
సాక్షి, హైదరాబాద్: ఆదాయార్జనలో అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఎక్సైజ్ శాఖ వదిలిపెట్టడంలేదు. కొత్త మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటు పేరుతో ఔత్సాహికుల నుంచి నెల రోజుల్లోనే రూ. 75 కోట్లకుపైగా సంపాదించిన ఆబ్కారీ శాఖ ఇప్పుడు మద్యం వ్యాపారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. శని, ఆదివారాలు సెలవులు ఉన్న నేపథ్యంలో చెక్కు ఇచ్చినా సరే డిపోల నుంచి రిటైలర్లకు మందు సరఫరా చేయాలని నిర్ణయించింది. దీన్ని బట్టి ఖజానాను నింపుకొనే క్రమంలో రెండు రోజుల సమయాన్ని కూడా ఆ శాఖ వదులుకోవడంలేదని అర్ధమవుతోంది.
గతంలో డీడీలు ఇప్పుడు చెక్‌లు
రాష్ట్రంలోని రిటైల్ మద్యం వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ ఇప్పటివరకు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మాత్రమే మందు అమ్ముతోంది. అంటే ఏదైనా వైన్ లేదా బార్ షాపునకు మద్యం కావాలంటే కొనుగోలు విలువకు సరిపడా నగదును బ్యాంకులో చెల్లించి డీడీ రూపంలో సమర్పిస్తేనే డిపో నుంచి షాపునకు మద్యం పంపేది. కానీ, ఇప్పుడు చెక్కు ఇచ్చినా మద్యం సరఫరా చేయాలని శాఖ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. రెండు రోజులను కూడా వృధా చేసుకోకుండా కాసులు రాబట్టుకునేందుకే చెక్కుల నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, చెక్కు బౌన్స్ అయితే మాత్రం 20 శాతం పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment