
సాక్షి, బెంగళూరు : లాక్‌డౌన్ వల్ల మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. మద్యం లభించకపోవడంతో తట్టుకోలేక ఆరుగురు ప్రాణాలు తీసుకుంటున్నారు. కర్ణాటకలో శని, ఆదివారాల్లో నలుగురు మందుబాబులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేవిధంగా, కేరళలో ఇద్దరు వ్యక్తులు మద్యం దొరక్క ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని వైన్స్, బార్ షాపులను మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో మద్యం ప్రియులు తట్టుకోలేకపోతున్నారు. నిత్యం తాగుడుకు అలవాటుపడిన వారు అకస్మాత్తుగా దూరం అయ్యేలోపు మానసిక వేదనకు గురిఅవుతున్నారు. మరికొందరు మాత్రం బార్ షాపులపై దాడులకు పాల్పడుతున్నారు.
ఇక తెలంగాణలోనూ ఆదివారం నుంచి వైన్ షాపులను తెరుస్తారంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ వార్తలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కాగా మద్యం అందుబాటులో లేకపోవడంతో అందరూ కల్లును ఆశ్రయిస్తున్నారు. ప్రజలెవ్వరూ బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నా.. ఇట్లో ఖాళీగా ఉండలేక కల్లుబాట పడుతున్నారు. పలుప్రాంతాల్లో సామాజిక దూరం పాటిస్తూ.. కల్లు సేవించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment