95,665 మంది భారతీయులు వెనక్కి
95,665 మంది భారతీయులు వెనక్కి
Published Wed, Feb 8 2017 7:50 PM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM
న్యూఢిల్లీ : అంతర్యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలతో విదేశాల్లో నలిగిపోతున్న భారతీయులను తిరిగి దేశానికి తీసుకొచ్చామని ప్రభుత్వం లోక్సభకు తెలిపింది. 95,665 మంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చినట్టు పేర్కొంది. గత రెండేళ్లలో గల్ఫ్ రీజన్లో నెలకొన్న ఆర్ధిక మందగమనానికి తీవ్రంగా ప్రభావితమవుతున్న వారిని రక్షించామని ప్రభుత్వం తెలిపింది. భారతీయుల రక్షణకే ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని, విదేశాల్లో భారతీయులు మంచిగా నివసించాలని కోరుకుంటుందని విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వీకే సింగ్ లోక్సభకు తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ప్రభుత్వం సాయపడిందన్నారు.
గల్ఫ్ రీజన్లో ఉన్న భారతీయులు ఆర్థికమందగమనంతో ప్రభావితమయ్యారని చెప్పారు. ఈ సమస్యతో అక్కడ ఉపాధి బాగా దెబ్బతిన్నిందన్నారు. ఇండియన్ మిషన్స్, అండ్ పోస్ట్స్ దగ్గరున్న డేటా ప్రకారం 1,23,098 మంది భారతీయులు ప్రభుత్వం మద్దతు కోరారని, వారిలో 95,665 మంది దేశీయులను గత రెండేళ్లలో భారత్కు తీసుకొచ్చామన్నారు. నేపాల్ నుంచి 65,000 మందిని, మలేషియా నుంచి 12,470 మంది, యెమెన్ నుంచి 4748 మందిని, ఒమన్ నుంచి 3225 మందిని అలా వివిధ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని వెనక్కి తీసుకొచ్చామని తెలిపారు.
Advertisement
Advertisement