వెంటపడి వేధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని ఓ యువతి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసుల ముందే చితక్కొట్టింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ముషీరాబాద్‌లో నివసించే మల్లీశ్వరి (34) బంజారాహిల్స్ రోడ్ నం.2 లోని సాగర్ సొసైటీలో ఉద్యోగం చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన దేవదాసు (38) అనే కార్పెంటర్ వారం రోజుల నుంచి యువతి ఎక్కిన బస్సులోనే వెళ్తూ ఆమెను వేధిస్తున్నాడు