V K Singh
-
విదేశాలకు వెళ్లే కార్మికులకు శిక్షణ
పార్లమెంటులో ప్రవాస భారతీయం గల్ఫ్, మలేషియా తదితర దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు ఒకరోజు అవగాహన శిక్షణ ఇస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ డిసెంబర్ 12న లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తమిళనాడుకు చెందిన ఏఐడీఎంకే సభ్యుడు డా.సి.గోపాలక్రిష్ణన్, పి.నాగరాజన్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన పథకంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి పారిశ్రామిక మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రైనింగ్ – పీడీఓటీ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆయా దేశాల సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలు, స్థానిక నియమాలు, నిబంధనలు తెలియజేస్తూ వలస వెళ్లే కార్మికుల విశిష్ట నైపుణ్యాలు (సాఫ్ట్ స్కిల్స్) పెంపొందించుట ఈ శిక్షణ ఉద్దేశమని మంత్రి వివరించారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసలకు మార్గాల గురించి విషయ పరిజ్ఞానం అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడం లక్ష్యమని వివరించారు. ఇప్పటివరకు 30వేల మంది కార్మికులకు పీడీఓటీ శిక్షణ ఇచ్చామని తెలిపారు. అన్ని రిక్రూటింగ్ ఏజెన్సీలు కూడా ఈ శిక్షణను అందించాలని ఆయన కోరారు. కాన్సులార్ ఆక్సెస్.. భారత పౌరులు విదేశీ జైళ్లలో, నిర్బంధ కేంద్రాలలో (డిటెన్షన్ సెంటర్లు) ఉన్నప్పుడు ఆయా దేశాలలోని భారత రాయబార కార్యా లయాలు స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ‘కాన్సులార్ ఆక్సెస్’ (భారత దౌత్య అధికారులను కలిసే అవకాశం) కల్పిస్తున్నామని ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ సభ్యుడు రవీంద్ర కుమార్ జెనా అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు. 68 దేశాల జైళ్లలో 8,445 మంది భారతీయ ఖైదీలు 68 దేశాలలోని వివిధ జైళ్లలో 8,445 మంది భారతీయ ఖైదీలు ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ వెల్లడించారు. పశ్చిమబంగకు చెందిన సీపీఎం సభ్యుడు బదరుద్దొజాఖాన్ అడిగిన ప్రశ్నకు డిసెంబర్ 19న మంత్రి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కొన్ని దేశాలలోని కఠినమైన గోప్యతా చట్టాల కారణంగా ఖైదీల సమాచారాన్ని వెల్లడించడం లేదని, 15 దేశాల జైళ్లలో శిక్ష అనుభవిస్తూ 40 మంది భారతీయ ఖైదీలు మృతిచెందారని తెలిపారు. ‘విదేశా ల్లోని భారతీయుల భద్రత, శ్రేయస్సు భారత ప్రభుత్వం ముఖ్య ప్రాధాన్యతలు. ప్రవాస భారతీయులు దాడులు, అగౌరవానికి గురైన సందర్భాలలో భారత దౌత్య కార్యాలయాలు అప్రమత్తంగా ఉండి జాగరూకతతో పర్యవేక్షిస్తాయి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం. ఉచితంగా సేవలు అందించే న్యాయవాదులు (ప్రోబోనో లాయర్స్) అందుబాటులో ఉన్న దేశాలలో ఖైదీలకు న్యాయ సహాయం అందజేస్తున్నాం’ అని మంత్రి వివరించారు. శిక్ష కాలం పూర్తయిన భారతీయ ఖైదీల విడుదలకు ఆయా దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. విదేశీ ప్రభుత్వాలకు చెందిన సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని ఎగ్జిట్ వీసాలు (దేశం విడిచి వెళ్లడానికి అనుమతి), జరిమానాల మాఫీ లాంటి పనులు వేగవంతంగా పూర్తిచేసి త్వరగా భారత్‌కు రప్పిస్తున్నామని పేర్కొన్నారు. విడుదలైన ఖైదీలకు అవసరమైన సందర్భాలలో ఉచితంగా విమాన ప్రయాణ టికెట్లు సమకూరుస్తున్నామని వివరించారు. కాగా, గల్ఫ్‌లోని ఆరు దేశాల జైళ్లలో 4,705 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తున్నారు. –మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు -
పాస్‌పోర్ట్ ఇక ఈజీ!
భువనేశ్వర్: పాస్‌పోర్ట్ కోసం ఇక వందలకొద్దీ కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేదు. జిల్లా కేంద్రాల్లోనే పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 800 పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకేసింగ్ మంగళవారం మీడియాకు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సబ్కా సాత్ సబ్కా వికాస్ చర్చా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 150 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. రానున్న రెండేళ్లలో అన్ని జిల్లా ప్రధాన పోస్టాఫీసుల్లో మరో 800 ఓపెన్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పాస్‌పోర్టు కోసం ప్రజలు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విదేశీ మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ కలిసి ఈ సేవలు అందించనున్నాయని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా పాస్‌పోర్టు సేవలు అందుతాయని ఆయన భరోసాయిచ్చారు. దేశంలో ఇప్పటికే పలు ప్రధాన పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించారు. -
95,665 మంది భారతీయులు వెనక్కి
న్యూఢిల్లీ : అంతర్యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలతో విదేశాల్లో నలిగిపోతున్న భారతీయులను తిరిగి దేశానికి తీసుకొచ్చామని ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. 95,665 మంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చినట్టు పేర్కొంది. గత రెండేళ్లలో గల్ఫ్ రీజన్లో నెలకొన్న ఆర్ధిక మందగమనానికి తీవ్రంగా ప్రభావితమవుతున్న వారిని రక్షించామని ప్రభుత్వం తెలిపింది. భారతీయుల రక్షణకే ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని, విదేశాల్లో భారతీయులు మంచిగా నివసించాలని కోరుకుంటుందని విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వీకే సింగ్ లోక్‌సభకు తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ప్రభుత్వం సాయపడిందన్నారు. గల్ఫ్ రీజన్లో ఉన్న భారతీయులు ఆర్థికమందగమనంతో ప్రభావితమయ్యారని చెప్పారు. ఈ సమస్యతో అక్కడ ఉపాధి బాగా దెబ్బతిన్నిందన్నారు. ఇండియన్ మిషన్స్, అండ్ పోస్ట్స్ దగ్గరున్న డేటా ప్రకారం 1,23,098 మంది భారతీయులు ప్రభుత్వం మద్దతు కోరారని, వారిలో 95,665 మంది దేశీయులను గత రెండేళ్లలో భారత్‌కు తీసుకొచ్చామన్నారు. నేపాల్ నుంచి 65,000 మందిని, మలేషియా నుంచి 12,470 మంది, యెమెన్ నుంచి 4748 మందిని, ఒమన్ నుంచి 3225 మందిని అలా వివిధ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని వెనక్కి తీసుకొచ్చామని తెలిపారు. -
ఆ జవాను కాంగ్రెస్ సర్పంచ్‌గా గెలిచాడు!
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌వోపీ) అమలు విషయమై ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ మాజీ జవాను రాంకిషన్ గ్రెవాల్‌పై మరోసారి కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ విమర్శలు గుప్పించారు. రాంకిషన్ మానసిక పరిస్థితిపై బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీకేసింగ్ తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని ఆరోపించారు. రాంకిషన్ కాంగ్రెస్ టికెట్‌పై సర్పంచ్‌గా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని చెప్పారు. ఏదిఏమైనా ఆయన ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆయనకు ఆత్మహత్య చేసుకోవడానికి సల్ఫాస్ ట్యాబ్లెట్లు ఎవరు ఇచ్చారనే దానిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని పేర్కొన్నారు. బ్యాంకు డబ్బు విషయమై ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రాం కిషన్ సాయం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించి.. అది లభించకపోయి ఉంటే.. అప్పుడు తమ తప్పు అయ్యేదని, ఈ వ్యవహారంలో ప్రభుత్వం తప్పేమీ లేదని పేర్కొన్నారు. ఆర్మీ జవాన్లుకు మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చినమేరకు ఓఆర్‌వోపీ పథకాన్ని అమలుచేయకపోవడంతో మనస్తాపం చెందిన ఆర్మీ మాజీ సుబేదార్ రామ్ కిషన్ గ్రెవాల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికీ లక్షమందికిపైగా రక్షణశాఖ సిబ్బందికి ఓఆర్‌వోపీ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉందని తెలిపారు. కాగా, ఆత్మహత్య చేసుకున్న జవాను మానసిక పరిస్థితి ఏమిటో విచారించాలన్న వీకే సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ బబ్బర్ మండిపడ్డారు. ముందు వీకే సింగ్ మానసిక పరిస్థితి ఏమిటో ఆరా తీయాలని, ఇలాంటి వ్యక్తి పేరు ముందు జనరల్ అని రాసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. -
పోలీస్ శాఖలో మార్పులు అవసరమే: వీకే సింగ్
హైదరాబాద్: అక్రమాలతో నిర్వీర్యమైపోతున్న పోలీస్ శాఖలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ వినోద్‌కుమార్ ఇటీవల చేసిన ప్రకటనతో ఏకీభవిస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ వి.కె.సింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేదలు, నిరక్షరాస్యులు అకారణంగా శిక్షలు పడి జైళ్లలో మగ్గుతూ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని, ఈ క్రమంలో పోలీసు వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఎంపీ వినోద్ ఆవేదన వ్యక్తం చేయడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. పోలీసుల అక్రమ చర్యల కారణంగా నిర్భాగ్యులు కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అంగీకరించారు. పోలీస్ వ్యవస్థలో అక్రమాలు నెలకొన్నప్పుడు మార్పులు అనివార్యమన్నారు. -
లాటరీతో గ్రామాన్ని దత్తత తీసుకున్న కేంద్రమంత్రి
ఘజియాబాద్(యూపీ): విదేశాంగ సహాయ మంత్రి, ఘజియాబాద్ ఎంపీ జనరల్(రిటైర్డ్) వీకే సింగ్... మిర్పూర్ హిందూ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 'సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన'లో భాగంగా ఆయనీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. లాటరీ ద్వారా మిర్పూర్ హిందూ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు వీకే సింగ్ వెల్లడించారు. ఐదేళ్ల పదవీకాలంలో ఒక్కో ఏడాది ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయన్నట్టు తెలిపారు. తన నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ప్రాధాన్యక్రమంలో అభివృద్ధి చేస్తానని ఆయన హామీయిచ్చారు. -
అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవదహనం
ఘాజియాబాద్: అగ్నిప్రమాదంలో ముగ్గరు సజీవదహనమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రగాయాలపాలైనట్టు తెలుస్తోంది. సియానీ గేట్ ఏరియా వద్ద టెంట్ హౌస్ లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రాత్రి 1.45 గంటల ప్రాంతంలో ఘటనా స్థలికి చేరుకున్నట్టు అగ్నిమాపక శాఖ అధికారి వికె. సింగ్ తెలిపారు. అప్పటికే అగ్నిజ్వాలలు ఎగసిపడుతుండటంతో నలుగురు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించినట్టు చెప్పారు. చివరికి గురువారం ఉదయానికి మంటలు అదుపులోకి తెచ్చినట్టు అగ్నిమాపక శాఖ వెల్లడించింది. ఈ అగ్నిప్రమాదంలో సజీవ దహనమైన ముగ్గురు సంజీవ్, సునీల్, భవానీ అనే వ్యక్తులుగా గుర్తించామని చెప్పారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సింగ్ తెలిపారు. వీరంతా టెంట్ హూస్‌లో పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు వికె సింగ్ పేర్కొన్నారు. -
నెహ్రూకు తిరుగుబాటు భయం
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ న్యూఢిల్లీ: భారతదేశ తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూను ‘సైనిక తిరుగుబాటు’ భయం వెన్నాడుతుండేదని సైనికదళాల మాజీ ప్రధానాధికారి జనరల్ వీకే సింగ్ పేర్కొన్నారు. చైనా దాడుల కన్నా ఆర్మీ చీఫ్‌లకు ప్రజాభిమానం పెరగడం పైనే నెహ్రూ ఎక్కువ ఆందోళన చెందేవాడని వ్యాఖ్యానించారు. తన ఆత్మకథ ‘కరేజ్ అండ్ కన్విక్షన్’లో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ తిమ్మయ్యకు వ్యక్తిగతంగా పెరుగుతున్న ప్రజాభిమానం నెహ్రూకు పీడకలలు తెప్పించేదన్నారు. బల్దేవ్ సింగ్‌లోని కుట్రలను తిప్పికొట్టగల రాజకీయ చాణక్యతను చూసే దేశ తొలి రక్షణ మంత్రిగా ఆయనను నెహ్రూ నియమించారన్నారు. నెహ్రూ చుట్టూ ఉన్నవారు సైనిక తిరుగుబాటు బూచిని చూపి పౌర, సైనిక వ్యవస్థల మధ్య సత్సంబంధాలు ఏర్పడకుండా అడ్డుపడేవారని సింగ్ తెలిపారు. 1962నాటి చైనా యుద్ధ సమయంలో సైనిక దళాలను సిద్ధంగా ఉంచడంలో దేశ నాయకత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ‘చండీగఢ్ మేథోవర్గం’ సూచనల మేరకు ఆయన నడుచుకునేవారని వెల్లడించారు. నెహ్రూ నుంచి రాజకీయ నాయకత్వాన్నే కాకుండా ఆయన భయ లక్షణాలను కూడా ఇందిరాగాంధీ పొందారని విమర్శించారు. వయసుకు సంబంధించిన వివాదంలో కేంద్రంతో పోరాడిన సింగ్.. ఆ వివాదంలో ప్రధాని కార్యాలయంలోని ఒక ఉన్నతాధికారి హస్తం ఉందని ఆరోపించారు. ఆ సమయంలో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సూచన మేరకే తాను రాజీనామా చేయలేదని సింగ్ ఆ పుస్తకంలో రాశారు. అయితే, రాజీనామా చేయవద్దని తాను చెప్పలేదని ప్రతిభాపాటిల్ స్పష్టంచేశారు. -
మళ్లీ దేశవ్యాప్త యాత్రకు అన్నా హజారే
సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే గతంలో బీహార్ నుంచి ప్రారంభించి ఆపేసిన దేశవ్యాప్త చైతన్యయాత్ర పునరుద్ధరించాలని భావిస్తున్నారు. భారతదేశంలో వ్యవస్థాగత మార్పులు, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు, తన సందేశాలను తీసుకెళ్లేందుకు వాలంటీర్లను నియమించుకునేందుకు అన్నా హజారే ఈ యాత్ర చేపట్టారు. మధ్యలో ఆపేసిన చైతన్యయాత్రను తిరిగి ప్రారంభించాలని హజారే భావిస్తున్నారని ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాము ఈ యాత్ర ప్రారంభించలేదని ఆయన స్పష్టం చేశారు. సచ్ఛీరులను ఎన్నుకునేలా ఓటర్లను చైతన్యవంతులను చేయాలన్నదే తమ ధ్యేయమని వెల్లడించారు. మంచివారిని ఎన్నుకుంటే వ్యవస్థలో సానుకూల మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నా హజారేతో కలిసి వీకే సింగ్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు.