మిర్యాలగూడ అర్బన్ : నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టాడు.. రైతుల వద్ద రూ. లక్షలు విలువ చేసే ధాన్యాన్ని, డీలర్ల వద్ద ఫోన్లు కొనుగోలు చేశాడు. డబ్బులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఉడాయించారు. మిర్యాలగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు.. పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన రాయిని సోమేశ్వర్‌రావు కొంతకాలంగా నాగా ర్జుననగర్‌లో ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు.
కొద్ది రోజులుగా పట్టణంలోని ఎన్‌టీఆర్ కాంప్లెక్స్‌లో లక్కీ మొబైల్ షాపు నిర్వహిస్తూ, ఇటీవల పలు గ్రామాల్లోని రైతుల వద్ద రూ,50 లక్షల విలువైన ధాన్యం కొనుగోలు చేశాడు. దీనికి మొబైల్ షాపు ద్వార పలు కంపినీల డీలర్ల వద్ద రూ.10లక్షల విలువైనమొబైల్స్ తీసుకున్నాడు. గత శనివారం రాత్రి అద్దె ఇంటిని ఖాళీ చేసి, దుకాణంలోని సామగ్రితో సహా తీసుకుని కనిపించకుండాపోయాడు. ధాన్యం విక్రయించిన రైతులు ఇంటి వద్దకు రాక వ్యాపారి పరారైన విష యం వెలుగులోకి వచ్చింది. దీంతో తాము మోసపోయామని బాధితులు లబో దిబోమంటున్నారు. వ్యా పారి ఆచూకీ గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment