Lottery Winner Back at Work Selling Windows - Sakshi
Sakshi News home page

28 ఏళ్ల క్రితం రూ. 166 కోట్ల జాక్‌పాట్‌.. ఇప్పుడు తిరిగి పాత జీవితంలోకి..

Published Mon, Jul 24 2023 1:17 PM | Last Updated on Mon, Jul 24 2023 1:50 PM

lottery winner back at work selling windows - Sakshi

అతను నేషనల్‌ లాటరీలో 11 మిలియన్ యూరోలు(సుమారు రూ.116 కోట్లు) గెలుచుకున్నాడు. ఇంత భారీ మొత్తం దక్కించుకున్న అతను రెండు దశాబ్ధాల తరువాత తన గత వర్కింగ్‌ లైఫ్‌లోకి తిరిగి వచ్చేశాడు. 61 ఏళ్ల మార్క్‌ గార్డ్‌నర్‌, అతని బిజినెస్‌ పార్ట్‌నర్‌ పాల్‌ మెడిసన్‌ 1995లో 22 మిలియన్ల యూరోలు గెలుచుకున్నారు. దీంతో వారి జీవితం పూర్తిగా మారిపోయింది. మార్క్‌ .. బ్రిటన్‌కు చెందినవాడు. అతను కొంత మొత్తాన్ని అస్తవ్యస్త రీతిలో వివిధ సంస్థల్లో పెట్టుబడి పెట్టాడు. దీంతో కోట్లాది రూపాయలు కోల్పోయాడు. అతని నాల్గవ భార్య కూడా ఇదేవిధంగా వివిధ చోట్లు పెట్టుబడులు పెట్టి నష్టపోయింది. 

‘ఈ పాటికి నేను పనిచేయడం మానేసేవాడిని’
అయితే మార్క్‌ కొంత మొత్తాన్ని మాత్రం సరైన చోట్ల పెట్టుబడిగా పెట్టాడు. వాటిలో యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ కూడా ఒకటి. దీనితో పాటు తమ కంపెనీ క్రాఫ్ట్‌ గ్లాస్‌లో 2 మిలియన్ యూరోలు పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు మార్క్‌ ఈ కంపెనీని నడుపుతున్నాడు. మార్క్‌ మీడియాతో మాట్లాడుతూ ‘నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఆరోజు కాకుండా.. ఇప్పుడు ఈ 61 ఏళ్ల వయసులో లాటరీలో గెలిచివుంటే  పరిస్థితులు మరో విధంగా ఉండేవి. ఈ పాటికి నేను పనిచేయడం మానేసేవాడిని. ఇప్పుడు నా దగ్గర కావాలసినంత తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఒక్క రోజు సెలవు తీసుకున్నా, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాను’ అని అన్నాడు.
 
ప్రతీవారం లాటరీ టిక్కెట్ల కొనుగోలు
మార్క్‌కు ఇప్పటికీ ఫుట్‌బాల్‌తో అనుబంధం ఉంది. అతనికి హాస్టింగ్‌లో లోకల్‌ క్లబ్‌ ఉంది. అలాగే మార్క్‌ గతంలో బార్బాడోస్‌లో ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాడు. లాటరీలో వచ్చిన సొమ్మునంతా అతను దుర్వినియోగం చేయలేదు. కొన్ని పెట్టుబడుల వలన అతనికి లబ్ధి చేకూరింది. ఇప్పుడు కూడా మార్క్‌ ప్రతీవారం లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటాడు. తాను 1995లో ఏ నంబరు లాటరీ టిక్కెట్‌ కొనుగోలు చేశాడో ఆ నంబరు గల లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటాడు. నాటి తన పార్ట్‌నర్‌ పాల్‌ ప్రస్తుతం స్కాట్‌ల్యాండ్‌లో ఉన్నాడని, అయితే అతను ఆ లాటరీ సొమ్ముతో ఏమి చేశాడో తెలియదని మార్క్‌ తెలిపాడు.  
ఇది కూడా చదవండి: కేలండర్‌లో లేని రోజున పుట్టిన పిల్లాడు.. విద్యాశాఖ  నిర్లక్ష్యానికి పరాకాష్ట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement