అదృష్టం అంటే ఇదే మరి... ఐదు నెలల్లో రెండు సార్లు | A Man Winning Lottery Twice In Five Months In Canada | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 13 2018 10:33 AM | Last Updated on Thu, Sep 13 2018 10:35 AM

A Man Winning Lottery Twice In Five Months In Canada - Sakshi

కెనడా : అదృష్టం జీవితంలో ఒకసారే తలుపు తడుతుందన్నని అంటారు. కానీ మనోడిని మాత్రం రెండు సార్లు తలుపు తట్టింది. ఇంకేముంది రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. అది ఎలా అనుకుంటున్నారా.. మనోడికి అదృష్ట దేవత లాటరీ రూపంలో దర్శనమిచ్చింది. అది కూడా ఐదు నెలల్లో రెండు సార్లు. అఫ్రికా నుంచి కెనడా వలస వచ్చిన మెల్హిగ్ మెల్హిగ్‌ 28 ఏళ్ల వయసు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మెల్హిగ్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో 1.5మిలియన్‌ డాలర్ల లాటరీ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అంతటితో సరిపెట్టుకోక గత నెలలో మళ్లీ లాటరీ టికెట్‌ కొన్నాడు. 13లక్షల మంది వేసిన ఈ లాటరీ(2మిలియన్‌ డాలర్లు) మళ్లీ మెల్హిన్‌కు దగిలింది. దీంతో మెల్హిగ్‌ దాదాపు 19 కోట్ల రూపాయలు(3.5మిలియన్‌ డాలర్లు)  లాటరీ ద్వారా సంపాదించాడు. 
 
ఈ లాటరీ డబ్బుతో ఏం చెయ్యాలనుకుంటున్నావని లాటరీ అధికారులు అడగ్గా ‘ మొదటిసారి వచ్చిన లాటరీ డబ్బులతో నా భార్య, పిల్లల కోసం మంచి ఇంటిని కొన్నాను. ఈ సారి వచ్చిన డబ్బుతో నేను బిజినెస్‌ చెయ్యాలనుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగ పడే ఏదైనా మంచి పని చేయ్యాలనుకుంటున్నాను. కార్లు వ్యాపారం లేక ఇంధన వ్యాపారం చేయ్యాలనుకుంటున్నాను’ అని మల్హిన్ పేర్కొన్నారు. 13లక్షల మందిని కాదని అదృష్ట దేవత మెల్హిన్‌ ఇంటి తలుపులు తెరిచింది. లక్కు అంటే మనోడిదే మరి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement