పాలు లేకనే నా బిడ్డ చనిపోయాడు
పోలీసులకు ఫిర్యాదు చేసిన మల్లేశ్వరి
నర్సాపూర్: ‘కాంట్రాక్టర్ నిర్బంధ పనితోనే బిడ్డను కోల్పోయా’ అని పాల కోసం ఏడ్చి ప్రాణాలొదిన పసిబాలుడి తల్లి మల్లీశ్వరి మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మెదక్ జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ వద్ద గల ఈఎంఎన్‌ఆర్ కంపెనీలో 11 నెలలుగా తమ కుటుంబ సభ్యులతో కలసి పని చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో తన కుమార్తె ప్రమీల తాము పనిచేసే చోటుకు వచ్చి తమ్ముడు చందు (ఆరు నెలల బాలుడు) ఏడుస్తున్నాడని చెప్పిందన్నారు.
దీంతో బాలుడికి పాలు ఇచ్చి వస్తానని తమతో పని చేయించే సుధీష్‌ను అడగ్గా అంగీకరించలేదని తెలిపారు. శనివారం ఉదయం గుడిసెలోకి వెళ్లి చూసేసరికి అప్పటికే చందు ప్రాణం పోయిందన్నారు. నర్సాపూర్ శివారులోని శ్మశాన వాటికిలో కుమారుడిని పూడ్చి పెట్టేందుకు ఏర్పా ట్లు చేశారని పేర్కొన్నారు. రెండు రోజుల అనంతరం బాబు సమాధి వద్ద పాలు పోసేందు వెళ్లాలని కోరగా.. డీసీఎం వ్యానులో తీసుకెళ్లారని చెప్పింది. తన కుమారుడి మృతికి కారణమైన వారిని శిక్షించాలని పోలీసులను వేడుకుంది.
నిర్భంధ పనితోనే కొడుకును కోల్పోయా!
Published Wed, Feb 18 2015 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
Advertisement
Advertisement