మోసగాళ్ళు ఎవరు..?
- తప్పుడు ఫోన్‌కాళ్లతో బురిడి కొటిస్తున్నది తెలిసినవాళ్లేనా ..?
- వేలకువేలు దండుకుంటున్న ముఠాకేంద్రాలు పోస్టాఫీసులేనా...?
- సెల్‌ఫోన్‌కు బదులుగా బొమ్మలు పంపేదవరు...?
- నిలదీస్తే డబ్బు ఇచ్చేదెవరు.?
పుంగనూరు: హాలో...మేడం....హాలో సార్... మీ సెంబర్‌కు లాటరి వచ్చింది. మా ఆదిత్య సంస్థ , రోహిణి సంస్థల యాబై సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా మీసెల్ నెంబరుకు లాటరీ వచ్చింది. ఆఫర్‌లో రూ.14 వేలు విలువ చేసే సెల్‌ఫోను కేవలం రూ.3500, రూ.4 వేలకే పంపుతున్నాము... నా పేరు రాకేష్.... ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను. పది రోజులో పోస్టాఫీసు ద్వారా పార్శిల్ వస్తుంది.... డబ్బు కట్టి డెలవరీ తీసుకోండి....అంటు స్వచ్చమైన తెలుగుబాషలో మాట్లాడి ఫోన్ పెట్టేస్తున్నాడు. ఆమాయక జనం ఆ పది రోజుల కోసం ఎదురుచూస్తారు.
పదోరోజు రాకేష్ సెల్‌ఫోన్ నెంబర్లు 9266800538, 9212134892 తో ప్రజలకు ఫోన్ చేసి, ఫోస్టాఫీసుకు ఫార్శిల్ వచ్చింది తీసుకోమని చెబుతాడు. ఫార్శిల్ తీసుకుని , ఆసలు విషయం భయటపడిన తరువాత రాకేష్ ఫోన్లు ఎత్తడం మానివేస్తాడు. ఈ తతంగం జిల్లాలో తీవ్రమైంది. ముఖ్యంగా పడమటి మండలాల్లో ఈ రకం మోసాలు తీవ్రంకావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనిని ఫోస్టాఫీసులో నిలధీసిన వారికి మాత్రం డబ్బులు చెల్లిస్తుండటంతో ఫోస్టాఫీసులపై అనుమానాలు తీవ్రమౌతోంది.
వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గోకుల్‌వీధిలో రవికుమార్ , ఆయన సతీమణి ప్రీతి ఇద్దరు ప్రై వేటు ఉద్యోగులు . వీరికి మేనెల 20న రాకేష్ అనే వ్యక్తి బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాని చెప్పి, సెల్‌ఫోన్ ఆఫర్ వచ్చిందని రూ.3500లు కట్టి ఫోస్టాఫీసులో ఫార్శిల్ తీసుకోవాలన్నారు. 30న ప్రీతి భర్త రవికుమార్ ఫోస్టాపీసుకు వెళ్లి పార్శిల్ తీసుకుని ఓఫెన్ చేయడంతో నివ్వేరపోయాడు. సెల్‌ఫోన్ బదులుగా లక్ష్మి, తాబేలు బొమ్మలు పంపారు. దీనిపై వారు ఫోస్టాఫీసులో ఫిర్యాదు చేశారు. సిబ్బందితో ఘర్షణకు దిగారు.
ఈ విషయమై సాక్షిలో మే 31న సెల్‌కు బదులు లక్ష్మియంత్రం అన్న శీర్షికన కథనం వెలువడింది. దీనిపై ఫోస్టాఫీసు వారు గుట్టుచప్పుడు కాకుండ ఈనెల 7న ప్రీతి, రవికుమార్‌లను పిలిపించి డబ్బులు ఇచ్చి పంపారు. కాగా ప్రజలను మోసగిస్తున్న వాళ్లు, బాధితులకు తెలిసినవాళ్లేనా అన్న అనుమానాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనలు దీనికి బలం చేకూర్చుతుండగా ఈ మోసాలకు తలపాలశాఖ కార్యాలయాలు కేంద్రంగా కొనసాగుతున్నాయా అన్న అనుమానాలు లేకపోలేదు.
ఒకొక్కఫోస్టాఫీసులో 20 ఫార్శిళ్లు ...
జిల్లాలో 5 హెడ్‌ఫోస్టాఫీసులు, 6 బ్రాంచ్ ఫోస్టాఫీసులు , 13 సబ్ ఫోస్టాఫీసులు ఉన్నాయి. ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచ్ కార్యాలయాలు ఉన్నాయి. వీటికి ఆదిత్య, రోహిణి కంపెని ఢిల్లీ పేరుతో రోజుకు ఒకొక్క ఫోస్టాఫీసులకు 20 నుంచి 50 ఫార్శిళ్లు చేరుతోంది. ఈ విధంగా ఫోస్టాఫీసు సిబ్బంది ఫార్శిళ్లను ప్రజలకు చేర్చి వారి వద్ద నుంచి తీసుకున్న ఒకొక్క ఫార్శిల్‌కు రూ.4 వేలను వసూలు చేసి, రోహిణి, ఆదిత్యకంపెనిలకు చేర వేస్తున్నారు. ఈ విధంగా రూ.2 లక్షలు ఒకొక్క ఫోస్టాఫీసు నుంచి నకిలి కంపెనిలకు చేరుతోంది. ఈ విధంగా జిల్లాలోని ఫోస్టాఫీసుల ద్వారా సుమారు రూ.50 లక్షలు ఢిల్లీ ఖాతాకు జమకాబడుతోంది. ఈ విధంగా జిల్లాలో మోసాలు తీవ్రమైంది. ఫోస్టాఫీసు సిబ్బంది నిలధీసిన వారికి మాత్రమే డబ్బులు ఇవ్వడం అనుమానాలకు, విమర్శలకు దారితీస్తోంది.
మోసపోయిన బాధితులు
పుంగనూరు పట్టణంలోని ప్రీతి, రామసముద్రం మండలం ఎలకపల్లెకు చెందిన విజయ్‌కుమార్, పట్టణంలోని కొత్తయిండ్లుకు చెందిన సాధిక్‌బాషా, పుంగనూరు మండలం మర్రిమాకులపల్లెకు చెందిన శ్రీనివాసులు, పులిచెర్ల మండలం కోటపల్లెకు చెందిన నరేష్, మదనపల్లె పట్టణం ఎల్‌ఐసీ కాలనీకి చెందిన రమేష్ లు ఇలాంటి ఫార్శిల్ తీసుకుని మోసపోయిన వారిలో ఉన్నారు.
చర్యలు తీసుకుంటాం...
సెల్‌ఫోన్‌లో ప్రజలను మోసగిస్తున్న వ్యక్తులపైన , వారి సెల్‌నెంబర్ల పైన జిల్లాఅధికారులకు తెలిపి, ఆదిత్య కంపెని పేరుతో పంపుతున్న వ్యక్తులపైన , వస్తున్న ఫార్శిళ్లపైన, నిఘా పెడుతాం. ఈ విషయమై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు సమస్యను వివరించి ప్రజలు మోసపోకుండ చర్యలు తీసుకుంటాం..
- ఎస్‌ఐ హరిప్రసాద్, పుంగనూరు.
ఫోస్టుమాస్టర్ వివరణ....
ఈ విషయమై పుంగనూరు ఫోస్టుమాస్టర్ క్రిష్ణమూర్తిని సాక్షి విచారించగా బాధితురాలు ప్రీతి డబ్బును ఢిల్లీకి సర్వీస్ ఈఎంవో ద్వారా లేదా ఈ ఫోస్టాఫీసు ద్వారా పంపాలన్నారు. కాని లైన్లు దొరక్కపోవడంతో ఈఎంవో ద్వారా పంపి, ఫిర్యాదు మేరకు డబ్బు బదిలి ఆపివేసి, బాధితురాలుకు డబ్బు ఇచ్చామన్నారు. ఇలాంటి ఫార్శిల్ వస్తున్నాయని, ముందుగా ప్రజలకు తెలిసిన విషయాలు చెబుతున్నామన్నారు. ఫోస్టాఫీసు సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
మోసాలపై నిలధీయ్యండి ...
ఢీల్లి నుంచి వచ్చిన ఫార్శిల్ తీసుకుని మోసపోయాను. వెంటనే పుంగనూరు ఫోస్టాఫీసుపై ఫిర్యాదు చేశాను. దీంతో ఈనెల 7న ఫోస్టాఫీసు వారు నాకు రూ.3500లు వాపస్సు ఇచ్చారు. ఇది ఎలా సాధ్యం. మే 30న ఇదే ఫోస్టాఫీసు వారు రోహిణి కంపెనీకు డబ్బు జమ చేశామని చెప్పారు. తిరిగి ఇచ్చేశారు. దీనిపై ఫోస్టాఫీసులపై అనుమానాలు కలుగుతోంది. పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాలి.
- ప్రీతీ, బాధితురాలు, పుంగనూరు.