
లాటరీతో గ్రామాన్ని దత్తత తీసుకున్న కేంద్రమంత్రి
ఘజియాబాద్(యూపీ): విదేశాంగ సహాయ మంత్రి, ఘజియాబాద్ ఎంపీ జనరల్(రిటైర్డ్) వీకే సింగ్... మిర్పూర్ హిందూ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 'సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన'లో భాగంగా ఆయనీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
లాటరీ ద్వారా మిర్పూర్ హిందూ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు వీకే సింగ్ వెల్లడించారు. ఐదేళ్ల పదవీకాలంలో ఒక్కో ఏడాది ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయన్నట్టు తెలిపారు. తన నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ప్రాధాన్యక్రమంలో అభివృద్ధి చేస్తానని ఆయన హామీయిచ్చారు.