
ముంబై ప్రాంతంలోని హెచ్‌ఎస్‌జి కాంప్లెక్స్‌లోని బూజ్ షాప్ తెరవద్దంటూ మహిళలు అడ్డుపడి, విజయం సాధించారు. కొందరు మద్యం ప్రియులు షాపింగ్ కాంప్లెక్స్ పరిసరాలలో తాగి, చుట్టుపక్కల అమ్మాయిలు, మహిళల పట్ల చులకన వ్యాఖ్యల చేయడం వల్ల తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఇక్కడి మద్యం దుకాణాన్ని మూసేయాలని స్థానిక మహిళలు పట్టుబట్టారు. ఎంకే హెరిటేజ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పురుషులు, పిల్లలు కూడా ఆ మహిళలతో జత కలవడంతో అందరూ కలసి మానవ హారంగా ఏర్పడి మౌన నిరసనను తెలియజేశారు.
ఈ నిరసన ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన వీరు కలెక్టర్ కార్యాలయానికి, ముఖ్యమంత్రికి ఇ–మెయిల్ ద్వారా తమ సందేశాన్ని పంపారు. ముఖ్యంగా మహిళల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడి మద్యం దుకాణాన్ని మూసివేయకపోతే స్థానిక ప్రజలు శాంతిభద్రతల సమస్యలను ఎంతగా ఎదుర్కొంటున్నారో తెలియజేస్తూ 50 మందికి పైగా మహిళలు ఒక మెమోరాండంపై సంతకం చేసి, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు పంపారు.
ఫలితంగా సీఎం నుంచి కలెక్టర్, ఎక్సైజ్ శాఖ, సంబంధిత అన్ని శాఖలకు ఈ సమస్యపై దర్యాప్తు చేయమని రాయగడ్ డివిజన్‌కు ఆదేశాలు అందాయి. ప్రతిపాదిత దుకాణం ప్రసిద్ధ సాయిబాబా ఆలయ ప్రవేశ ద్వారం నుంచి 144 మీటర్ల దూరంలో ఉందని, ప్రముఖుల విగ్రహాలు, విద్యాసంస్థలు, సమీపంలోని రాష్ట్ర రహదారి వంటి ఇతర అడ్డంకులు లేవని ఎక్సైజ్ శాఖ బృందాలు నివేదించాయి.
అయినప్పటికీ స్థానికంగా ఉన్న సమస్యను పరిగణనలోకి తీసుకొని, ఇక్కడ ఉన్న మద్యం షాప్‌ను మరో భవనంలోకి మార్చాలని నిర్ణయించారు. దీంతో మద్యంపై పోరులో మహిళల సాధించిన విజయంగా అందరిని దృష్టిని ఆకర్షించడమే కాదు, ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించింది.
(చదవండి: