= టీఎంసీలో పన్నెండో డ్రా నిర్వహణ
= డ్రా తీసిన తనిష్క్ ప్రతినిధి మహిధర్
= ప్రధాన స్పాన్సర్లు కళానికేతన్, టీఎంసీ
విజయవాడ, న్యూస్‌లైన్ : సాక్షి పండుగ సంబరాల్లో భాగంగా మహాత్మాగాంధీ రోడ్డులోని తిరుమల మ్యూజిక్ సెంటర్(టీఎంసీ)లో ఆహ్లాదభరితమైన వాతావరణంలో శుక్రవారం పన్నెండో డ్రాను వేడుకలా నిర్వహించారు. ఆ షోరూమ్‌లోని కస్టమర్లు, సిబ్బంది హర్షధ్వానాల మధ్య తనిష్క్ జ్యూయలరీ ఏరియా బిజినెస్ మేనేజర్ బీ మహిధర్ డ్రా తీసి బంపర్ ప్రైజ్ విజేతను ఎంపిక చేశారు. కళానికేతన్ కస్టమర్ వీ మల్లేశ్వరి(కూపన్ నం. 26218) బంపర్ ప్రైజ్ విజేతగా నిలిచి లక్ష రూపాయల నగదు బహుమతి గెలుచుకున్నారు. అనంతరం పలువురు డ్రాతీసి ఆరుగురు విజేతలను ఎంపిక చేశారు.
వారిలో మొదటి బహుమతిగా ఎల్‌ఈడీ టీవీ, ద్వితీయ బహుమతిగా ఫర్నిచర్, తృతీయ బహుమతిగా కెమెరాతో పాటు మరో ముగ్గురికి కన్సోలేషన్ బహుమతులుగా సెల్‌ఫోన్లను అందజేయనున్నారు. ఇప్పటి వరకూ వివిధ షోరూమ్‌లలో పన్నెండు డ్రాలు నిర్వహించి పన్నెండు మందిని లక్షాధికారులుగా ఎంపిక చేశారు. వారిలో ఆరుగురు కళానికేతన్ కస్టమర్లు కాగా, ఇద్దరు బిగ్‌సీ కస్టమర్లు, చర్మాస్, బాబూటెక్స్‌టైల్స్, ఆయుర్ సుఖ, మన కళ్యాణ వేధికకు చెందిన ఒక్కో కస్టమర్ బంపర్ ప్రైజ్ గెలుపొందారు. కళానికేతన్, టీఎంసీ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న సాక్షి పండుగ సంబరాలు డిసెంబరు 22న ప్రారంభం కాగా 5వ తేదీ వరకు కొనసాగుతాయి.
విశేష స్పందన...
సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండుగ సంబరాలకు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తోంది. నగరంలో పన్నెండు రోజులుగా నిర్వహిస్తున్న డ్రాలు వేడుకలా జరుగుతున్నాయి. సాక్షి పండుగ సంబరాలు జరుపుకుంటున్న షోరూమ్‌లలో కస్టమర్లు ఎంతో ఆసక్తిగా డ్రా కూపన్‌లు పూర్తి చేస్తున్నారు. ఈ పండుగ సంబరాలతో తమ షోరూమ్‌లలో 25 శాతం సేల్స్ పెరిగాయని స్వయంగా నిర్వాహకులు చెప్పడం గమనార్హం. సాక్షి డ్రా నిర్వహిస్తున్న తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంతో నిబద్ధతతో ముందు రోజు విన్నర్‌గా నిలిచిన వారితో డ్రా తీయించి విజేతను ఎంపిక చేయడమనేది గొప్ప విషయమని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ డ్రా అంటే సెలబ్రిటీలతో తీయించే వారని, కానీ సాక్షి పండుగ సంబరాల్లో విజేతగా నిలిచిన సామాన్య కస్టమర్‌తో డ్రా తీయించడం హర్షణీయమని అభినందిస్తున్నారు. సాక్షి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కస్టమర్లు కోరుకుంటున్నారు. తనిష్క్ జ్యూయలరీ ఏరియా బిజినెస్ మేనేజర్ బీ మహిధర్, టీఎంసీ మేనేజర్ ఏ అశోక్‌కుమార్, సాక్షి రీజినల్ మేనేజర్ (యాడ్స్) సీహెచ్.అరుణ్‌కుమార్, యాడ్స్ మేనేజర్ జేఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పన్నెండో డ్రా విజేతలు....
సాక్షి సంబరాల్లో భాగంగా శుక్రవారం టీఎంసీలో నిర్వహించిన డ్రాలో బంపర్ ప్రైజ్ విజేతగా కళానికేతన్ కస్టమర్ వీ మల్లీశ్వరి(26218) ఎంపిక కాగా, సెల్‌పాయింట్ కస్టమర్ పీ.రజని(38995) ప్రథమ బహుమతిగా ఎల్‌ఈడీ టీవీ గెలుపొందారు. సెంట్రల్ అకాడమీ కస్టమర్ ఏ శివప్రసాద్(25135) ద్వితీయ బహుమతిగా ఫర్నిచర్, కుశలవ మోటార్స్ కస్టమర్ ఎస్.ఆనందరావు(23354) కెమెరా గెలుపొందారు. స్వీట్ మ్యాజిక్ కస్టమర్ జీ మీనా(16547), సెల్ పాయింట్ కస్టమర్ లక్ష్మీ(35588), టీఎంసీ కస్టమర్ బీ రాము(18379) కన్సోలేషన్ బహుమతులుగా సెల్‌ఫోన్లు అందుకున్నారు.
వెరీగుడ్ కాంపెయిన్
‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండుగ సంబరాలు వెరీగుడ్ కాంపెయిన్. డ్రా తీసే విధానం చాలా బాగుంది. కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఒకేచోట డ్రా తీయకుండా వేర్వేరు షోరూమ్‌లలో డ్రాలు నిర్వహిస్తూ, లక్ష రూపాయలు బహుమతి పొందిన వారితోనే మరుసటి రోజు డ్రా తీయించడం అనేది మంచి ఉద్దేశం. బహుమతి పొందిన ఆనందంతో పాటు, తాను డ్రా తీసి మరో విజేతను ఎంపిక చేసే అవకాశం కల్పించడం వారికి మర్చిపోలేని మధుర స్మృతులను మిగుల్చుతోంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సాక్షికి అభినందనలు, రానున్న కాలంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నా...
- బీ మహిథర్, ఏరియా బిజినెస్ మేనేజర్, తనిష్క్ జ్యూయలరీ
సాక్షి బంపర్ ప్రైజ్ విజేత మల్లీశ్వరి
Published Sat, Jan 4 2014 12:54 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement