
మల్లీశ్వరికి విముక్తి
విశాఖలోని స్వధార్ గృహానికి తరలింపు
కోటవురట్ల, న్యూస్‌లైన్: నరకలోక ‘పతి’ కథనంపై అధికారులు స్పందించారు. విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన ఉపాధ్యాయుడు ప్రసాద్ తన భార్యను చీకటిగదిలో బంధించిన వైనం సాక్షిలో ప్రచురితమైన విషయం విదిత మే. మహిళా సంఘాలు, అధికారులు బాధితురాలి ఇంటికి చేరుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. సీడీపీవో అనంతలక్ష్మి శనివారం నాగమల్లీశ్వరి నుండి వివరాలు సేకరించారు. మల్లీశ్వరి కోరిక మేరకు విశాఖలోని స్వధార్ గృహానికి తరలించారు. కాగా, 22 ఏళ్లపాటు మానసిక క్షోభకు గురిచేసిన తన భర్తపై ఏ విధమైన కేసులు పెట్టడానికి మల్లీశ్వరి ఒప్పుకోలేదు. ఆయనతో పాటు వేరే ఇంట్లో ఉండాలనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. బాధితురాలి అభీష్టం తెలుసుకున్న ఏఎస్పీ.. ఆమె అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలని, పెదబొడ్డేపల్లిలో పనిచేస్తున్న పాఠశాలకు సమీపంలోనే ఇల్లు తీసుకుని వేరు కాపురం పెట్టాలని భర్త ప్రసాద్‌కు సూచించారు.