
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మునగాల(నల్లగొండ): ఉరేసుకుని వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని ముకుందాపురంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఓర్సు వెంకన్న భార్య సరిత(32) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. పొలానికి వెళ్లిన భర్త తిరిగి వచ్చే సరికి మృతిచెందింది.
సరిత అఘాయిత్యానికి ముందుకు 25 నిమిషాల పాటు మరొకరితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. ఆమె ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.