బెల్ట్ షాపు నడిపితే రూ.5లక్షలు జరిమానా
ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం చంద్రబాబు
ఇసుకలో అక్రమాలు జరిగితే అధికారులపైనే చర్యలని హెచ్చరిక
సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మద్యం ధరలు, ఇసుక లభ్యత–సరఫరాపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం దుకాణం యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే ఊపేక్షించేందిలేదన్నారు.
ఎమ్మార్పీకి కంటే ఎక్కువ రేటుకు మద్యం విక్రయిస్తూ, బెల్డ్ షాపులను ప్రోత్సహిస్తూ పట్టుబడితే తొలిసారిగా రూ.5 లక్షలు జరిమానా విధించాలన్నారు. అదే తప్పును పునరావృతం చేస్తే దుకాణం లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్, ధరల పట్టికను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇసుక లభ్యతను పెంచాలని సీఎం సూచించారు. ఇసుకలో అక్రమాలు జరిగితే దానికి అధికారుల పైనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment