సెల్‌ఫోన్ వస్తుందని.. మోసం
చిలుకూరు(కోదాడ): ‘నీ నంబర్‌కు ఆఫర్ వచ్చింది.. ఖరీదైన సామ్‌సంగ్ ఫోన్ పంపిస్తున్నాం’ అని ఫోన్ చేసి మోసం చేసిన సంఘటన మంగళవారం చిలుకూరులో చోటుచేసుకుంది. మండలంలోని జానకీనగర్ గ్రామానికి చెందిన బాణోతు రమేష్‌కు వారం రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది. ‘నీ ఫోన్ నంబర్‌కు ఖరీదైన సామ్‌సంగ్ జే7 ఫోన్ ఆఫర్ వచ్చింది.. అడ్రస్ చెప్తే.. ఫోన్ పంపిస్తా’మని చెప్పారు. దీంతో రమేష్ అడ్రస్ చెప్పాడు.
సోమవారం మరోసారి ఫోన్ చేసి నీకు మంగవారం చిలుకూరు ఫోస్టాఫీస్‌కు సెల్‌ఫోన్‌తో కూడిన ఫ్యాకేజీ వస్తుందని అందుకు కేవలం రూ.మూడు వేలు చెల్లించాలని చెప్పారు. రమేష్ వెంటనే మంగళవారం చిలుకూరు ఫోస్టాఫీస్‌కు వెళ్లడంతో.. రూ.మూడు వేలు ఇచ్చి ఫ్యాకేట్ ఓపెన్ చేయాలని పోస్‌మెన్ చెప్పడు. దీంతో రమేష్ రూ.మూడు వేలు ఫ్యాకేట్‌కు, పోస్టల్ ఛార్జీలు రూ.300 చెల్లించి ఫ్యాకేట్ ఓపెన్ చేశారు.
అందులో సెల్‌ఫోన్ లేదు.. లక్ష్మీదేవి బొమ్మ, కూర్మం యంత్రం, శ్రీచక్ర యంత్రం ఉన్నాయి. వీటి విలువ మొత్తం కలిపినా.. కేవలం రూ.100 లోపే ఉంటుంది. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించి లబోదిబోమన్నాడు. ఇలాంటి సంఘటన చిలుకూరు మండలంలోని ఇప్పటికే నాలుగు జరిగినట్లుగా తెలిసింది. ఈ విషయంపై ఇప్పటికైనా పోలీసులు చొరవ తీసుకుని ఇలాంటి మోసాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.