Malliswari
-
రాజ్యాంగ పఠనం మన తక్షణావసరం
1949 నవంబర్ 26వ తేదీన, రాజ్యాంగ సభలో భారత ప్రజలు తమకి తాము రాజ్యాంగాన్ని సమర్పించుకున్నారని చరిత్ర చెపుతుంది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ సభ్యులు 284 మంది రాజ్యాంగ ప్రతి మీద సంతకాలు చేశారు. ఆ సమయంలో వానజల్లులు పడుతూ ఉండడం శుభ శకునంగా భావించారట. శాస్త్రీయ దృష్టి కోణం, స్వేచ్ఛ, సమానత్వాల ఆకాంక్షలతో రాసుకున్నది రాజ్యాంగం. ఆ ప్రయత్నపు ఆమోద సమయంలో ఇటు వంటి వ్యక్తీకరణ కాస్త వింతగానే ఉంటుంది. కానీ భారత రాజ్యాంగ రచనా ప్రస్థానం మొత్తం చూస్తే పై విలువలు రాజ్యాంగంలో పాదుకొల్పడానికి ఒంటి చేత్తో పోరాటం చేస్తూ, నిప్పులవాగులో నిరంతరం ఎదురీదిన అంబేడ్కర్ గుర్తుకు వస్తే ఆ చిరుజల్లులు కురవాల్సినవే అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా రాజ్యాంగం ఇపుడు తరుచూ మాట్లాడుకునే అవసరం అయింది. ముఖ్యంగా పీడిత వర్గాలు తమ హృదయాలలో వెలిగించు కున్న ఆశాదీపం అయింది. తమ తమ మతగ్రంథాల కన్నా మిన్నగా రాజ్యాంగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి. భారత రాజ్యాంగం చుట్టూ దాని ఆచరణలో విరోధాభాస కొంత ఉంది. నిజంగా రాజ్యాంగపు రక్షణ తప్పనిసరిగా కావాల్సిన వర్గాల వారు ఆ స్ఫూర్తిని ప్రకటించడం మొదలు పెట్టగానే ఆధిపత్య వర్గాలు, ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని హైజాక్ చేసే ప్రయత్నాలు మొదలు పెడతాయి. రాజ్యాంగం శ్రమజీవులను విముక్తి చేయగలదా అన్న ప్రశ్నకి జవాబు అంత సులువు కాదు. రాజ్యాంగం ద్వారా సాధించుకోవలసిన విలువలను గుర్తిస్తూనే ఆచరణలో ఆ విలువలను నిలబెట్టలేని పరిమితులు కూడా రాజ్యాంగంలో ఉన్నాయన్నది గ్రహించాలి. ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన శక్తిమంతమైన ఆయుధం ‘ఓటు’ అనుకుంటాము కదా! తమని తాము పరిపాలించుకోవడానికి తమని తామే ఎన్నుకునే వ్యవస్థ మనది. దాని ప్రకారం మెజారిటీ ప్రజలు తమ సంక్షేమానికి పాటుపడే పార్టీలని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్నుకుంటారు. మరి ఆచరణలో ఇంత సింపుల్‌గా జరుతున్నదా? కొన్నేళ్ళ కిందట ‘న్యూటన్’ అని ఒక సినిమా వచ్చింది. ఎన్నికలు ఎంత ఫార్స్‌గా మారిపోయాయో మనసుకు హత్తుకునేట్లు చెప్పడం కోసం త్రిముఖ నేపథ్యాన్ని తీసుకున్నారు. ప్రజల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ సాధనాలతో పోరాడే మావోయిస్టులు, ఎన్నికలని నిజాయితీగా జరిపించాలనుకునే పోలింగ్ బూత్ అధికారి, ఓటు అంటే తెలియని అమాయకపు ఆదివాసీలు – ఈ ముప్పేట కథనంతో భారత ప్రజాస్వామ్యపు లొసుగులను కళ్ళకి కట్టినట్లు చూపించారు. రాజ్యాంగంలో తాము ఏమి హక్కులు పొందు పరుచుకున్నారో తెలియని ప్రజలు కోట్లాది మంది. ఓటుని హక్కుగా ప్రజలకి ఇవ్వగలిగిన రాజ్యాంగం, ఇన్నేళ్లలో ఆ ఓటు చుట్టూ ఉన్న దట్టమైన డబ్బు అల్లికని తెంపలేకపోయింది. అనేక మౌలిక హక్కు లను ప్రకటించిన రాజ్యాంగం దొంతర్లుగా పేరుకు పోయిన అంతరాలను తగ్గించలేకపోయింది. అలాగని ఇప్పటికిపుడు దేశవ్యాప్తంగా అందరినీ సమానత్వపు తాటిమీదకి తెచ్చే పూర్తి భరోసాని ఏ రాజ కీయాలూ ఇవ్వలేకపోతున్నాయి. కులం, మతం, వర్గం, జెండర్ తదితర అంశాలలోని ఆధిపత్య శక్తులని అదుపు చేయగలిగే తక్షణ రక్షణ కవచంగా రాజ్యాంగం మాత్రమే కనిపిస్తోంది. సూక్ష్మస్థాయి సంగతి సరే, స్థూలంగానైనా మేళ్ళు జరగాలంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపా డుకోవడానికి పోరాటం చేయక తప్పదు. రాజ్యాంగాన్ని అక్కున చేర్చుకోక తప్పదు. గత పదేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనలు అపరిమితంగా పెరిగిపోయాయి. తినడానికి ఒక ముద్ద తక్కువైనా ఓర్చుకోగలిగే మనుషులు, తమ విశ్వాసాల పట్ల నిక్క చ్చిగా స్వాభిమానంతో ఉంటారు. భిన్నమతాలకి నిలయమైన ఇండియాలో మైనార్టీలకి హక్కులకి రక్షణ ఉండాలని, మతాల మధ్య చిచ్చు రేగకూడదనే భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది రాజ్యాంగం. దాని ప్రకారం భారత ప్రజలు మతస్వేచ్ఛని కలిగి ఉంటారు. ప్రజలని పరిపాలించే ప్రభుత్వాలు మాత్రం మతాతీతంగా పరిపాలన చేయాలి. కానీ మనుషులు పౌరులుగా కాక ఓటుబాంకులుగా కనపడడం మొదలయ్యాక మత సామ రస్యం కాలం చెల్లిన విలువ అయిపోయింది. ఇక మెజారిటీ మత రాజ్యస్థాపన లక్ష్యంగా కలిగిన పార్టీలు పరిపాల నలోకి రావడం వల్ల రాజ్యాంగస్ఫూర్తి మరింత క్షీణించింది. మన వ్యక్తిగత విశ్వాసాలు, భావోద్వేగాలకి రాజ్యాంగం విలువ ఇచ్చినట్లే, మనమే రాసుకున్న రాజ్యాంగం పట్ల మనందరికీ అవగాహన ఏర్పడడం చాలా అవసరం. పౌరులుగా ఎలా మెలగాలన్న రాజకీయ స్పృహని మౌలి కంగా రాజ్యాంగం ఇస్తుంది. రాజకీయాలంటే అయిదేళ్ళ కోసారి వచ్చే ఎన్నికలు, కుల, మత, వర్గ గోదాల్లో నిలబడే అభ్యర్థుల గెలుపోటముల బెట్టింగ్ కాదనీ, అది తరతరాలుగా సమాజాన్ని ప్రభావితం చేయగల చైతన్యమనీ తెలుపుతుంది. ఈ రాజకీయ స్పృహ కలిగిననాడు రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతల ఆలోచన కూడా మొదలవుతుంది. రాజ్యాంగం ఇపుడు మన తక్షణావసరం అన్నామంటే అది బేషరతు కానక్కర్లేదు. రాజ్యాంగ విలువలని కాపాడు కోవడానికి కృషి చేస్తూనే, ఆధిపత్య వర్గాలకి అనువుగా మారే పరిమితులను కూడా గుర్తించాలి. దృఢ అదృఢ లక్షణాలు కలిగిన భారత రాజ్యాంగానికి ఎపుడైనా సవరణ జరిగితే పీడిత ప్రజల ఆకాంక్షలు అందులో ప్రతిఫలించేట్లు జాగరూకులమై ఉండాలి. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రరవే malleswari.kn2008@gmail.com (నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం) -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - భానుమతి
-
ఇప్పటికీ లండన్ భామే!
కత్రినా కైఫ్ ఇండియన్ కాదు. హిందీ రాదు.హిందీ సినిమా ఎలా ఉంటుందో కూడా తెలీదు.ఇలాంటి బ్యాక్ గ్రౌండ్‌తో ఇంకెవరైనా ఇండస్ట్రీకి వచ్చి ఉంటే అసలు నిలబడేవారో.. కాదో.. కానీ కత్రినా మాత్రం దశాబ్దానికి పైగా టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఎలా? ఇలా.. ఇప్పటికీ లండన్ భామే! కత్రినా కైఫ్ పుట్టింది హాంగ్‌కాంగ్‌లో! పెరిగిందంతా లండన్‌లో. కత్రినా తండ్రి మొహమ్మద్ కైఫ్ లండన్‌లో ఓ బిజినెస్‌మేన్. ఆయన మూలాలు భారతదేశంలోనే ఉన్నా, సిటిజన్‌షిప్ మాత్రం అక్కడిదే! కత్రినా సిటిజన్‌షిప్ కూడా ఇంగ్లండ్‌దే! కత్రినా ఇండియన్ సినిమాలో నటిగా స్థిరపడి దాదాపు 14 సంవత్సరాలైనా ఆమె ఇప్పటికీ అక్కడి సిటిజనే! నేటికీ ఈ లండన్ భామ ఇండియాలో వర్కింగ్ వీసా మీదే పనిచేస్తోంది. ‘ఇదేం యాక్టింగ్?’ లండన్‌లో మోడల్‌గా పనిచేస్తున్న రోజుల్లో కత్రినా కైఫ్‌కు బాలీవుడ్లో నటిగా అవకాశం వచ్చింది. బూమ్ (2003) అనే సినిమా అది. రిలీజ్ తర్వాత డిజాస్టర్ అయింది. సినిమా ఫ్లాప్ అవ్వడం కంటే కూడా కత్రినా కైఫ్ నటనకు వచ్చిన రెస్పాన్స్ ఆమెను తీవ్రంగా నిరాశపరచింది. ‘ఇదేం యాక్టింగ్?’ అని అందరూ ట్రోల్ చేశారు. ఆ తర్వాత సినిమాలకూ అదే రెస్పాన్స్. సూపర్ హిట్ సినిమాల్లో నటించాక కూడా, కత్రినా ఈ విమర్శలను అలా ఎదుర్కొంటూనే వచ్చింది. 2010లో వచ్చిన ‘రాజ్‌నీతి’ సినిమాతో మాత్రం కత్రినా నటిగా ఒక పేరు తెచ్చుకుంది. ఇప్పుడిప్పుడే మొదట్లో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్తోంది కత్రినా. బాయ్‌ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లకు కొన్నేళ్లపాటు సూపర్ జోడీ అన్న పేరుండేది. ఎక్కడ చూసినా ఈ ప్రేమ పక్షుల కథలే వినిపించేవి. వీరిద్దరూ కనిపిస్తే అది వార్తే! అలాంటి ప్రేమికులు ఏవోగొడవలొచ్చి విడిపోయారు. సల్మాన్ ఖాన్‌తో విడిపోయాక కూడా కత్రినా కైఫ్ ఆయనతో ఫ్రెండ్‌గా మాత్రం కొనసాగింది. ఇద్దరూ కలిసి సినిమాల్లో నటించారు కూడా! ఇక కొద్దికాలంగా రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో ఉన్న కత్రినా ఈ మధ్యే బ్రేకప్ చెప్పేసింది. రణ్‌బీర్‌తో కూడా విడిపోయాకా ఫ్రెండ్‌గానే కొనసాగుతోంది కత్రినా. తన పర్సనల్ విషయాలగురించి అడిగితే నవ్వి ఊరుకుంటుంది ఆమె. ‘ఇప్పటికైతే సింగిల్’ అని మాత్రం చెప్పింది మొన్నీమధ్య. అమ్మే ధైర్యం! కత్రినా కైఫ్ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. కత్రినా పెరిగిందంతా తల్లితోనే! ‘‘ఫ్రెండ్స్ అంతా వాళ్ల నాన్నల గురించి చెప్తూంటే నాకు ఎలాగో ఉండేది. అంతవరకే. జీవితంలో ఇది లేదని నేనెప్పుడూ బాధపడలేదు. అమ్మ నాకు అన్నీ ఇచ్చింది.’’ అంటుంది కత్రినా. తల్లి సుజాన్నె టుర్కొటెపై కత్రినాకు ఉన్న ప్రేమ అది. కత్రినా తల్లి తన జీవితాన్నంతా సమాజ సేవకే అంకితమిచ్చింది. ఆడపిల్లల చదువుకు, పుట్టగానే తల్లిదండ్రులు వదిలేసిన ఆడపిల్లలను ఆదుకోవడానికి ‘రిలీఫ్ ప్రాజెక్ట్స్ ఇండియా’ ట్రస్ట్ పేరుతో ఆమె సేవలు అందిస్తోంది. ‘‘నాకు ఇన్ని ఇచ్చిన అమ్మకు నేను ఇవ్వగలిగింది ఏదైనా ఉందంటే, తన ఆశయం కోసం పనిచేయడమే’’ అంటుంది కత్రినా. ఆ మాట ప్రకారమే వీలు చిక్కినప్పుడల్లా రిలీఫ్ ప్రాజెక్ట్స్ ఇండియా కోసం కష్టపడుతోంది. మన మల్లీశ్వరి.. బాలీవుడ్ ఎంట్రీతోనే ఫ్లాప్ తెచ్చుకున్న కత్రినా,తెలుగులో మాత్రం ఎంట్రీ ఇస్తూనే మల్లీశ్వరి (2004)అనే కామెడీ సినిమాతో హిట్ కొట్టింది. వెంకటేశ్ ఈ సినిమాకు హీరో. మల్లీశ్వరి తర్వాత ఆ వెంటనే బాలకృష్ణతో అల్లరి పిడుగు (2005) అనే సినిమాలో కనిపించిన కత్రినా, మళ్లీ తెలుగు సినిమా వైపు చూడలేదు. ఈ రెండు సినిమాల్లోనూ ఆమె నటనకు పెద్దగా పేరేం రాలేదు. -
అడవిలాంటి అమ్మాయి
రెండున్నర నెలల కిందట అనుకుంటాను, మొదటిసారి ఆ అమ్మాయిని ఒక తెలుగు రియాలిటీ షోలో చూశాను. ఏదో టాస్క్ ఆడుతున్న సందర్భం అది. ఎవరేం చేస్తున్నారో తెలీని గందరగోళం నడుస్తోంది. ఆ గోలలో నుంచి మీద పడిన వాళ్ళని దులుపుకుని పైకిలేస్తూ ‘రేయ్ దొంగ సచ్చినాళ్ళారా!’ అంటూ చెవులకి ఇంపుగా ఒక తిట్టు తిట్టింది. ఆ ఒక్క మాటని పలికిన తీరులోని చక్కదనాన్ని గ్రహిస్తుండగానే వంద గోళీలు ఒక్కసారిగా గచ్చుమీద పడి గళ్ళున మోగినట్లు నవ్వింది. అంతే! ప్రాణం లేచి వచ్చింది. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి సినిమా టీవీ రంగాల్లో అడవి లాంటి సహజమైన అమ్మాయిని చూడటం! రియాలిటీ షోల వ్యాపార దృక్పథాలు, జయాపజయాల లెక్కలు, సంస్కృతి పరిరక్షణ వాదుల మండిపాట్లు, మేధావుల ఈసడింపుల గురించి కాదు, ఈ పూట అచ్చంగా ఆ అమ్మాయి నవ్వు గురించి మాట్లాడాలని ఉంది. కుందేలు బొమ్మలున్న సౌకర్యవంతమైన దుస్తులు వేసుకుని, వంగకుండా కుంగకుండా నేలమీద కదం తొక్కిన నడక గురించి కూడా మాట్లాడాలి. హాస్యంలో కరుణలో, స్నేహంలో, దుఃఖంలో, పంతంలో, ప్రేమలో, వ్యూహంలో మునిగి, ఔచిత్యంగా తేలిన మాట గురించీ మాట్లాడాలి. పెదాల్ని ఈ చెవినుంచి ఆ చెవివరకూ సాగదీసే ప్రతి కవళికా నవ్వు కాదని, నాభి నుంచి లేచి గుండెలోతుల్ని తాకి అడ్డుకట్ట లేకుండా పైకి తన్నిన జలలాంటి ఆమె నవ్వు గురించి మాట్లాడాలి. గాయని సునీత పాటపై రాసిన కవితలో మద్దూరి నగేష్ బాబు అంటాడు, ‘ఆ అమ్మాయి పాడతా ఉంటే నన్నెవరో బ్రెడ్డులా తరిగేసి పోతారు’ అని. ఈ అమ్మాయిని వింటూ చూస్తూ ఉన్నా అంతే. పాతలోకం ఆడపిల్లల చుట్టూ పేర్చిపెట్టిన చట్రాలు తునాతునకలయి, గుడ్డునుంచి జీవంతో ఉన్న పిట్టపిల్ల బయటికి వచ్చినట్లు, ఆడపిల్ల మనిషిగా రూపాంతరం చెందడం ఎందుకు బావుండదు? బావుండదని, ఇప్పటికీ అమ్మాయిలు అమ్మాయిలుగా ఉంటేనే లోకానికి ఇష్టమని మళ్ళీ ఇంకోసారి తెలిసింది. ముగ్గురు అబ్బాయిలు, ఈ అమ్మాయి కలిసి కూచున్నప్పుడు ‘ఇక్కడ అమ్మాయిలు ఎవరున్నారని!’ అని వాళ్ళలో ఎవరో అన్నమాట పైకి చలోక్తిలా వినిపించింది. కానీ అంతరార్థం ముల్లులా గుచ్చుకుంది. నిర్భీతి, సమర్థత, చొరవ, నైపుణ్యాలు ఉన్న స్త్రీ, స్త్రీ కాదు, పురుషుడే. ‘తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏకైక మగాడు రేణుకా చౌదరి’ అని ఎన్టీఆర్ అన్నపుడు కూడా ఆ ప్రశంస వెనుక ఉన్నది ఫ్యూడల్ భావజాలమే. ఆ రియాలిటీ షో ముగింపు దశలో ఈ అమ్మాయి చుట్టూ రెండు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు బలంగా వినిపిం చాయి. ఇష్టపడినవారు చాలా ఎక్కువ ఇష్టపడితే, వ్యతిరేకించిన వారు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఉద్వేగాలన్నీ పెంచి పోషించినవే కావచ్చు. అయినప్పటికీ స్త్రీలు పొందుతున్న స్వేచ్ఛ మీద ఇంకా ఏదో ఒకరూపంలో కొనసాగుతున్న సెన్సార్‌షిప్‌ని ఈ సందర్భం మళ్ళీ చూపించింది. లోకానికి ఉపయోగపడే అంశాలలోని వివక్షకి నైతిక మద్దతు బలంగా ఉండొచ్చు. కానీ లక్షలాది మంది చూపుని లాక్కున్న అంశం, ఆ మేరకి ప్రజల చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది కనుక అక్కడ కనిపించే వివక్ష మీద కూడా మాట్లాడాలి. ఈ అమ్మాయిని వ్యతిరేకించిన నెటిజన్లు, ముఖ్యంగా ఒకానొక శక్తిశాలి అయిన నటుడి అభిమాన గణాచార్లు వేసిన వీరంగం చెప్పనలవి కాని భాషలో చాలా వయెలెంట్‌గా ఉంది. మనమిప్పటికీ మధ్యయుగాల నాటి జీవుల మధ్య బతుకుతున్నామన్నది గుర్తొస్తే ఎంత అశాంతిగా ఉంటుంది?! స్త్రీలు ఆత్మవిశ్వాసంతో గట్టిగా మాట్లాడితే డామినేషన్, వ్యూహం నిర్మిస్తే మానిప్యులేషన్, స్నేహం చేస్తే బరితెగింపు, గలగలా నవ్వితే కంటగింపు. చివరికి విజయపు కొలమానాలు కూడా పితృస్వామిక తానులో ముక్కలే. ‘నువ్వు నా భార్యవి కాదు, ఎప్పటికీ నాకు గాళ్ ఫ్రెండ్‌లా ఉండాలి’ అని తన సహచరుడు చెప్తుంటాడని ఆ అమ్మాయి చెప్పినపుడు, ‘మగడు వేల్పన పాతమాటది, ప్రాణమిత్రుడ నీకు’ అన్న గురజాడ మాటలు గుర్తుకు వచ్చాయి. స్త్రీ పురుష సంబంధాలను మరింత ఆకర్షణీయంగా, ప్రజాస్వామికంగా చూడటం నమూనాలకి భిన్నం. కనుకనే అన్యోన్యత, అనురాగాల పొదరిల్లు లాంటి భద్ర కుటుంబాలను యథాతథంగా కాపాడుకునే వారినే విజేతలుగా ప్రకటిస్తుంటారు. ఓ అపరాజితా! ప్రియమైన అమ్మాయీ, కాలివేలితో నేలమీద గుండ్రంగా రాస్తూ ఓరగా చూస్తూ పమిట కొంగో, చున్నీ చివర్లో నోటికి అడ్డం పెట్టుకుని, కిసుక్కున నవ్వడం నీకెలాగూ రాదు. కాలికింద చీమ నలక్కుండా ఒద్దిగ్గా మందగమనంతో హంసలా నడవడమూ రాదు. దిగులు మేఘం వచ్చి నెత్తినెక్కినపుడు తప్ప, మాటల్లో వెన్నముద్దను కూరడమూ నీకు రాదు. ఎవరు ఎన్ని మాటలన్నా ‘ఏయ్..ఎహేయ్’ అంటూ తలెగరేయడం తప్ప వెక్కివెక్కి ఏడవడానికి భుజాలు వెతుక్కోవడమూ రాదు. కాబట్టి డియర్ హరితేజా! నువ్వు నీలాగా ఎప్పటిలాగా తిట్టిన లోకం మొఖంమీద కొండలు పగలేసి బండలు కొట్టినట్లు నవ్వాలి. కాళ్ళకి చక్రాలు కట్టుకుని ఉత్సాహంగా చేతులు గాల్లో ఎగరేస్తూ శిఖరానికి పరుగులు తీయాలి. నీ పాటలో మాటలో ఆటలో నటనలో ఇక కొత్తందనాలు చిందులేయాలి. డా. కేఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త కథ, నవలా రచయిత్రి, కార్యదర్శి ప్రరవే (ఏపీ) ఈ–మెయిల్ : malleswari.kn2008@gmail.com -
అత్తగారికి మామిడి ముక్కలు
సమ్సారం సంసారంలో సినిమా మూడు రోజులుగా రమేశ్‌కి అమీర్‌పేట్ కాకతీయ మెస్‌లో భోజనం ఇంత బాగుంటుందని తెలిసొస్తోంది. కొంచెం రష్ ఉన్నా, పెరుగులోకి వచ్చిన వాణ్ణి కనిపెట్టి, వాడి వెనుక నిలబడి, టక్కున టేబుల్ మీద టోకెన్ పెట్టి, వాడు లేచిన వెంటనే సీట్‌ని గ్రాబ్ చేసి, భోజనం చేసి ఇంటికి వస్తున్నాడు. వస్తూ వస్తూ భార్యకు కూడా ఒక మీల్స్ పార్శిల్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నాడు. ‘తిను సుజా’ అని అనడానికి ధైర్యం లేదు. ఆమెకు ఎప్పుడు తినాలని అనిపిస్తే అప్పుడే తింటోంది. ఇదంతా వేసవి వల్లే జరిగిందా అంటే అవునని చెప్పక తప్పదు. అందరికీ ఎండల కష్టాలు వస్తే రమేశ్‌కి మామిడి పండ్లతో కష్టాలు వచ్చాయి. వారం క్రితం తల్లి ఊరి నుంచి వచ్చి కొన్నాళ్లు ఉందామని ఆశ పడింది. తల్లి స్టేషన్లో దిగి ఒక్కతే రాలేదు. వెళ్లి రిసీవ్ చేసుకుందామని రమేశ్ అనుకున్నాడు కాని అది అత్యుత్సాహంగా ఉంటే సుజా హర్ట్ అవుతుంది. అందుకని చాలా క్యాజువల్‌గా ‘అమ్మను ఆటో ఎక్కి రమ్మందామా’ అన్నాడు. ‘ఎందుకులేండి... ఎలాగూ మీరు ఆఫీసుకు వెళ్లే టైమేగా. స్టేషన్ దాకా వెళ్లి మీరే ఆటో ఎక్కించి పంపండి’ అని సుజా అంది. అలా అనే అవకాశం ఇచ్చినందుకు, అలా ఉదారంగా వ్యవహరించే చాన్స్ ఇచ్చినందుకు సుజా ఈగో శాటిస్ఫై అవుతుంటుంది. ఈ విషయం కనిపెట్టే రమేశ్ కాపురాన్ని ‘ఔర్ ఏక్ ధక్కా... మనశ్శాంతి పక్కా’ నినాదంతో నెట్టుకొస్తూ ఉన్నాడు. చివరకు అమ్మ వచ్చింది. ఇంట్లో దిగింది. ఆమెకు రోజూ నాలుగు రకాల కూరలు చేయడం అలవాటు. పెద్ద చేయి. సుజా ఏమో నాలుగు ముక్కలు క్యారెట్ తరిగి ఫ్రై చేసి, ‘పెద్దిరాజు పికిల్’ పేరుతో అమ్మే పచ్చడి సీసాను టేబుల్ మీద పెట్టి, మనం దుబారాగా జీవించడం లేదు అనేలా హంబుల్‌గా సింపుల్‌గా రమేశ్‌కు కూడా అదే తిండి అలవాటు చేసింది. ఇలాంటి టైములో కూరగాయల బుట్ట అందుకుని అలా రైతు బజార్‌కు వెళ్లి కూరగాయలు తెస్తాను అని రమేశ్ అంటే అతడి జీవుడు అనూహ్యమైన పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకే రమేశ్ ‘అమ్మ నాలుగు రకాల కూరలు చేయమంటుంది కాని నువ్వు పడనీకు. నువ్వు మాత్రం ఎక్కడని చేస్తావు. అస్సలు చేయకు’ అని సుజాతో అంటే ఆమె ఆ మాటకు చివుక్కున చూసి ‘ఏమండీ... మీ అమ్మకు నేను కడుపు నిండుగా తిండి పెట్టట్లేదని అందరూ అనుకోవాలనా? ఆమెకు కూరలంటే ఇష్టమైతే ఏం నేను చారు చేసి పెట్టనా? మిరియాల చారు చేసి పెట్టనా? చింతపండు చారు చేసి పెట్టనా? నిమ్మకాయ చారు చేసి పెట్టనా? ఏం ఆఖరుకు టొమాటా చారు కావాలంటే నాలుగు డబ్బులవుతాయని వెరవక అదీ చేసి పెట్టనా? మనింటికి మనిషి వచ్చినప్పుడు నాలుగు రకాల చార్లైనా చేసి పెట్టకపోతే ఎలాగండీ’ అంటుంది. ఆమెను అలా అననిచ్చినందుకు, అంత ఉదారంగా వ్యవహరించేలా చేసిందుకు ఈగో శాటిస్ఫై అయ్యి రమేశ్‌కు డే టు డే లైఫ్ స్మూత్ ఫంక్షనింగ్‌కు అవకాశం వస్తుంది. ఇంత తెలివైన రమేశ్ మామిడి పండ్ల విషయంలో పప్పులో.. సారీ తొక్కలో.. కాలు వేశాడు. నూజివీడు మామిడిపండ్లు కిలో ఎనభై అనంటే అరవైకి బేరం చేసి రెండు కిలోలు పట్టుకొని వచ్చాడు. తల్లికి మామిడిపండ్లంటే ఇష్టం. చిన్నప్పుడు ఊళ్లో తండ్రి బతికి ఉండగా వందా రెండు వందల కాయలు తెప్పించి గడ్డిలో మాగపెట్టి పిల్లలకు పెట్టడమే కాదు తనూ ఇష్టంగా తినేది. అది గుర్తుంది కాబట్టే తెచ్చాడు. తెచ్చి, ఇన్నోసెంట్‌గా వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టి వాటి సంగతి మర్చిపోవాల్సింది. మరుసటి రోజు రాత్రి భోజనం చేస్తూ సుజా తన పక్కన కూర్చుని చాకుతో మామిడి పండు తొక్క తీసి ముక్కలు చేస్తూ ఉండగా నోరు జర్రున జారాడు. ‘అమ్మకు కోసి పెట్టావా?’ అన్నాడు. అంతే. సుజా చివుక్కున చూసింది. పుటుక్కున చాకు కింద పడేసింది. చటుక్కున లేచి నిలబడింది. తటుక్కున డైలాగ్ అందుకుంది. ‘అంటే మీరు కోసి పెట్టమంటేనే నేను పెడతానా? నాకు తెలియదా? నాకు ఆ మాత్రం మనసు ఉండదా. ఊరి నుంచి వచ్చిన మనిషి, మీ అమ్మ, మా అత్తగారు ఇంట్లో ఉంటే ఆమెకు రెండు– మూడు ముక్కలు మామిడి పండు కోసి పెట్టాలన్న ఇంగితం కూడా లేని మనిషినా నేను? కావాలంటే రోజూ పెరుగన్నంలో ఒక ముక్క ఆసాంతం పెట్టనా? నిన్న పెట్టానో లేదో అడగండి. ఇవాళ పెట్టనో లేదో మీ నోటితో మీరే అడిగి నిర్థారణ చేసుకోండి. మనిషి మీద విశ్వాసం ఉండాలండీ. నమ్మకం ఉండాలి. నిశ్చింత ఉండాలి. అసలు అది పక్కన పెట్టండి. పెళ్లయినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడైనా మీరు నన్ను... ఇదిగో ఇది తిను అన్నారా. అదిగో అది తింటావా అని అడిగారా. ఇదిగో మామిడి పండు కోయనా... మ్యాంగో మిల్క్ షేక్ చేసి ఇవ్వనా అని ఒక్కటంటే ఒక్కనాడైనా ఎన్నడైనా అడిగారా? మీ అమ్మ ముందు నన్ను తక్కువ చేయడానికి కాకపోతే ఎందుకండీ ఈ మాటలు... మనిషికో మాట కోడలికో ప్రశంస అన్నారు... పెళ్లయినప్పటి నుంచి చూస్తున్నాను ఒక్కరోజైనా అమ్మా సుజా నువ్వు బాగా చేశావు అని మీ అమ్మా కొడుకులు అనగలిగారా అనడానికి నోరొచ్చిందా అలాంటి నాలికను ఆ దేవుడు మీకిచ్చాడా అని...’ ఆమె ఆ మాటలను ఎంతో దుగ్ధతో నొప్పితో జెన్యూన్ బాధతో చాలా మెల్లగా లోగొంతుకలో అన్నా రమేశ్‌కి అతని తల్లికి రమేశ్ వాళ్ల ఫ్లోర్ మీద ఉన్న మరో రెండు ఫ్లోర్లకి కింద ఉన్న ఇంకో ఐదు ఫ్లోర్లకి వీటితో పాటు చందా నగర్, నిజాం పేట్, రామచంద్రాపురం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లకి స్పష్టంగా వినపడ్డాయి. ఆ తెల్లవారే రమేశ్ తల్లి తన మేనబావగారి చిన కోడలి మరదలు జియాగూడలో గర్భంతో ఉందని ఆమెను చూసి అక్కడే నాలుగురోజులు ఉండి ఊరు వెళిపోతానని ఆటో ఎక్కకుండానే వెళ్లిపోయింది. ఆ వెంటనే ఎక్కడి నుంచో ఒక గండు పిల్లి వచ్చి గ్యాస్ బర్నర్ మీద పడుకుంది. పిల్లి లేవలేదు. అన్నం ఉడకలేదు. ఫ్రెండ్స్‌ని సలహా అడిగితే అమీర్‌పేట కాకతీయ మెస్ బెస్ట్ అని రమేశ్‌కి చెప్పారు. మూడు రోజులుగా ఇది నడుస్తోంది. ఇంకా ఎంతకాలం నడుస్తుందో తెలియదు. అనవసరంగా సుజా మనసును బాధ పెట్టానే అని రమేశ్ బాధ పడని క్షణం లేదు. సుజా అలక మాని తిరిగి మామూలు మనిషి అయ్యి ఆ క్యారెట్ ఫ్రై ఏదో చేసి తన మొహాన కొడితే తప్ప అతడికి తృప్తి లేదు. అదే జరిగిన రోజున ఇష్టదైవానికి గట్టి కొబ్బరి కాయ కొడతానని గాఢంగా మొక్కుకున్నాడు. అయితే ఆ రోజు ఎంతో దూరంలో లేదు మనందరికీ తెలుసు. ఏం... మరో రెండు మూడు నెలలు కాకతీయ మెస్ భోజనం చేస్తే రమేశ్ ఏమైనా అరిగిపోతాడా కరిగిపోతాడా... చోద్యం కాకపోతే. సినిమాలో సంసారం సినిమా: మల్లీశ్వరి వెంకటేశ్ నటించిన మల్లీశ్వరిలో వెంకటేశ్‌కు అన్న నరేశ్, వదిన రాజ్యలక్ష్మి. వెంకటేశ్ ఆ అన్నా వదినలతోనే కలిసి ఉంటాడు. అతడి పెళ్లి గురించి అన్నా వదినలకు పెద్దగా పట్టదు. వెంకటేశ్... యువరాణి కత్రినాతో ప్రేమలో పడతాడు. అయినా అన్నా వదినలు పట్టించుకోరు. వెంకటేశ్ తిడతాడు. ‘తమ్ముడి బ్యాగ్ తీసుకుని ఒకమ్మాయి ఇంటికి ఎందుకొచ్చింది. అసలా అమ్మాయి ఇంటికి వాడెందుకెళ్లాడు. బ్యాగెందుకు మర్చిపోయాడు. అసలు మీ గురించి ఎందుకు అబద్ధాలు చెప్పాడు. ఒకవేళ అమ్మాయిని ఇష్టపడ్డాడా. అందుకే ఇంత కష్టపడ్డాడా. పోనీ ఒకమాటడిగితే నష్టమేమైనా ఉందా’ అని చెడామడా తిడతాడు. చివరకు వెంకటేశ్ కత్రినా వాళ్ల ప్యాలెస్‌కు వెళతాడు. అక్కడే నాలుగురోజులు ఉండాల్సి వస్తుంది. మధ్యలో ఇంటికి ఫోన్ చేస్తాడు. అది భోజనాల టైము. ‘అన్నయ్యా... వదినను నా బండి అప్పుడప్పుడు తుడుస్తుండమని చెప్పు’ అంటాడు. అప్పుడే ఆ ఒదిన పళ్లెం కడిగిన నీళ్లని ఎత్తి బండి మీద గిరాటు వేస్తుంటుంది. ‘మీ వదిన ఏకంగా బండి కడిగేస్తోంది’ అంటాడు అన్న. వాళ్లకు తొమ్మిదేళ్ల కూతురు ఉంటుంది. ‘పాప నీ గురించి బెంగ పెట్టుకుంది... మాట్లాడు’ అని నరేశ్ ఫోన్ పాపకిస్తాడు. వెంకటేశ్ ఫోన్లో ‘ఎందుకమ్మా బెంగ నాల్రోజుల్లో వచ్చేస్తానుగా’ అని అంటే పాప బదులుగా ‘అదేంటి... బాబాయి ఇంక రాడు మనం హాయిగా ఉండొచ్చు అని అమ్మ చెబుతోంది’ అంటుంది. వెంకటేశ్ ఖంగు తింటాడు. కాని ఇదంతా వింటున్న బ్రహ్మానందంతో ‘ఏమిటో మా మధ్యతరగతి అనుబంధాలు డబ్బున్నోళ్లకు తెలియవు’ అని నిట్టూరుస్తాడు. సంసారంలో ఇవన్నీ సరిగమలు. పదనిసలు. అదేంటి.. బాబాయ్ ఇంక రాడు.. మనం హాయిగా ఉండొచ్చని అమ్మ చెబుతోందీ.. సినిమా: ఆకాశమంత తండ్రులు పిల్లలను గారం చేయవచ్చు. కాని తల్లులు నిక్కచ్చిగా ఉంటారు. ‘ఆకాశమంత’ సినిమాలో ప్రకాష్‌రాజ్, ఐశ్వర్యలకు కూతురు పుడుతుంది. ఆ కూతురంటే ప్రకాశ్‌రాజ్‌కు వల్లమాలిన ప్రేమ. కాలు కందకుండా పెంచుకుంటూ ఉంటాడు. పాపకు మూడేళ్లు వస్తాయి. అప్పుడే భార్య బాంబు పేలుస్తుంది. ‘పాపను స్కూల్లో చేర్పించాలి’ అంటుంది. ‘ఇప్పుడే నడవడం నేర్చుకుంది. అప్పుడే స్కూల్ ఏమిటి’ అంటాడు ప్రకాష్‌రాజ్. నథింగ్ డూయింగ్ చేర్పించాల్సిందే అంటుంది ఐశ్వర్య. అంతే కాదు ‘పేరెంట్స్‌కు కూడా ఇంటర్వూ్య ఉంటుంది. ప్రిపేర్ అవ్వండి’ అని పుస్తకాలు నెత్తిన పడేస్తుంది. ఇంట్లో మాక్ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తుంటుంది. ఒక టెస్ట్‌లో ప్రకాష్‌రాజ్ జపాన్ రాజధాని ‘నోక్యో’ అని రాస్తాడు. ఈ సంగతి తెలిసి అతడు పని చేసే టీ ఎస్టేట్‌లో కార్మికులందరూ ప్రకాష్‌రాజ్‌ను మందలిస్తారు. బాగా చదవమని చెప్తారు. చివరకు స్కూల్ అడ్మిషన్ రోజు వస్తుంది. ప్రకాష్‌రాజ్ క్యూలో నిలుచుంటాడు. అతని పక్కన ఒకతను చాలా వర్రీతో చదివేస్తుంటాడు. అతడు లాస్ట్ ఇయర్ ఇంటర్వూ్య ఫెయిల్ అయ్యాడట. కారణం ‘భారతదేశంలో బంగారం ఎక్కడ దొరుకుతుంది’ అని అడిగితే ‘ఆర్.ఎస్.బ్రదర్స్’ అని సమాధానం చెప్పాడు. ఈలోపు ప్రకాష్‌రాజ్‌కు ‘అలెగ్జాండార్ గుర్రం పేరు ఏమిట’నే డౌట్ వస్తుంది. పక్కనున్న అతన్ని అడుగుతాడు. అతను చాలా కంగారుగా ‘ఆ గుర్రం మేలా ఫిమేలా’ అని ప్రశ్నిస్తాడు. చివరకు ఈ ప్రశ్న పెద్ద కలకలమే రేపుతుంది. సంసారంలో పిల్లల చదువు అనేది పెద్ద పిడకల వేట. ఆ వేటకు అంతం లేదు. అలెగ్జాండర్ గుర్రం పేరు? – కె -
ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
అనంతపురం అర్బన్: పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, డీఆర్ఓ మల్లీశ్వరిదేవి బుధవారం విడుదల చేశారు.ఈ వివరాలను ఆమె విలేకరులకు వెల్లడించారు. వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో పట్టభద్ర ఓటర్లు 2,24,109 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 18,386 మంది నమోదయ్యారు. 2,44,354 మంది పట్టభద్రులు దరఖాస్తు చేసుకోగా.. 20,245 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 21,856 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా.. 3,470 తిరస్కరణకు గురయ్యాయి. డబుల్ ఎంట్రీలను, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు లేనివాటిని తిరస్కరించారు. డిసెంబర్ ఎనిమిది వరకు క్లెయింలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం దరఖాస్తు తిరస్కరణకు గురై ఉంటే, అలాంటి వారు కూడా మళ్లీ నమోదు చేసుకోవచ్చు. వచ్చిన క్లెయిములను, అభ్యంతరాలను డిసెంబరు 26లోగా పరిష్కరిస్తారు. డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. -
అన్ని జిల్లాల్లో మోడల్ డిగ్రీ కాలేజీలు
ఉన్నత విద్య, ఆర్జేడీ, మల్లేశ్వరి – నాలుగైదు రోజుల్లో కాంట్రాక్టు లెక్చరర్ల రెన్యూవల్ – ఉన్నత విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ కె. మల్లీశ్వరి బనగానపల్లె : కర్నూలు జిల్లా ఆత్మకూరు మోడల్ డిగ్రీ కళాశాల తరహాల్లో రాయలసీమ పరిధిలోని అన్ని జిల్లాల్లో డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు కషి చేస్తున్నట్లు ఉన్నతవిద్యాశాఖ రిజినల్ జాయింట్ డైరెక్టర్ కె. మల్లీశ్వరి తెలిపారు. రాయలసీమ పరిధిలోని డిగ్రీకాలేజీలకు సంబంధించి 305 మంది కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టులను త్వరలో రెన్యూవల్ చేస్తామని తెలిపారు. బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులతోపాటు తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రీయ ఉశ్చరత శిక్షణ అభియాన్ (రూసా) కింద రాయలసీమకు సంబంధించి 14 ప్రభుత్వ డిగ్రి కళాశాలలను ఎంపిక చేశామని తెలిపారు. వీటిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.2 కోట్ల ప్రకారం ఖర్చు చేస్తామన్నారు. ఇటీవలే ఆత్మకూరులో మోడల్ డిగ్రీ కళాశాలను ప్రారంభించామని చెప్పిన ఆమె అనంతపురం జిల్లా హిందూపూరంలో కూడా అదే తరహా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు, కడప జిల్లాలో కూడా ఈ తరహా కాలేజీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కషి చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఆర్జేడీ సూపరింటెండెంట్ హనుమాయమ్మ, కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలతాదేవి, న్యాక్ కో ఆర్డినేటర్ హెచ్ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
మానవత్వం మరణించింది
ఆమెకు అమ్మానాన్నలు లేరు. కట్టుకున్న భర్త క డుపు చేతబట్టుకుని పరాయి దేశానికి వెళ్లాడు. ఇక ఆమెకు అమ్మా నాన్నలయినా.. అత్తమామలైనా తన మెట్టినింటివారే. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర జ్వరంతో అపస్మారక స్థితిలో ఉన్న కోడలికి వైద్యం చేయించాలనే కనీస మానవత్వాన్ని కూడా అత్తమామలు మరిచి ఆమెను తీసుకెళ్లి ఊరి శివారులో వదిలేశారు. కొన ఊపిరితో ఉన్న ఆ యువతి కొద్ది గంటల్లోనే ప్రాణాలు వదిలింది. ఓబులవారిపల్లె: ఓబులవారిపల్లె మండలం బొమ్మవరం గ్రామానికి చెందిన జగ్గరాజు నరసింహరాజు, సుబ్బలక్షుమ్మల ఏకైక సంతానం మల్లీశ్వరి. ఆమెను రాయచోటి మండలం గుంతరాచపల్లెకు చెందిన వెంకటరాజు, అనసూయమ్మల కుమారుడైన శంకర్‌రాజుకు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. జీవనోపాధి కోసం శంకర్రాజు ఏడాది క్రితం కువైట్‌కు వెళ్లాడు. దీంతో అత్తామామల వద్ద ఉన్న మల్లీశ్వరికి ఇటీవల జ్వరం సోకింది. అత్తామామలు నిర్లక్ష్యం చేయడంతో జ్వరం తీవ్రమై ఆమె అపస్మారక స్థితికి వెళ్లింది. దీంతో వారు శనివారం సాయంత్రం ఆమెను తీసుకెళ్లి ఆమె పుట్టిన ఊరైన బొమ్మవరం గ్రామ శివార్లలో వదిలేసి వెళ్లారు. గ్రామస్తులు ఆలస్యంగా గుర్తించి గ్రామంలో ఉన్న ఆమె బంధువులకు విషయం తెలిపారు. స్థానికుల సహకారంతో వారు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆదివారం ఉదయం మృతి చెందింది. ఆమె మరణం గ్రామస్తులను కలచివేసింది. కాగా, మల్లీశ్వరి తల్లిదండ్రులు కూడా ఏడాది క్రితం మృతి చెందారు. -
అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని...
-
అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని..
పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి చితకబాదిన యువతి హైదరాబాద్: వెంటపడి వేధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని ఓ యువతి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసుల ముందే చితక్కొట్టింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ముషీరాబాద్‌లో నివసించే మల్లీశ్వరి (34) బంజారాహిల్స్ రోడ్ నం.2 లోని సాగర్ సొసైటీలో ఉద్యోగం చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన దేవదాసు (38) అనే కార్పెంటర్ వారం రోజుల నుంచి యువతి ఎక్కిన బస్సులోనే వెళ్తూ ఆమెను వేధిస్తున్నాడు. దీంతో బాధిత యువతి ఈ వేధింపుల వ్యవహారాన్ని సోదరుడి దృష్టికి తీసుకెళ్లింది. మంగళవారం ఉదయం సోదరుడు, వదినను తీసుకొని ఎప్పటిలాగే బస్సులో బంజారాహిల్స్‌కు వచ్చి సాగర్ సొసైటీ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా రోజులాగే దేవదాసు కూడా ఆమెను వెంబడించాడు. దీంతో అందరూ కలసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసుల ముందే ఆ యువతి... ఈవ్‌టీజర్‌ను చెప్పుతో కొట్టింది. కాగా, దేవదాసుపై ఈవ్‌టీజింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. -
దేవదాసును చితక్కొట్టి.. స్టేషన్‌కు ఈడ్చుకెళ్లింది
బంజారాహిల్స్: గత వారం రోజుల నుంచి వెంబడిస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకొచ్చి.. పోలీసుల ముందే చెప్పుతో కొట్టింది ఓ యువతి. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ముషీరాబాద్‌లో నివసించే మల్లీశ్వరి (34) బంజారాహిల్స్ రోడ్ నెం.2 లోని సాగర్ సొసైటీలో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన దేవదాసు (38) అనే కార్పెంటర్ వారం రోజుల నుంచి ఆమె వచ్చే బస్సులోనే వస్తూ వెంటాడుతున్నాడు. బంజారాహిల్స్‌లో ఆమె బస్సు దిగి తాను పని చేసే ప్రాంతానికి నడుచుకుని వెళ్లే సమయంలో అనుసరిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. తనతో మాట్లాడాలంటూ అడ్డుపడుతూ ఆమెను వేధించసాగాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు ఈ వేధింపుల వ్యవహారాన్ని తన సోదరుడి దృష్టికి తీసుకెళ్లింది. మంగళవారం ఉదయం ఆమె తన సోదరుడు, వదినను తీసుకొని ఎప్పటిలాగే బస్సులో బంజారాహిల్స్‌కు వచ్చి సాగర్సొసైటీకి నడుచుకుంటూ వెళ్తుండగా రోజులాగే దేవదాసు కూడా ఆమెను వెంబడించసాగాడు. మల్లీశ్వరి సోదరుడు, వదిన.. దేవదాస్ ను పట్టుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసుల ముందే బాధిత యువతి ఈవ్‌టీజర్ ను చెప్పుతో చితకబాదింది. పోలీసులు దేవదాసుపై ఈవ్‌టీజింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
నిర్భంధ పనితోనే కొడుకును కోల్పోయా!
పాలు లేకనే నా బిడ్డ చనిపోయాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన మల్లేశ్వరి నర్సాపూర్: ‘కాంట్రాక్టర్ నిర్బంధ పనితోనే బిడ్డను కోల్పోయా’ అని పాల కోసం ఏడ్చి ప్రాణాలొదిన పసిబాలుడి తల్లి మల్లీశ్వరి మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మెదక్ జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ వద్ద గల ఈఎంఎన్‌ఆర్ కంపెనీలో 11 నెలలుగా తమ కుటుంబ సభ్యులతో కలసి పని చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో తన కుమార్తె ప్రమీల తాము పనిచేసే చోటుకు వచ్చి తమ్ముడు చందు (ఆరు నెలల బాలుడు) ఏడుస్తున్నాడని చెప్పిందన్నారు. దీంతో బాలుడికి పాలు ఇచ్చి వస్తానని తమతో పని చేయించే సుధీష్‌ను అడగ్గా అంగీకరించలేదని తెలిపారు. శనివారం ఉదయం గుడిసెలోకి వెళ్లి చూసేసరికి అప్పటికే చందు ప్రాణం పోయిందన్నారు. నర్సాపూర్ శివారులోని శ్మశాన వాటికిలో కుమారుడిని పూడ్చి పెట్టేందుకు ఏర్పా ట్లు చేశారని పేర్కొన్నారు. రెండు రోజుల అనంతరం బాబు సమాధి వద్ద పాలు పోసేందు వెళ్లాలని కోరగా.. డీసీఎం వ్యానులో తీసుకెళ్లారని చెప్పింది. తన కుమారుడి మృతికి కారణమైన వారిని శిక్షించాలని పోలీసులను వేడుకుంది. -
వైద్యం వికటించి పసికందు మృతి
వైద్యుడి నిర్లక్ష్యమే : తల్లి మల్లీశ్వరి ఆరోపణ డాక్టర్ రాజుపై కేసు నమోదు బుచ్చిరెడ్డిపాళెం: చేతకాని వైద్యంతో ఓ డాక్టర్ మూడు నెలల పసికందును బలి తీసుకున్నాడు. చనిపోయిన విషయం చెప్పకుండా నెల్లూరుకు తీసుకెళ్లమని బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. చిన్నారి తల్లి నిలదీయడంతో చనిపోయినట్లు తెలిపాడు. ఈ ఘటన స్థానిక వీఆర్ చిన్నపిల్లల ఆసుపత్రిలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నాగమాంబపురానికి చెందిన గాలి వెంకటరమణయ్య, మల్లీశ్వరి దంపతులకు రెండో సంతానంగా మూడు నెలల క్రితం పాప జన్మిం చింది. ఈ క్రమంలో జలుబు ఎక్కువగా ఉండడంతో మల్లీశ్వరి తన తల్లితో కలిసి పాపను తీసుకుని సోమవారం వీఆర్ చిన్నపిల్లల ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్ సలహా లేకుండానే అక్కడ పని చేస్తున్న ఆస్పత్రి అసిస్టెంట్ ఆ చిన్నారికి ఇంబ్యులేజర్ పెట్టింది. దీంతో ఆ చిన్నారి ఉక్కిరి బిక్కిరి అవుతుండడంతో తల్లి గుర్తించి అక్కడున్న సిబ్బందికి చెప్పింది. అంతలో డాక్టర్ రాజు వచ్చి డెర్ఫిలిన్ ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో శ్వాస ఆడక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని చెప్పకుండా సీరియస్‌గా ఉందని, చిన్నారిని నెల్లూరుకు తీసుకెళ్లమని చెప్పాడు. తమ బిడ్డకు ఏ మైందని తల్లి, అమ్మమ్మ నిల దీయగా చనిపోయిందని తెలి పాడు. దీంతో బాధిత కుటుం బ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నా బిడ్డను డాక్టరే చంపాడు జలుబుగా ఉందని ఆసుపత్రికి తీసుకువచ్చిన నా బిడ్డను డాక్టర్ రాజు చంపాడని చిన్నారి తల్లి మల్లీశ్వరి బోరున విలపిం చింది. తన బిడ్డ మృతికి కారకుడైన రా జుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ రోదించడం స్థానికులను కలిచివేసింది. డాక్టర్‌పై కేసు నమోదు ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెల కొనడంతో ఎస్సై శ్రీనివాసరావు అక్కడికి చే రుకున్నారు. తన బిడ్డను డాక్టర్ రాజు చంపాడని చిన్నారి తల్లి ఎస్సై ఎదుట వాపోయింది. విచారించిన ఎస్సై చిన్నా రి తండ్రి వెంకటరమణయ్య ఫిర్యాదు మేరకు డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. ఏడాదిలో ఇది రెండో ఘటన ఈ ఏడాది ప్రారంభంలో పొదలకూరు మండలం మహ్మదాపురానికి చెందిన ఓ చిన్నారికి జ్వరంగా ఉండటంతో తల్లిదం డ్రులు రాజు వద్దకు తీసుకొచ్చారు. ఆయ న హెవీ డోస్ ఇంజెక్షన్ ఇవ్వడంతో బా లుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని దాచి బాలుడికి సీరియస్‌గా ఉందని నెల్లూరుకు తీసుకెళ్లమని సూచిం చాడు. తల్లిదండ్రులు నిలదీయడంతో బా లుడు చనిపోయినట్లు చెప్పాడు. సోమవా రం మళ్లీ అదే ఘటన పునరావృతమైంది. వైద్య పరికరాలేవి? వీఆర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో కనీస వైద్య పరికరాలు కూడా లేవు. ఆక్సిజన్ సిలిండర్ కూడా లేకపోవడం శోచనీయం. చేతకాని వైద్యంతో చిన్నారుల ప్రాణాలు గాల్లో కలుపుతున్న డాక్టర్ రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై విలేకరులు డీఎంహెచ్ఓ భారతీరెడ్డిని సంప్రదించగా విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యం అందించా: డాక్టర్ రాజు జలుబుతో బాధప డుతున్న చిన్నారి ని తమ ఆస్పత్రికి తీసుకొచ్చిన విష యం వాస్తవమేన ని డాక్టర్ రాజు తె లిపారు. తగిన వైద్యం అందించా నని మొదట చెప్పిన ఆయన తర్వాత త నకు సంబంధం లేదని బుకాయించారు. వైద్యానికి ఉపయోగించిన పరికారలేవని ఆరా తీయగా పారేశానని, లోపల ఉన్నాయని మార్చిమార్చి చెప్పాడు. చిన్నారి మృతితో అందరూ బాధలో ఉండగా ఆయన మాత్రం తన స్నేహితులతో నవ్వుల్లో మునిగిపోవడం గమనార్హం. -
ఫోన్లో పరిచయం..ఆపై ప్రేమాయణం
విజయవాడ : ప్రేమించానన్నాడు...పెళ్లి చేసుకుని జీవనం సాగిద్దామని నమ్మించాడు. చివరకు ఆమె నగలు తీసుకుని మాయమయ్యాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విజయవాడ పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రసాదంపాడుకు చెందిన మల్లీశ్వరి (19) పదో తరగతి వరకూ చదువుకుంది. తండ్రి లేకపోవటంతో సోదరుడి వద్ద ఉంటోంది. ఖాళీగా ఉండటంతో ఇతరులకు ఫోన్ చేసి మాట్లాడుతుండేది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో నివాసం ఉంటున్న అసమాన్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి విజయవాడ, గుంటూరు జిల్లాల్లో విహార యాత్రలు చేశారు. చివరకు తమ ప్రేమను ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించరని ...ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో తన వద్ద ఉన్న సుమారు 50 కాసుల బంగారు ఆభరణాలను మల్లీశ్వరి ఈనెల 10వ అసమాన్ రెడ్డికి అందించింది. వాటిని తీసుకున్న అతగాడు వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే లిప్ట్ చేయకపోవటంతో తాను మోసపోయనని గ్రహించిన బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సాక్షాత్తూ ‘మల్లీశ్వరి’ కెమెరామేన్ మెచ్చుకున్నారు!
‘గూండా’ సినిమా క్లైమాక్స్. విలన్లు రైలు కింద బాంబులు అమర్చారు. ఏ క్షణంలోనైనా పేలిపోతాయి. హీరో చిరంజీవి ఊరుకుంటాడా! ఎంతో సాహసంతో కదులుతున్న రైల్లోంచి ఆ బాంబుల్ని తీసి పారేశాడు. ఈ క్లైమాక్స్‌కి క్లాప్స్ పడ్డాయి. తెరపై రిస్క్ చిరంజీవిదైతే, తెరవెనుక రిస్క్ మాత్రం కెమెరామేన్ ఎ. వెంకట్‌ది. కదులుతున్న రైలు కింద కెమెరా పెట్టి రకరకాల యాంగిల్స్‌లో షాట్స్ తీయడమంటే మాటలు కాదు. వెంకట్ కెరీర్లో ఇలాంటి సాహసాలు, ప్రయోగాలు చాలా ఉన్నాయి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీల్లో సుమారు 80 చిత్రాలకు పని చేసిన ఈ అనుభవజ్ఞుడైన ఛాయాగ్రాహకుడు చెన్నైలో విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆయన ‘సాక్షి’కి చెప్పిన కొన్ని ముచ్చట్లు. మాది బాపట్ల తాలూకా అప్పికట్ల గ్రామం. స్టిల్ కెమెరాపై ఆసక్తి నన్ను మూవీ కెమెరా దగ్గరకు చేర్చింది. మా ఊరి ప్రొడక్షన్ మేనేజర్ పుణ్యమా అంటూ చెన్నై చేరుకున్నాను. కష్టపడి రేవతీ స్టూడియోలో అప్రెంటిస్‌గా చేరా. అలా మొదలైన ప్రయాణం విన్సెంట్ గారి పరిచయంతో మలుపు తిరిగింది. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. ఎంతలా అంటే... సేమ్ టూ సేమ్ ఆయనలా షాట్స్ తీయాలంటే నా వల్లే అవుతుందన్నంతగా అన్నమాట. విన్సెంట్‌గారి దగ్గర పని చేస్తున్నప్పుడే నాకు ‘రాజమల్లి’ (1964) అనే మలయాళ సినిమాకు స్వతంత్రంగా ఛాయాగ్రహణం చేసే అవకాశం వచ్చింది. ఓ పక్క నా సినిమాలు చేసుకుంటూనే, మరో పక్క విన్సెంట్‌గారి దగ్గర ఆపరేటివ్ కెమెరామేన్‌గా పని చేసేవాణ్ణి. గురువుగారి ఆధ్వర్యంలో చాలా గొప్ప గొప్ప సినిమాలకు పని చేశానన్న సంతృప్తి ఉంది. భక్త ప్రహ్లాద, లేత మనసులు, వసంత మాళిగై (తమిళం), ప్రేమనగర్ (హిందీ)... ఆ జాబితాలో ఉన్నాయి. ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ సినిమాకి నేనే సెకండ్ యూనిట్ కెమేరామేన్ని. నా దగ్గరకు వచ్చిన అవకాశాలే చేశాను. ఎవర్నీ అడగలేదు. మిచెల్, యారీఫ్లెక్స్ కెమెరాలన్నీ నాకు కొట్టిన పిండి. ఇప్పటి డిజిటల్ కెమెరాలపై అవగాహన లేదు. ఛాయాగ్రాహకునిగా రాసి కన్నా వాసి ప్రాధాన్యమిచ్చేవాణ్ణి. అవకాశం ఎక్కడ దొరికినా ప్రయోగాలకు సిద్ధమయ్యేవాణ్ణి. మాస్క్ షాట్స్ అందరూ చేస్తారు కానీ, బ్యాక్ ప్రొజెక్షన్లో చేయడం చాలా కష్టం. తమిళంలో ‘మదనమాళిగై’ కోసం కదులుతున్న రైల్లో మాస్క్ షాట్స్ తీశా. ఇద్దరు శివకుమార్‌లు ఒకే ఫ్రేమ్‌లో ప్రయాణిస్తున్నట్టు బ్యాక్ ప్రొజెక్షన్లో చిత్రీకరించా. సాక్షాత్తూ ‘మల్లీశ్వరి’ కెమెరామేన్ కొండారెడ్డి ఈ షాట్‌ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ‘జగమొండి’లో ఫ్రేమ్‌లో అయిదుగురు శోభన్‌బాబులు కనిపించేలా తీశా. తమిళ చిత్రం ‘అక్కర పచ్చై’లో రెండే రెండు లాంగ్ షాట్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా కాబట్టి అన్నీ మిడ్ షాట్స్ తీశా. మలయాళ చిత్రం ‘తీర్థయాత్ర’కి కొవ్వొత్తి వెలుగులో నది ఒడ్డున కార్తికస్నానం షాట్ తీశా. ఆ షాట్స్ గురించి ఇప్పటికీ గొప్పగా చెబుతుంటారు. విన్సెంట్‌గారు డెరైక్ట్ చేసిన 10 సినిమాలకు నేనే ఛాయాగ్రాహకుణ్ణి. అది నా అదృష్టం. ముఖ్యంగా, మలయాళ చిత్రం ‘నది’ అంతా పడవ లోనే నడుస్తుంది. 15-20 రోజులు ఆల్వాయ్ నదిలో షూటింగ్ చేశాం. కొన్ని మ్యాచింగ్ షాట్స్ మిగిలిపోతే మద్రాసులోని జెమినీ స్టూడియోలో సెట్ వేసి తీయాల్సి వచ్చింది. నాకు వేరే సినిమా వర్క్ ఉండి, మల్లీ ఇరానీని పంపించాను. ‘‘ఒక్క రోజుకే నా నడుము పడిపోయింది. ఆయనతో ఇన్ని రోజులు ఎలా పనిచేశావు. అన్నీ లోయాంగిల్ షాట్స్ అంటున్నారు’’ అని చెప్పాడు నాతో. హిందీలో దిలీప్‌కుమార్, జితేంద్ర, రాజేష్‌ఖన్నా, మిథున్ చక్రవర్తి, ధర్మేంద్ర, రిషీకపూర్ల చిత్రాలకు పనిచేశా. తెలుగులో నా తొలి సినిమా ‘సావాసగాళ్లు’. ఆఖరి సినిమా ‘హలో గురూ’. నేను గర్వంగా చెప్పుకునే సినిమా - ‘ముందడుగు’. ఆ భారీ మల్టీస్టారర్‌లో ఆర్టిస్టులను డీల్ చేయడం చాలా కష్టం కదా. అయినా సునాయాసంగా చేయగలిగా. జితేంద్ర, రాజేశ్ఖన్నాలతో తీసిన హిందీ వెర్షన్ ‘మక్సద్’కి నేనే వర్క్ చేశా. ‘అగ్ని పూలు’ కూడా నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. ‘రామరాజ్యంలో భీమరాజు’లో కృష్ణను అందంగా చూపించానంటూ శతదినోత్సవ సభలో దాసరి ప్రశంసించారు. ‘‘కెమెరాను ఆపరేట్ చేయడంలో వెంకట్‌ని ఎవ్వరూ కొట్టలేరు’’ అని విన్సెంట్ గారు అందరికీ చెబుతుంటారు. అదే నాకు పెద్ద పురస్కారం. - పులగం చిన్నారాయణ -
సాక్షి బంపర్ ప్రైజ్ విజేత మల్లీశ్వరి
= టీఎంసీలో పన్నెండో డ్రా నిర్వహణ = డ్రా తీసిన తనిష్క్ ప్రతినిధి మహిధర్ = ప్రధాన స్పాన్సర్లు కళానికేతన్, టీఎంసీ విజయవాడ, న్యూస్‌లైన్ : సాక్షి పండుగ సంబరాల్లో భాగంగా మహాత్మాగాంధీ రోడ్డులోని తిరుమల మ్యూజిక్ సెంటర్(టీఎంసీ)లో ఆహ్లాదభరితమైన వాతావరణంలో శుక్రవారం పన్నెండో డ్రాను వేడుకలా నిర్వహించారు. ఆ షోరూమ్‌లోని కస్టమర్లు, సిబ్బంది హర్షధ్వానాల మధ్య తనిష్క్ జ్యూయలరీ ఏరియా బిజినెస్ మేనేజర్ బీ మహిధర్ డ్రా తీసి బంపర్ ప్రైజ్ విజేతను ఎంపిక చేశారు. కళానికేతన్ కస్టమర్ వీ మల్లేశ్వరి(కూపన్ నం. 26218) బంపర్ ప్రైజ్ విజేతగా నిలిచి లక్ష రూపాయల నగదు బహుమతి గెలుచుకున్నారు. అనంతరం పలువురు డ్రాతీసి ఆరుగురు విజేతలను ఎంపిక చేశారు. వారిలో మొదటి బహుమతిగా ఎల్ఈడీ టీవీ, ద్వితీయ బహుమతిగా ఫర్నిచర్, తృతీయ బహుమతిగా కెమెరాతో పాటు మరో ముగ్గురికి కన్సోలేషన్ బహుమతులుగా సెల్ఫోన్లను అందజేయనున్నారు. ఇప్పటి వరకూ వివిధ షోరూమ్‌లలో పన్నెండు డ్రాలు నిర్వహించి పన్నెండు మందిని లక్షాధికారులుగా ఎంపిక చేశారు. వారిలో ఆరుగురు కళానికేతన్ కస్టమర్లు కాగా, ఇద్దరు బిగ్‌సీ కస్టమర్లు, చర్మాస్, బాబూటెక్స్టైల్స్, ఆయుర్ సుఖ, మన కళ్యాణ వేధికకు చెందిన ఒక్కో కస్టమర్ బంపర్ ప్రైజ్ గెలుపొందారు. కళానికేతన్, టీఎంసీ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న సాక్షి పండుగ సంబరాలు డిసెంబరు 22న ప్రారంభం కాగా 5వ తేదీ వరకు కొనసాగుతాయి. విశేష స్పందన... సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండుగ సంబరాలకు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తోంది. నగరంలో పన్నెండు రోజులుగా నిర్వహిస్తున్న డ్రాలు వేడుకలా జరుగుతున్నాయి. సాక్షి పండుగ సంబరాలు జరుపుకుంటున్న షోరూమ్‌లలో కస్టమర్లు ఎంతో ఆసక్తిగా డ్రా కూపన్లు పూర్తి చేస్తున్నారు. ఈ పండుగ సంబరాలతో తమ షోరూమ్‌లలో 25 శాతం సేల్స్ పెరిగాయని స్వయంగా నిర్వాహకులు చెప్పడం గమనార్హం. సాక్షి డ్రా నిర్వహిస్తున్న తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో నిబద్ధతతో ముందు రోజు విన్నర్‌గా నిలిచిన వారితో డ్రా తీయించి విజేతను ఎంపిక చేయడమనేది గొప్ప విషయమని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ డ్రా అంటే సెలబ్రిటీలతో తీయించే వారని, కానీ సాక్షి పండుగ సంబరాల్లో విజేతగా నిలిచిన సామాన్య కస్టమర్‌తో డ్రా తీయించడం హర్షణీయమని అభినందిస్తున్నారు. సాక్షి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కస్టమర్లు కోరుకుంటున్నారు. తనిష్క్ జ్యూయలరీ ఏరియా బిజినెస్ మేనేజర్ బీ మహిధర్, టీఎంసీ మేనేజర్ ఏ అశోక్‌కుమార్, సాక్షి రీజినల్ మేనేజర్ (యాడ్స్) సీహెచ్.అరుణ్‌కుమార్, యాడ్స్ మేనేజర్ జేఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పన్నెండో డ్రా విజేతలు.... సాక్షి సంబరాల్లో భాగంగా శుక్రవారం టీఎంసీలో నిర్వహించిన డ్రాలో బంపర్ ప్రైజ్ విజేతగా కళానికేతన్ కస్టమర్ వీ మల్లీశ్వరి(26218) ఎంపిక కాగా, సెల్పాయింట్ కస్టమర్ పీ.రజని(38995) ప్రథమ బహుమతిగా ఎల్ఈడీ టీవీ గెలుపొందారు. సెంట్రల్ అకాడమీ కస్టమర్ ఏ శివప్రసాద్(25135) ద్వితీయ బహుమతిగా ఫర్నిచర్, కుశలవ మోటార్స్ కస్టమర్ ఎస్.ఆనందరావు(23354) కెమెరా గెలుపొందారు. స్వీట్ మ్యాజిక్ కస్టమర్ జీ మీనా(16547), సెల్ పాయింట్ కస్టమర్ లక్ష్మీ(35588), టీఎంసీ కస్టమర్ బీ రాము(18379) కన్సోలేషన్ బహుమతులుగా సెల్ఫోన్లు అందుకున్నారు. వెరీగుడ్ కాంపెయిన్ ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండుగ సంబరాలు వెరీగుడ్ కాంపెయిన్. డ్రా తీసే విధానం చాలా బాగుంది. కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఒకేచోట డ్రా తీయకుండా వేర్వేరు షోరూమ్‌లలో డ్రాలు నిర్వహిస్తూ, లక్ష రూపాయలు బహుమతి పొందిన వారితోనే మరుసటి రోజు డ్రా తీయించడం అనేది మంచి ఉద్దేశం. బహుమతి పొందిన ఆనందంతో పాటు, తాను డ్రా తీసి మరో విజేతను ఎంపిక చేసే అవకాశం కల్పించడం వారికి మర్చిపోలేని మధుర స్మృతులను మిగుల్చుతోంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సాక్షికి అభినందనలు, రానున్న కాలంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నా... - బీ మహిథర్, ఏరియా బిజినెస్ మేనేజర్, తనిష్క్ జ్యూయలరీ -
పాఠశాల ఒకటే... అధికారులు ఇద్దరు
=కోర్టు ఆదేశాలతో ఒకరు =పీవో ఆదేశాలతో మరొకరు =సిబ్బంది, విద్యార్థుల అవస్థ నాతవరం, న్యూస్‌లైన్: ఒకే పాఠశాలకు ఇద్దరు ప్రత్యేకాధికారులుండటంతో విద్యార్థులు, సిబ్బందికి తలనొప్పిగా పరిణమించింది. ఇక్కడి కస్తూర్బా పాఠశాల ప్రత్యేకాధికారిగా పనిచేసిన రామలక్ష్మిపై పలు ఆరోపణలు రావడంతో మాకవరపాలెం హైస్కూల్‌కు బదిలీ చేశారు. ఆమె స్థానంలో స్థానిక హైస్కూల్లో పనిచేస్తున్న జి.మల్లీశ్వరిని జులై 3న ఇన్చార్జిగా నియమించారు. జిల్లాలో ఇన్చార్జిగా పనిచేస్తున్న 10 కస్తూర్బా పాఠశాలలకు రెగ్యులర్ ప్రత్యేకాధికారులను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఇన్చార్జిలుగా పనిచేస్తున్న ప్రత్యేకాధికారులు కోర్టును ఆశ్రయించారు. జిల్లాలో పనిచేస్తున్న తొమ్మిది మందిని అవే పాఠశాలల్లో యథావిధిగా విధులు నిర్వహించాలని ఆదేశాలు రావడంతో వారు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. నాతవరంలో పనిచేస్తున్న ప్రత్యేకాధికారి మల్లీశ్వరికి నిర్ణీత సమయం ప్రకారం కోర్టు ఆదేశాలు రాలేదు. దీంతో ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని శాంతిని కొత్త నియామకాల్లో ఎంపిక చేశారు. ఈ మేరకు ఈమెకు ప్రత్యేకాధికారిగా అధికారులు నియామక ఉత్తర్వులు ఇవ్వడంతో ఈ నెల 26న విధుల్లో చేరారు. ఇక్కడ గతంలో ఇన్చార్జిగా పనిచేసిన మల్లీశ్వరి ఇదే పాఠశాలలో ఏప్రిల్ 23 వరకు యథావిధిగా కొనసాగాలంటూ కోర్టు ఆదేశాలు వచ్చాయి. దాంతో ఈమె కూడా యథావిధిగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై మల్లీశ్వరిని న్యూస్‌లైన్ వివరణ కోరగా కోర్టు ఆదేశాలతో యథావిధిగా విధుల్లో కొనసాగుతున్నానని, గతంలో తనను రిలీవ్ చేయలేదని తెలిపారు. శాంతిని వివరణ కోరగా జిల్లా ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు 26న విధుల్లో చేరానన్నారు. ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావును ఫోన్లో సంప్రదించగా సమాధానమివ్వకుండా దాట వేశారు. -
మల్లీశ్వరికి విముక్తి
విశాఖలోని స్వధార్ గృహానికి తరలింపు కోటవురట్ల, న్యూస్‌లైన్: నరకలోక ‘పతి’ కథనంపై అధికారులు స్పందించారు. విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన ఉపాధ్యాయుడు ప్రసాద్ తన భార్యను చీకటిగదిలో బంధించిన వైనం సాక్షిలో ప్రచురితమైన విషయం విదిత మే. మహిళా సంఘాలు, అధికారులు బాధితురాలి ఇంటికి చేరుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. సీడీపీవో అనంతలక్ష్మి శనివారం నాగమల్లీశ్వరి నుండి వివరాలు సేకరించారు. మల్లీశ్వరి కోరిక మేరకు విశాఖలోని స్వధార్ గృహానికి తరలించారు. కాగా, 22 ఏళ్లపాటు మానసిక క్షోభకు గురిచేసిన తన భర్తపై ఏ విధమైన కేసులు పెట్టడానికి మల్లీశ్వరి ఒప్పుకోలేదు. ఆయనతో పాటు వేరే ఇంట్లో ఉండాలనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. బాధితురాలి అభీష్టం తెలుసుకున్న ఏఎస్పీ.. ఆమె అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలని, పెదబొడ్డేపల్లిలో పనిచేస్తున్న పాఠశాలకు సమీపంలోనే ఇల్లు తీసుకుని వేరు కాపురం పెట్టాలని భర్త ప్రసాద్‌కు సూచించారు.