
కొవ్వూరు: ‘ఇసుక, మద్యం విషయంలో ఎక్కడా అవినీతి జరగడానికి వీల్లేదు. బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తాం’ ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఏడాది జూలై 26న కొవ్వూరులో జరిగిన నగర దర్శిని సభలో చెప్పిన మాటలు. ఆ సమయంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సై జ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ కూడా అదే వేదికపై ఉన్నారు. సీఎం ప్రకటన చూసి జనం పులకించారు. మద్యం మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని ఆనందించారు. అయితే సీఎం కల్లబొల్లి మాటలతో తమను బురిడీ కొట్టించారని వారికి తెలియలేదు.
ఇది జరిగి రెండున్నర నెలలు గడుస్తున్నా ఎక్కడా మద్యం మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కనీసం బెల్టుషాపులు కూడా మూయించలేదు. రాష్ట్రంలో బెల్టుషాపుల నిర్మూలనకు అధికారంలోకి రాగానే సంతకం చేస్తానన్న సీఎం చంద్రబాబు ఎట్టకేలకు గతేడాది జూలై 19న జీఓ జారీ చేశారు. రా ష్ట్రం సంగతి అటుంచితే కనీసం ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రా తినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా మద్యం అక్రమ అమ్మకాలపై చర్యలు లేవు.
కొవ్వూరు.. మద్యం ఏరులై పారు
కొవ్వూరు నియోజకవర్గంలో మద్యం మాఫియా ఆగడాలకు పగ్గాల్లేకుండా పోయాయి. పల్లెపల్లెనా బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎమ్మార్పీకి రూ. 15 నుంచి రూ.20 వరకు అదనంగా గుంజుతున్నారు. రాత్రింబవళ్లు వ్యత్యాసం లేకుండా విక్రయాలు సాగిస్తున్నాయి. లూజు అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నా యి. దాబాలు బార్‌లను తలపిస్తున్నాయి. చీకటి పడితే కిళ్లీ కొట్లు మద్యం దుకాణాలుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ఇలా కాలో తీరిది. రాష్ట్రంలో ఓ రకమైన మద్యం పాలసీ అమలులో ఉంటే ఇక్కడ మాత్రం మరో పాలసీ అమలవుతోంది. ఈ నియోజకవర్గం ప్రత్యేక సామ్రాజ్యంలా మారింది. దీ నిపై ప్రజలు, ప్రతిపక్షాలు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్‌లో 41 దుకాణాలు, నాలుగు బార్లు ఉన్నా యి. వీటిలో నియోజకవర్గంలో పరిధిలో 26 మద్యం దుకాణాలు, ఒక బెల్టుషాపు నడుస్తున్నాయి. మద్యానికి బానిసలైన వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన డీ ఎడిక్షన్ సెంటర్లు పనిచేయడం లేదు. కొవ్వూరు ప్రభుత్వాస్పత్రిలో మంత్రి ఆర్భాటంగా ప్రారంభించిన డి.అడిక్షన్ సెంటర్ పత్తాలేకుండా పోయింది.
బెల్టుషాపులు.. యథేచ్ఛగా విక్రయాలు
► నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్టుషాపులు నడుస్తున్నాయి.
► తాళ్లపూడి మండలంలో తిరుగుడుమెట్ట గ్రామంలోని మెయిన్‌రోడ్డులో రెండు, వేగేశ్వరపురం ఎస్సీ ఏరియాలో రోడ్డుకు సమీపంలో రెండు బెల్టుషాపులు ఉన్నాయి.
► గజ్జరం, తాళ్లపూడి ఎస్సీ ఏరియాలో బెల్టు దుకాణా లు నిర్వహిస్తున్నారు.
► చాగల్లులో చిక్కాల రోడ్డు శివారున, కోమటి చెరువు సమీపంలో, ఎస్సీ కాలనీలో, మీనానగరంలో మెయి న్‌రోడ్డుపైన, ఇందిరానగర్ కాలనీ శివారున బెల్టుషాపులు జోరుగా నడుస్తున్నాయి.
► ఎస్.ముప్పవరం పంచాయతీ కార్యాలయం సమీపంలో, బీసీ కాలనీలోను బెల్టుషాపులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
► దారవరం ఎస్సీ కాలనీలో, కలవలపల్లి మంచినీటి చెరువు వెనుక శ్మశానం దగ్గరలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో బెల్టుషాపులు ఏర్పాటు చేశారు.
► మార్కొండపాడు ఎస్సీ ఏరియాలో ఒకటి, ఇందిరానగర్ కాలనీ మెయిన్‌రోడ్డులో బెల్టుషాపులు ఉన్నాయి.
► మల్లవరం ఎస్సీ ఏరియాలో మెయిన్‌రోడ్డులో రెండు దుకాణాలు ఉన్నాయి. చంద్రవరంలో ఎస్సీ ఏరియాలో ఒక షాపు, మద్దూ రు వెళ్లే రోడ్డులో వంతెన సమీపంలో ఒక షాపు నడుస్తున్నాయి.
► బ్రాహ్మణగూడెం ఎస్సీ ఏరియాలోని మెయిన్‌రోడ్డులో, చిక్కాల హైస్కూల్ సమీపంలోని మెయిన్‌రోడ్డులో, గౌడ వీధిలో, ఎస్సీ ఏరియాలో బెల్టుషాపులు నడుస్తున్నాయి.
► చిడిపిలోని బీసీ ఏరియాలో ఒకటి, కుమారదేవం గౌ డవీధిలో రెండు షాపులు, ఆరికిరేవుల బోడి చపటా సమీపంలో రెండు, కొత్తకాలనీ సాయిబాబా గుడి సెంటర్‌లో ఒకటి, ఏటిగట్టుపైన ఒకటి బెల్ట్ షాపులు నిర్వస్తున్నారు.
► పెనకనమెట్ట గ్రామ ప్రధాన సెంటర్‌లో, ధర్మవరం ఇందిరమ్మ కాలనీ కొత్తపేటలో మూడు, ఆర్‌సీఎం చర్చి వద్ద ఒకటి, జెడ్పీ హైస్కూల్ వద్ద ఒక షాపు నడుస్తోంది.
► దొమ్మేరులో తురాయి చెట్టుసెంటర్, పంచాయతీ కా ర్యాలయం, ప్రధాన సెంటర్‌లోని కిళ్లీ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.
► తోగుమ్మి అంబేడ్కర్ విగ్రహం సమీపంలో, వాడపల్లిలో ప్రధాన రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా, గ్రామంలో కృష్ణుడి గుడి సమీపంలో, 12వ వార్డు ప్రధాన రోడ్డుతో పాటు పలుచోట్ల మద్యం బెల్ట్ షాపులు నడుపుతున్నారు.
► వాడపల్లి శివారు బంగారమ్మపేటలో బెల్ట్ షాపు ఉంది.
బార్‌లను తలపిస్తున్న దాబాలు
పట్టణ శివారున జాతీయ రహదారి పక్కన ఉన్న దాబాలు బార్‌లుగా మారాయి. రాత్రిళ్లు ఇక్కడ మందుబాబులు అర్ధరాత్రి వరకు తాగి ఘర్షణలకు దిగుతున్నారు. గతంలో కొవ్వూరుకి చెందిన ఇరువర్గాల యువకులు మద్యం సేవిస్తూ గొడవపడగా ఓ వర్గం మరో వర్గంపై పలుమార్లు దాడికి తెగబడింది. ఈ వివాదంలో ఓ వ్యక్తిని బస్టాండ్ సెంటర్‌లో పాశవికంగా హత్యచేసిన సంఘటన జరి గింది. రెండు రోజుల కిత్రం ఐ.పంగిడిలోని మద్యం దుకాణం సమీపంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. దొమ్మేరు, ఐ.పంగిడి, వేములూరు గ్రామాల్లోని దాబాల్లో ఇదే పరిస్థితి. సీతంపేట జంక్షన్ వద్ద కిళ్లీ షాపుల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.
ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
మద్యం ఎమ్మార్పీకు విక్రయించాలని, బెల్టుషాపులు తొ లగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు మార్లు ఉద్యమాలు, ఆందోళనలు చేసింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత సారథ్యంలో కొవ్వూరులో భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రొహిబి షన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు సైతం చేశారు. రెండు నెలలు కిత్రం తాళ్లపూడిలో అధిక ధరలకు విక్రయాలపై వైఎస్సార్ సీపీ నా యకులు ఆందోళన చేశారు. అధికారులు కేసులు నమో దు చేసి చేతులు దులుపుకున్నారు.
గజ్జరం హైస్కూల్‌కు వెళ్లే మార్గంలో మద్యం దుకాణాన్ని వేరే చోటుకు మా ర్చాలని ఈ ఏడాదిలో జూన్‌లో మహిళలు, గ్రామస్తులు పది రోజులకు పైగా ఆందోళన చేశారు. బంగారమ్మపేటలో మహిళలు బెల్ట్ షాపు తొలగించాలని పోరాటం చే స్తున్నా అ«ధికారుల నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు. ఇటీవల మద్దూరులో ఏర్పాటు చేసిన మద్యం దు కాణాన్ని తొలగించాలని మహిళలు పెద్దెత్తున పోరాటం చేశారు. గతంలో ధర్మవరంలో సైతం మద్యం బెల్టుషాపులు తొలగించాలని కోరుతూ పెద్ద ఎత్తున మహిళలు ధర్నా చేసి ఆర్డీఓ, ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం ఇచ్చినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మద్దూరులంక, మద్దూరు గ్రామాల్లోను అనుమతి లే కుండా మద్యం అమ్మకాలు సాగుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.
ముడుపులపై ఆశతోనే..
ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రి వరకు ముడుపులు అందడంతోనే బెల్టుషాపులను నియంత్రించడం లేదు. మంత్రి నియోజకవర్గంలో వీధివీధినా బెల్టుషాపులు నడుస్తున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకాలు సాగిస్తుంటే కొవ్వూరు నియోజకవర్గంలో మాత్రం ఈ నిబంధన అమలుకావడం లేదు. అధికారులు నామమాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మద్యం ఎమ్మార్పీకి విక్రయించాలని, బెల్టుషాపులు తొలగించాలని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదు.
– తానేటి వనిత, వైఎస్సార్ సీపీ
నియోజకవర్గ సమన్వయకర్త, కొవ్వూరు
రూ.20లు అదనంగా బాదుడు
నియోజకవర్గంలోని పలు దుకాణాల్లో క్వార్టర్ బాటిల్‌కు రూ.15 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బీరుపై రూ.20 నుంచి రూ.30 చొప్పున గుంజుతున్నారు. అధిక ధరలకు విక్రయాలపై గతేడాది జూలై నుంచి ఇప్పటివరకూ పరిశీలిస్తే కొవ్వూరు సర్కిల్ పరిధి లో కేవలం 10 కేసులు మాత్రమే నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదులు చేస్తున్నా ఎక్సైజ్ పోలీసులు స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. లూజు విక్రయాలు, నిబంధనలు అతిక్రమించడం వంటి వాటిపై 15 నెలల కాలంలో కేవలం 22 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
ఎనీ టైం మందు
కొవ్వూరు బస్టాండ్ సెంటర్, మెరకవీధి బ్రాందీ షాపుల వద్ద 24 గంటలు మద్యం విక్రయాలు సాగుతున్నాయి. రాత్రిళ్లు షా పు మూసిన తర్వాత బస్టాండ్ సెంటర్ వద్ద దుకాణం వెనుక వైపు నుంచి విక్రయాలు సాగిస్తున్నారు. ఆ సమయంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మెరకవీధి సెంటర్‌లో అయితే షాపు షెట్టర్‌కు రంధ్రం పెట్టి మరీ అమ్మకాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment