పోలీస్ శాఖలో మార్పులు అవసరమే: వీకే సింగ్ | modifications requires in police departement says v k singh | Sakshi
Sakshi News home page

పోలీస్ శాఖలో మార్పులు అవసరమే: వీకే సింగ్

Published Fri, Oct 2 2015 3:07 AM | Last Updated on Tue, Aug 21 2018 8:41 PM

modifications requires in police departement says v k singh

 హైదరాబాద్: అక్రమాలతో నిర్వీర్యమైపోతున్న పోలీస్ శాఖలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ వినోద్‌కుమార్ ఇటీవల చేసిన ప్రకటనతో ఏకీభవిస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ వి.కె.సింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేదలు, నిరక్షరాస్యులు అకారణంగా శిక్షలు పడి జైళ్లలో మగ్గుతూ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని, ఈ క్రమంలో పోలీసు వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఎంపీ వినోద్ ఆవేదన వ్యక్తం చేయడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు.

పోలీసుల అక్రమ చర్యల కారణంగా నిర్భాగ్యులు కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అంగీకరించారు. పోలీస్ వ్యవస్థలో అక్రమాలు నెలకొన్నప్పుడు మార్పులు అనివార్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement