26,27 తేదీల్లో సాక్షి మెగా ఆటో షో | Sakshi on 26.27 Mega Auto Show | Sakshi
Sakshi News home page

26,27 తేదీల్లో సాక్షి మెగా ఆటో షో

Published Tue, Jul 22 2014 1:09 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Sakshi on 26.27 Mega Auto Show

  •     ఎంవీపీ కాలనీ వుడా గ్రౌండ్ వేదిక
  •      రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ
  •      ఏ వాహనం బుక్ చేసుకున్నా బంపర్ బహుమతి
  •      ఉచిత పొల్యూషన్ చెకప్, సర్వీస్ క్యాంప్
  • విశాఖపట్నం : కారు...బైక్...ఆటో...స్కూటర్ కొనుక్కోవాలనుకుంటున్నారా.. అయితే ‘సాక్షి’ మీ కు సువర్ణావకాశం కల్పించనుంది. కళ్లు చెది రేలా అన్ని కంపెనీల మోడల్స్‌ను ఒకే వేదిక పైకి తేనుంది. ఎంవీపీ కాలనీ వుడా గ్రౌండ్ వేది కగా ఈ నెల 26, 27 వ తేదీల్లో సాక్షి మెగా ఆటో షో నిర్వహించనుంది.

    ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సందర్శించవచ్చు. నచ్చిన వాహనాన్ని బుక్ చేసుకొని లక్కీ డ్రా ద్వారా సుజికి లెట్స్ ద్విచక్రవాహనాన్ని బంపర్ బహుమతిగా పొందే అవకాశం ఈ ఆటో షో కల్పిస్తోంది. ఇక్కడ వాహనాలు కొనుక్కున్న వారికి ప్రత్యేక రాయితీ సౌకర్యముంది.

    ప్రముఖ బ్యాంకుల ద్వారా తక్షణ ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వరుణ్‌బజాజ్ సౌజన్యంతో అన్ని కంపెనీల టూ వీలర్, నాలుగు చక్రాల వాహనాలకు  ఉచిత పొల్యూషన్ చెకప్ చేయనున్నారు. అలాగే అన్ని కంపెనీల టూ వీలర్స్‌కు ఉచిత సర్వీస్ క్వాంప్  నిర్వహించనున్నారు.  ఈ మెగా షోకు రేడియో పార్టనర్‌గా రేడియో మిర్చి, టీవీ పార్టనర్‌గా సాక్షి టీవీ వ్యవహరిస్తున్నాయి.

    ఈ రెండు రోజులు జరిగే ఈ షోలో కంటిపూడి నిస్సాన్, లీలా కృష్ణా టయోటా, శ్రీ శ్రీనివాస యమహా, బాంక్ ఆఫ్ ఇండియా, వరుణ్ మారుతి,  జయభేరి మారుతి, వరుణ్‌బజాజ్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, నియాన్ మహేంద్ర, సుందరం హోండా, విష్ణు హోండా, రెనాల్ట్- వైజాగ్, మేంగో హ్యుండాయ్, శివశంకర్ హీరో మోటార్స్, ఆరంజ్ చెవర్లెట్, లక్ష్మీ హ్యుండాయ్, వైజాగ్-సుజుకి, శివశంకర్ టాటా మోటార్స్, ఎస్.వి.పియాజియా మోటార్స్, వరుణ్ బజాజ్ ఆటో కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శించనున్నాయి. ఈ షోలో పాల్గోదలచిన ఆటోమొబైల్ డీలర్లు 9912877822, 9912222796 ఫోన్ నంబర్లలో  సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement