
సాక్షి,అనంతపురం: ఏపీలో లిక్కర్ షాపుల కోసం టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను చేజిక్కించుకునేందుకు పచ్చనేతలు అక్రమాలకు తెర తీశారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్‌నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు ఏకంగా కిడ్నాప్‌లు చేసేందుకు తెగబడ్డారు.
మద్యం దుకాణానికి దరఖాస్తు చేశాడన్న కోపంతో యాడికిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ రామ్మోహన్‌ను జేసీ వర్గీయులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు జేసీ వర్గీయుల చెర నుంచి ఎంపీటీసీ రామ్మోహన్‌ను విడిపించారు. టీడీపీ నేతల దాష్టీకంపై యాడికి వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ఏపీలో వైఎస్సార్‌సీపీ హయాంలో ఉన్న పాత మద్యం పాలసీని రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఏపీలో కొత మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మద్యంషాపులను ప్రైవేటు వారికి అప్పగించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ షాపులన్నీ ఎలాగోలా సిండికేట్లుగా మారి దక్కించుకోవాలని టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తుండడం గమనార్హం.
ఇదీ చదవండి: కమీషన్లు..ముడుపులు.. దారి తప్పిన టీడీపీ
Comments
Please login to add a commentAdd a comment