జనావాసాల మధ్య ఏర్పాటైన మద్యం దుకాణాన్ని ధ్వంసం చేసిన స్ధానికులు
సాక్షి, చెన్నై: ప్రజల అభ్యంతరాలను పక్కనపెట్టి సెలయూర్ సమీప నివాస ప్రాంతంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడంతో ఆగ్రహించిన స్ధానికులు దుకాణాన్ని దగ్ధం చేశారు. మహిళలు, పిల్లలకు అసౌకర్యంగా ఉంటుందని తమ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని తాము అధికారులను కోరామని స్ధానికులు తెలిపారు. ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినా మే 11న అత్యంత ఆర్భాటంగా మద్యం దుకాణం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము తీవ్రంగా ప్రతిఘటించినా ప్రభుత్వం మద్యం దుకాణం ప్రారంభించడంతో సహనం కోల్పోయిన స్ధానికులు దుకాణంలోకి చొరబడి షాపును ధ్వంసం చేశారు. బాక్సుల్లో ఉంచిన మద్యం నిల్వలను పగులగొట్టారు. బార్ కోసం అమర్చిన కుర్చీలను విరగ్గొట్టారు. మరోవైపు మద్యం దుకాణాలపై తమిళనాడు ప్రభుత్వం న్యాయస్ధానాల నుంచి సైతం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గత నెలలో మద్రాస్ హైకోర్టు 1700 మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment