లాటరీ టిక్కెట్‌ కొన్నాడు.. లక్షల బహుమతి మరిచాడు! | 7 Lakh Rupee Lottery in Fazilka Punjab Nowhere to be Found Search | Sakshi
Sakshi News home page

Punjab: లాటరీ టిక్కెట్‌ కొన్నాడు.. లక్షల బహుమతి మరిచాడు!

Published Sat, Feb 24 2024 11:37 AM | Last Updated on Sat, Feb 24 2024 12:23 PM

7 Lakh Rupee Lottery in Fazilka Punjab Nowhere to be Found Search - Sakshi

పంజాబ్‌లోని ఫజిల్కాలో ఓ వింత ఉదంతం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి లాటరీని గెలుచుకున్నాడు. అయితే దీనికి సంబంధించిన బహుమతి మొత్తాన్ని అందుకునేందుకు అతను రాకపోవడం విశేషం. ఈ లాటరీని పంజాబ్ స్టేట్ మంత్లీ లాటరీ డ్రా నిర్వహిస్తుంది. ఈ లాటరీలో బహుమతి మొత్తం రూ.7 లక్షలు. 

ఈ లాటరీలో ఫాజిల్కాకు చెందిన ఒక వ్యక్తి విజేతగా నిలిచాడు. లాటరీ టిక్కెట్ల విక్రేత బాబీ బవేజా మాట్లాడుతూ తన వద్ద ఫాజిల్కాకు చెందిన వ్యక్తి లాటరీని కొనుగోలు చేశాడని, ఆ టికెట్ నంబర్ 688558 అని, దానికి మొదటి బహుమతిగా రూ.7 లక్షలు వచ్చిందని తెలిపారు. విజేతను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 

త్వరలోనే అతని చిరునామా తెలుసుకుని, అందరికీ ఆ విషయాన్ని తెలియజేసి, అతనికి రూ.7 లక్షల రివార్డు ఇస్తామని బాబీ బవేజా  తెలిపారు. గతంలో తన దగ్గర లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో సొమ్ము గెలుచుకున్నవారు ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో  రూ. 5 కోట్లు, రూ. 2.5 కోట్లు, రూ. ఒక కోటి, రూ. 51 లక్షలు, రూ. 25 లక్షలు ఇలా భారీ మొత్తాలను గెలుచుకున్నవారున్నారని వివరించారు.  అయితే లాటరీ విజేత బహుమతి మొత్తాన్ని అందుకునేందుకు తమ దగ్గరకు రాకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాగా దేశంలోని 13 రాష్ట్రాల్లో లాటరీకి అధికారిక గుర్తింపు ఉంది. వాటిలో పంజాబ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో లాటరీ డ్రాను ప్రభుత్వం నిర్వహిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement