రియల్ ఎస్టేట్ రంగంలో విధించాల్సిన జీఎస్‌టీపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే జీఎస్‌టీ కౌన్సిల్ మావేశం ముగిసింది.తదుపరి సమావేశాన్ని ఫిబ్రవరి 24 ఆదివారానికి వాయిదా వేసింది. అలాగే జీఎస్‌టీ 3బి ఫాంల సమర్పణకు గడువును పొడిగించింది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
రియల్టీ, లాటరీరంగాలపై విధించే జీఎస్‌టీ పై ఇంకా చర్చించాల్సి ఉన్న నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదావేశామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫిబ్రవరి 24 ఆదివారం ఢిల్లీలో జరిగే కౌన్సిల్ దీనిపై సమగ్రంగా చర్చించిన అనంతరం నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో జనవరి మాసానికి సంబంధించిన అమ్మకాల రిజిస్ట్రేషన్ల (జీసీటీఆర్ 3బి) ఫైలింగ్‌కు గడువును అన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి 22 శుక్రవారం వరకు పొడిగించినట్టు తెలిపారు. జమ్ము కశ్మీర్ వాసులకు పిబ్రవరి 28 వరకు సమయాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు.
కాగా నివాసిత గృహాలపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి, అందుబాటు ధరల ఇళ్ల ప్రాజెక్టులపై జీఎస్టీని 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ నేతృత్వంలోని మంత్రుల బృందం అభిప్రాయపడింది. నిర్మాణంలో ఉన్న లేదా నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లాట్లపై (పూర్తయినట్టు ధ్రువీకరణ జారీ చేయని వాటిపై) ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయంతో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment