రూ.166 లాటరీ టికెట్‌.. వచ్చిన బహుమతి.. రూ.13,339 కోట్లు  | Lottery for a person in Florida in USA | Sakshi
Sakshi News home page

రూ.166 లాటరీ టికెట్‌.. వచ్చిన బహుమతి.. రూ.13,339 కోట్లు 

Dec 31 2023 4:34 AM | Updated on Dec 31 2023 4:34 AM

Lottery for a person in Florida in USA - Sakshi

ఒక్కసారిగా ఏదైనా కలిసి వచ్చిందంటే.. లాటరీ తగిలిందని అంటుంటాం. మరి ఒక లాటరీ తగిలి మొత్తం జీవితం అసలే మాత్రం ఊహించనంతగా మారిపోతే.. ఆ ఊహే ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది కదా.. అలాగే అమెరికాలోని ఫ్లారిడాలో ఓ వ్యక్తికి లాటరీ(రూ.166)లో ఏకంగా 13,339 కోట్ల రూపాయల (160 కోట్ల డాలర్ల) ‘మెగా మిలియన్‌’ లాటరీ తగిలింది.

నిజానికి సెప్టెంబర్‌ 27నే విజేత ఎవరో తేలిపోయినా.. భద్రతా నిబంధనల మేరకు మూడు నెలల తర్వాత తాజాగా పేరును ప్రకటించారు. సాల్టయిన్‌ హోల్డింగ్స్‌ పేరిట దాని యజమాని ఈ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ‘మెగా మిలియన్‌’ లాటరీ చరిత్రలోనే ఇది అత్యధిక బహుమతి మొత్తం కావడం గమనార్హం. ఇక లాటరీ టికెట్‌ను అమ్మిన జాక్సన్‌విల్లే ప్రాంతంలోని పబ్లిక్స్‌ గ్రోసరీ స్టోర్‌కు రూ.83 లక్షలు (లక్ష డాలర్లు) అదనపు కమీషన్‌గా లభించాయి.      –సాక్షి  సెంట్రల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement