్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మై జియో యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రికెట్ సీజన్లో జియో యూజర్లతో పాటు జియోయేతర యూజర్లు గేమ్‌ను ఆడి మంచి బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. -
బహుమతి పేరిట టోకరా
♦ రూ.4వేలు కడితే రూ.16వేల ఫోన్ ఇస్తామంటూ ఫోన్ ♦ రేకుల బొమ్మలు రావడంతో ఖంగు తిన్న గిరిజనుడు ఉప్పరగూడెం(కురవి): ‘మీ సెల్ నంబర్‌కు బంపర్ ప్రైజ్ వచ్చింది... డ్రాలో మీరు ఈ బహుమతి గెలుచుకున్నారు’ అంటూ వచ్చిన ఫోన్‌తో ఉబ్బితబ్బిబ్బయ్యాడు ఓ గిరిజనుడు.. ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి మాటన్నీ నమ్మేశాడు. ఇంకేం ఆయన చెప్పినట్లుగా డబ్బులు కట్టగా బహుమతి మాటేమో కానీ.. ఇనుపు రేకుతో చేసిన ప్రతిమలు ఉండడంతో మోసపోయానని గుర్తించాడు. ఈ మేరకు వివరాలిలా ఉన్నాయి. కురవి మండలంలోని ఉప్పరగూడెం శివారు తుకా తండాకు చెందిన బానోతు రమేష్ ఫోన్‌కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్(9136160142) చేశాడు. ‘మీ నంబర్ డ్రాలో వేశాం.. బంపర్‌ప్రైజ్ వచ్చింది.. రూ.18వేల సామ్సంగ్ ఫోన్ బహుమతిగా ఇవ్వనున్నాం.. దీని కోసం రూ.4వేలు చెల్లించాల్సి ఉంటుంది’ అని నమ్మబలికారు. అయితే, రూ.4వేలకు రూ.16వేల ఫోన్ ఇస్తారా అని రమేష్ ప్రశ్నిస్తే ‘డ్రాలో మీ నంబర్ వచ్చింది కాబట్టి బహుమతిగా ఇస్తున్నాం’ అని ఆగంతకుడు చెప్పాడు. దీంతో రమేష్ అంగీకరించాడు. ఈ మేరకు బుధవారం పోస్టాఫీస్‌కు రమేష్ పేరుపై ఒక పార్సిల్ వచ్చింది. పోస్ట్‌మెన్‌కు రూ.4వేలు చెల్లించి ఆ పార్సిల్ తీసుకున్న రమేష్ తెరిచి చూడగా నాలుగు ఇత్తడి రంగులో ఉన్న రేకుల బొమ్మలు కనిపించాయి. ఒకటి తాబేలు, శ్రీచక్రం, లక్ష్మీదేవి, పాదుకల బొమ్మలు ఉండడంతో ఖంగు తిన్న రమేష్ తాను మోసిపోయినట్లు గుర్తించాడు. ఈ మేరకు తనను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రమేష్ కోరారు. -
రోజుకొకరు లక్షాధికారి
మళ్లీ వచ్చిన ‘సాక్షి’ పండుగ సంబరాలు సనత్‌నగర్: ఏటేటా ఇంటింటా సిరుల పంటను కురిపించే ‘సాక్షి’ పండుగ సంబరాలు మళ్లీ వచ్చేశాయి. రోజుకొకరిని లక్షాధికారిని చేస్తూ దసరా పండుగ ఆనందాన్ని ముందస్తుగానే ఇంటికి తెచ్చే ఈ సంబరాలు ఆదివారం అమీర్‌పేట్ లాట్ మొబైల్స్‌లో ఆరంభమయ్యాయి. లాట్ మొబైల్స్ ఏజీఎం(సేల్స్) రాజేశ్ నల్లారి డ్రా తీశారు. ఇందులో వరుణ్ మోటార్స్‌లో వెగనార్ కారును కొనుగోలు చేసిన ఎ. సుధీర్ లక్ష రూపాయల బంపర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. దీంతో పాటు మొదటి, రెండు బహుమతులు (మ్యూజిక్ సిస్టమ్, వెట్ గ్రైండర్), మూడు కన్సొలేషన్ బహుమతుల (సెల్కాన్ మొబైల్స్)కు డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. షాపింగ్ చేయండి... రూ. లక్ష గెలుచుకోండి.. ఈ నెల 22 వరకు సాక్షిలో ప్రకటించిన షోరూంలలో షాపింగ్ చేసేవారు ఈ సంబరాల్లో పాల్గొనవచ్చు. ప్రతిరోజూ బంపర్‌ప్రైజ్ కింద లక్ష రూపాయలతో పాటు మరో ఐదుగురికి బహుమతులు అందిస్తాం అని ‘సాక్షి’ అడ్వర్టయిజింగ్ జనరల్ మేనేజర్ రమణ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో లాట్ మొబైల్స్ రీజనల్ సేల్స్ మేనేజర్ వినయ్, బిగ్ ఎఫ్ఎం ఆర్జే శేఖర్ బాషా, ‘సాక్షి’ అడ్వర్టయిజింగ్ ఏజీఎం వినోద్ మాదాసులు పాల్గొన్నారు. ఎదురుచూస్తున్నారు.. ‘సాక్షి’ పండుగ సంబరాలు మళ్లీ ఎప్పుడొస్తాయా? అని కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. గతంలో బహుమతులు గెలిచిన వారి ద్వారా ఈ సంబరాలు ప్రతిఒక్కరి మనసును గెలుచుకున్నాయి. ఈ సంబరాలు అటు కస్టమర్లను లక్షాధికారి చేయడంతో పాటు ఇటు వ్యాపారపరంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. మున్ముందు కూడా ‘సాక్షి’ చేపట్టే కార్యక్రమాల్లో ఇదేవిధమైన భాగస్వామిగా నిలుస్తామని సగర్వంగా చెబుతున్నా. - రాజేశ్ నల్లారి, లాట్ మొబైల్స్ ఏజీఎం (సేల్స్) -
26,27 తేదీల్లో సాక్షి మెగా ఆటో షో
ఎంవీపీ కాలనీ వుడా గ్రౌండ్ వేదిక రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ ఏ వాహనం బుక్ చేసుకున్నా బంపర్ బహుమతి ఉచిత పొల్యూషన్ చెకప్, సర్వీస్ క్యాంప్ విశాఖపట్నం : కారు...బైక్...ఆటో...స్కూటర్ కొనుక్కోవాలనుకుంటున్నారా.. అయితే ‘సాక్షి’ మీ కు సువర్ణావకాశం కల్పించనుంది. కళ్లు చెది రేలా అన్ని కంపెనీల మోడల్స్‌ను ఒకే వేదిక పైకి తేనుంది. ఎంవీపీ కాలనీ వుడా గ్రౌండ్ వేది కగా ఈ నెల 26, 27 వ తేదీల్లో సాక్షి మెగా ఆటో షో నిర్వహించనుంది. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సందర్శించవచ్చు. నచ్చిన వాహనాన్ని బుక్ చేసుకొని లక్కీ డ్రా ద్వారా సుజికి లెట్స్ ద్విచక్రవాహనాన్ని బంపర్ బహుమతిగా పొందే అవకాశం ఈ ఆటో షో కల్పిస్తోంది. ఇక్కడ వాహనాలు కొనుక్కున్న వారికి ప్రత్యేక రాయితీ సౌకర్యముంది. ప్రముఖ బ్యాంకుల ద్వారా తక్షణ ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వరుణ్‌బజాజ్ సౌజన్యంతో అన్ని కంపెనీల టూ వీలర్, నాలుగు చక్రాల వాహనాలకు ఉచిత పొల్యూషన్ చెకప్ చేయనున్నారు. అలాగే అన్ని కంపెనీల టూ వీలర్స్‌కు ఉచిత సర్వీస్ క్వాంప్ నిర్వహించనున్నారు. ఈ మెగా షోకు రేడియో పార్టనర్‌గా రేడియో మిర్చి, టీవీ పార్టనర్‌గా సాక్షి టీవీ వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు రోజులు జరిగే ఈ షోలో కంటిపూడి నిస్సాన్, లీలా కృష్ణా టయోటా, శ్రీ శ్రీనివాస యమహా, బాంక్ ఆఫ్ ఇండియా, వరుణ్ మారుతి, జయభేరి మారుతి, వరుణ్‌బజాజ్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, నియాన్ మహేంద్ర, సుందరం హోండా, విష్ణు హోండా, రెనాల్ట్- వైజాగ్, మేంగో హ్యుండాయ్, శివశంకర్ హీరో మోటార్స్, ఆరంజ్ చెవర్లెట్, లక్ష్మీ హ్యుండాయ్, వైజాగ్-సుజుకి, శివశంకర్ టాటా మోటార్స్, ఎస్.వి.పియాజియా మోటార్స్, వరుణ్ బజాజ్ ఆటో కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శించనున్నాయి. ఈ షోలో పాల్గోదలచిన ఆటోమొబైల్ డీలర్లు 9912877822, 9912222796 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. -
సాక్షి బంపర్ ప్రైజ్ విజేత మల్లీశ్వరి
= టీఎంసీలో పన్నెండో డ్రా నిర్వహణ = డ్రా తీసిన తనిష్క్ ప్రతినిధి మహిధర్ = ప్రధాన స్పాన్సర్లు కళానికేతన్, టీఎంసీ విజయవాడ, న్యూస్‌లైన్ : సాక్షి పండుగ సంబరాల్లో భాగంగా మహాత్మాగాంధీ రోడ్డులోని తిరుమల మ్యూజిక్ సెంటర్(టీఎంసీ)లో ఆహ్లాదభరితమైన వాతావరణంలో శుక్రవారం పన్నెండో డ్రాను వేడుకలా నిర్వహించారు. ఆ షోరూమ్‌లోని కస్టమర్లు, సిబ్బంది హర్షధ్వానాల మధ్య తనిష్క్ జ్యూయలరీ ఏరియా బిజినెస్ మేనేజర్ బీ మహిధర్ డ్రా తీసి బంపర్ ప్రైజ్ విజేతను ఎంపిక చేశారు. కళానికేతన్ కస్టమర్ వీ మల్లేశ్వరి(కూపన్ నం. 26218) బంపర్ ప్రైజ్ విజేతగా నిలిచి లక్ష రూపాయల నగదు బహుమతి గెలుచుకున్నారు. అనంతరం పలువురు డ్రాతీసి ఆరుగురు విజేతలను ఎంపిక చేశారు. వారిలో మొదటి బహుమతిగా ఎల్ఈడీ టీవీ, ద్వితీయ బహుమతిగా ఫర్నిచర్, తృతీయ బహుమతిగా కెమెరాతో పాటు మరో ముగ్గురికి కన్సోలేషన్ బహుమతులుగా సెల్ఫోన్లను అందజేయనున్నారు. ఇప్పటి వరకూ వివిధ షోరూమ్‌లలో పన్నెండు డ్రాలు నిర్వహించి పన్నెండు మందిని లక్షాధికారులుగా ఎంపిక చేశారు. వారిలో ఆరుగురు కళానికేతన్ కస్టమర్లు కాగా, ఇద్దరు బిగ్‌సీ కస్టమర్లు, చర్మాస్, బాబూటెక్స్టైల్స్, ఆయుర్ సుఖ, మన కళ్యాణ వేధికకు చెందిన ఒక్కో కస్టమర్ బంపర్ ప్రైజ్ గెలుపొందారు. కళానికేతన్, టీఎంసీ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న సాక్షి పండుగ సంబరాలు డిసెంబరు 22న ప్రారంభం కాగా 5వ తేదీ వరకు కొనసాగుతాయి. విశేష స్పందన... సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండుగ సంబరాలకు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తోంది. నగరంలో పన్నెండు రోజులుగా నిర్వహిస్తున్న డ్రాలు వేడుకలా జరుగుతున్నాయి. సాక్షి పండుగ సంబరాలు జరుపుకుంటున్న షోరూమ్‌లలో కస్టమర్లు ఎంతో ఆసక్తిగా డ్రా కూపన్లు పూర్తి చేస్తున్నారు. ఈ పండుగ సంబరాలతో తమ షోరూమ్‌లలో 25 శాతం సేల్స్ పెరిగాయని స్వయంగా నిర్వాహకులు చెప్పడం గమనార్హం. సాక్షి డ్రా నిర్వహిస్తున్న తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో నిబద్ధతతో ముందు రోజు విన్నర్‌గా నిలిచిన వారితో డ్రా తీయించి విజేతను ఎంపిక చేయడమనేది గొప్ప విషయమని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ డ్రా అంటే సెలబ్రిటీలతో తీయించే వారని, కానీ సాక్షి పండుగ సంబరాల్లో విజేతగా నిలిచిన సామాన్య కస్టమర్‌తో డ్రా తీయించడం హర్షణీయమని అభినందిస్తున్నారు. సాక్షి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కస్టమర్లు కోరుకుంటున్నారు. తనిష్క్ జ్యూయలరీ ఏరియా బిజినెస్ మేనేజర్ బీ మహిధర్, టీఎంసీ మేనేజర్ ఏ అశోక్‌కుమార్, సాక్షి రీజినల్ మేనేజర్ (యాడ్స్) సీహెచ్.అరుణ్‌కుమార్, యాడ్స్ మేనేజర్ జేఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పన్నెండో డ్రా విజేతలు.... సాక్షి సంబరాల్లో భాగంగా శుక్రవారం టీఎంసీలో నిర్వహించిన డ్రాలో బంపర్ ప్రైజ్ విజేతగా కళానికేతన్ కస్టమర్ వీ మల్లీశ్వరి(26218) ఎంపిక కాగా, సెల్పాయింట్ కస్టమర్ పీ.రజని(38995) ప్రథమ బహుమతిగా ఎల్ఈడీ టీవీ గెలుపొందారు. సెంట్రల్ అకాడమీ కస్టమర్ ఏ శివప్రసాద్(25135) ద్వితీయ బహుమతిగా ఫర్నిచర్, కుశలవ మోటార్స్ కస్టమర్ ఎస్.ఆనందరావు(23354) కెమెరా గెలుపొందారు. స్వీట్ మ్యాజిక్ కస్టమర్ జీ మీనా(16547), సెల్ పాయింట్ కస్టమర్ లక్ష్మీ(35588), టీఎంసీ కస్టమర్ బీ రాము(18379) కన్సోలేషన్ బహుమతులుగా సెల్ఫోన్లు అందుకున్నారు. వెరీగుడ్ కాంపెయిన్ ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండుగ సంబరాలు వెరీగుడ్ కాంపెయిన్. డ్రా తీసే విధానం చాలా బాగుంది. కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఒకేచోట డ్రా తీయకుండా వేర్వేరు షోరూమ్‌లలో డ్రాలు నిర్వహిస్తూ, లక్ష రూపాయలు బహుమతి పొందిన వారితోనే మరుసటి రోజు డ్రా తీయించడం అనేది మంచి ఉద్దేశం. బహుమతి పొందిన ఆనందంతో పాటు, తాను డ్రా తీసి మరో విజేతను ఎంపిక చేసే అవకాశం కల్పించడం వారికి మర్చిపోలేని మధుర స్మృతులను మిగుల్చుతోంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సాక్షికి అభినందనలు, రానున్న కాలంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నా... - బీ మహిథర్, ఏరియా బిజినెస్ మేనేజర్, తనిష్క్ జ్యూయలరీ