రోజుకొకరు లక్షాధికారి
- మళ్లీ వచ్చిన ‘సాక్షి’ పండుగ సంబరాలు
సనత్‌నగర్: ఏటేటా ఇంటింటా సిరుల పంటను కురిపించే ‘సాక్షి’ పండుగ సంబరాలు మళ్లీ వచ్చేశాయి. రోజుకొకరిని లక్షాధికారిని చేస్తూ దసరా పండుగ ఆనందాన్ని ముందస్తుగానే ఇంటికి తెచ్చే ఈ సంబరాలు ఆదివారం అమీర్‌పేట్ లాట్ మొబైల్స్‌లో ఆరంభమయ్యాయి. లాట్ మొబైల్స్ ఏజీఎం(సేల్స్) రాజేశ్ నల్లారి డ్రా తీశారు. ఇందులో వరుణ్ మోటార్స్‌లో వెగనార్ కారును కొనుగోలు చేసిన ఎ. సుధీర్ లక్ష రూపాయల బంపర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. దీంతో పాటు మొదటి, రెండు బహుమతులు (మ్యూజిక్ సిస్టమ్, వెట్ గ్రైండర్), మూడు కన్సొలేషన్ బహుమతుల (సెల్‌కాన్ మొబైల్స్)కు డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు.
షాపింగ్ చేయండి... రూ. లక్ష గెలుచుకోండి..
ఈ నెల 22 వరకు సాక్షిలో ప్రకటించిన షోరూంలలో షాపింగ్ చేసేవారు ఈ సంబరాల్లో పాల్గొనవచ్చు. ప్రతిరోజూ బంపర్‌ప్రైజ్ కింద లక్ష రూపాయలతో పాటు మరో ఐదుగురికి బహుమతులు అందిస్తాం అని ‘సాక్షి’ అడ్వర్టయిజింగ్ జనరల్ మేనేజర్ రమణ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో లాట్ మొబైల్స్ రీజనల్ సేల్స్ మేనేజర్ వినయ్, బిగ్ ఎఫ్‌ఎం ఆర్జే శేఖర్ బాషా, ‘సాక్షి’ అడ్వర్టయిజింగ్ ఏజీఎం వినోద్ మాదాసులు పాల్గొన్నారు.
ఎదురుచూస్తున్నారు..
‘సాక్షి’ పండుగ సంబరాలు మళ్లీ ఎప్పుడొస్తాయా? అని కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. గతంలో బహుమతులు గెలిచిన వారి ద్వారా ఈ సంబరాలు ప్రతిఒక్కరి మనసును గెలుచుకున్నాయి. ఈ సంబరాలు అటు కస్టమర్లను లక్షాధికారి చేయడంతో పాటు ఇటు వ్యాపారపరంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. మున్ముందు కూడా ‘సాక్షి’ చేపట్టే కార్యక్రమాల్లో ఇదేవిధమైన భాగస్వామిగా నిలుస్తామని సగర్వంగా చెబుతున్నా.
- రాజేశ్ నల్లారి, లాట్ మొబైల్స్ ఏజీఎం (సేల్స్)