bar and restaurants
-
తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై బార్లలో క్వార్టర్, హాఫ్ కూడా!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సంక్షోభ పరిస్థితుల తర్వాత మనుగడ సాగించలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రంలోని 1,172 బార్లకు ఆర్థిక ఆసరా కలిగేలా ఎక్సైజ్ శాఖ నిబంధనలను సవరించింది. లైసెన్సింగ్ విధానాన్ని సరళతరం చేయడంతోపాటు బ్యాంకు గ్యారెంటీల తగ్గింపు, లైసెన్స్ ఫీజు చెల్లింపులో ఉదారత, కమీషన్ పెంపు లాంటి చర్యల ద్వారా ఆర్థికంగా బార్లను కుదుటపడేలా చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మార్పులతో కూడిన ఉత్తర్వులు నేడో, రేపో రానున్నాయి. ఆ బాటిళ్లు ఇస్తే ఎలా? ఇప్పటివరకు వైన్ షాపుల్లోనే క్వార్టర్, హాఫ్ బాటిళ్లు అందుబాటులో ఉండగా ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా ఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వడంపై వైన్‌షాప్ యజమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. క్వార్టర్, హాఫ్ బాటిళ్లు బార్ అండ్ రెస్టారెంట్లలో అమ్మితే తమ అమ్మకాలు కుంటుపడతాయని వారు చెబుతున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ మాత్రం ఇప్పటికే 2బీ (బార్ అండ్ రెస్టారెంట్) లైసెన్సుల కింద స్టార్ హోటళ్లలో క్వార్టర్లు, హాఫ్‌లు అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు సాధారణ బార్ అండ్ రెస్టారెంట్లకూ దీన్ని వర్తింపజేస్తున్నామని చెబుతోంది. ఇలా చేయడం ద్వారా వినియోగదారుడికి తాను తీసుకొనే మద్యం బ్రాండ్లపై నమ్మకం ఉంటుందని, స్టాక్ సమస్య రాదని, తయారీదారుడికి సైతం వెసులుబాటు ఉంటుందని అంటోంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనలు ► క్వార్టర్, హాఫ్ బాటిళ్లు ఉండేవి కావు. ఫుల్‌బాటిళ్ల ద్వారానే విక్రయాలు. ► మూడు వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లింపునకు అవకాశం. ► బ్యాంకు గ్యారెంటీ కింద సగం లైసెన్స్ ఫీజు చూపాలి. ► లైసెన్స్ ఫీజుతో పోలిస్తే ఐదు రెట్ల విలువైన మద్యం అమ్మే వరకు బార్ యజమానులకు 20% కమీషన్. ఆ తర్వాత అమ్మే మద్యం విలువలో 13.6% ప్రభుత్వానికి, 6.4% బార్ యజమానులకు కమీషన్. ► ఏటా అన్ని డాక్యుమెంట్లూ సమర్పిస్తేనే లైసెన్స్ రెన్యూవల్. నిబంధనల్లో రానున్న మార్పులు ► బార్లలోనూ క్వార్టర్, హాఫ్ బాటిళ్లు అందుబాటులోకి. ► లైసెన్స్ ఫీజు 4 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు. ► 25% లైసెన్స్ ఫీజును బ్యాంక్ గ్యారెంటీగా చూపితే సరిపోనుంది. ► లైసెన్స్ ఫీజు కంటే ఏడు రెట్లు మద్యం విక్రయాల వరకు 20 శాతం కమీషన్. ప్రభుత్వానికి 10 శాతం , మరో 10 శాతం బార్ యజమానులకు కమీషన్. ► రెస్టారెంట్ లైసెన్స్ చూపించి ఫీజు కడితే లైసెన్స్ ఆటో రెన్యూవల్. చదవండి: రెండ్రోజులపాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్‌లో భగభగ -
Telangana: న్యూ ఇయర్ వేడుకలు.. మందుబాబులకు గుడ్ న్యూస్
హైదరాబాద్: కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు ఈసారి పూర్తిస్థాయిలో జరగనున్నాయి. న్యూ ఇయర్‌ను వెల్కం చెప్పేందుకు యువత జోరుగా హుషారుగా రెడీ అవుతోంది. వీరి ఆసక్తిని రెట్టింపు చేసేందుకు నగరం నలు చెరగులా వేదికలు, వేడుకలు స్వాగతం పలుకుతున్నాయి. ఈసారి వేడుకలు వారాంతపు రోజైన శనివారం రావడంతో మరింత జోష్ ఏర్పడింది. తాజాగా న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్‌శాఖ అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు రాత్రి ఒంటిగంట వరకు.. రిటైల్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండనున్నాయి. మరోవైపు న్యూయిర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిబంధనలు విధించారు. త్రీ స్టార్, ఆపై హోటల్స్, పబ్బులు, క్లబ్బుల వద్ద ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసభ్యకర నృత్యాలు, న్యూసెన్స్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని షరతు విధించారు. పరిమితికి మించి పాస్‌లు, టికెట్లు జారీ చేయొద్దని పేర్కొన్నారు.. పబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని తెలిపారు. చదవండి: తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్.. గతేడాదితో పోలిస్తే.. -
జూబ్లీహిల్స్‌వాసులకు నిద్రలేని రాత్రులు.. స్థానికుల ఆందోళన
అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు.. అడ్డదారుల్లో జీహెచ్ఎంసీ ఇచ్చిన ట్రేడ్ లైసెన్స్‌లు... క్షేత్ర స్థాయిలో తనిఖీలు లేకుండానే ఎక్సైజ్ జారీ చేసిన బార్ లైసెన్స్‌లు... ట్రాఫిక్ పోలీసుల ప్రమేయం లేకుండానే అక్రమ దారుల్లో అనుమతులు... ఇలా ఉంటుంది జూబ్లీహిల్స్‌లోని పలు కాలనీల్లో వెలసిన పబ్‌లు, కేఫేలు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణ. ఎన్ని ప్రమాదాలు జరిగినా.. ఎన్ని ఆందోళనలు చేసినా నిమ్మకునీరెత్తిన చందాన అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల పక్కనే నడుస్తున్న పబ్‌లతో స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. శబ్ధ కాలుష్యం ఏర్పడినప్పుడు, పరిమితికి మించి వేళల్లో నడుస్తున్నప్పుడు మాత్రమే లా అండ్ ఆర్డర్ పోలీసులు తనిఖీలు చేయాల్సి ఉండగా అన్నింటికీ పోలీసులనే బాధ్యులను చేస్తూ స్థానికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో అమ్ముడవ్వని ఇళ్లు 12 వేలు!) ► జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లోని టాట్ పబ్ ఎదుట స్థానికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. తమ ఇళ్ల మధ్యనే ఈ పబ్ నిర్వహణ రోజూ న్యూసెన్స్‌గా మారిందని ఆందోళన చేశారు. ► అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత కూడా పబ్‌లో మ్యూజిక్ సిస్టమ్ నడుస్తున్నదని యువతీయువకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వీరి ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటోందని ఆరోపించారు. (చదవండి: జూనియర్ ఆర్టిస్టుల దుర్మరణం.. వైరల్ అవుతున్న వీడియోలు) ► పబ్‌లో తాగిన మద్యం సీసాలను మత్తులో తమ ఇళ్లల్లోకి విసురుతున్నారని దుయ్యబట్టారు. ► ఈ పబ్ వల్ల స్థానికులకు కంటి మీద కునుకు ఉండటం లేదని గగ్గోలు పెట్టారు. ఎక్సైజ్ పోలీసులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా వారు పెడచెవిన పెడుతున్నారని భగ్గుమన్నారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు జోగుతున్నారని ఆరోపించారు. హైకోర్టులో పిటిషన్... ► జూబ్లీహిల్స్ కాలనీలో నివాసాల మధ్యనే పబ్‌లతో పాటు కాఫీ షాప్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు సమస్యాత్మకంగా మారాయని ఇళ్ల ముందే ఉమ్ముతున్నారని కొంత మంది వాంతులు చేసుకుంటున్నారని తమకు ఈ పబ్‌లతో నరకప్రాయంగా మారిందంటూ జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ (క్లీన్ అండ్ గ్రీన్) అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, అడవుల ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు నగర పోలీసులను ప్రతివాదులుగా చేర్చి అసోసియేషన్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. యథేచ్ఛగా అక్రమ పార్కింగ్లు... ► పబ్‌లు ఉన్న ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 36, రోడ్ నం. 45, రోడ్ నం. 1, రోడ్ నం. 10 ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్లన్నీ రాత్రి 8 మొదలు తెల్లవారుజామున 2 గంటల వరకు రోడ్డుకు రెండువైపులా పబ్‌లకు, క్లబ్‌లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు వచ్చే వారి వాహనాల అక్రమ పార్కింగ్‌లతో నిండిపోతున్నాయి. పట్టించుకోని జీహెచ్ఎంసీ... ► పార్కింగ్ లేకుండానే భవనాలు అక్రమ అంతస్తుల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. నెలకు లక్షలాది రూపాయలు అద్దె తీసుకుంటూ ఇంటి యజమమానులు పార్కింగ్ లేకుండానే అద్దెలకు ఇచ్చేశారు. ► జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు. ట్రేడ్ లైసెన్స్ అడ్డదారుల్లో మంజూరవుతున్నది. వీరి పాత్రపై మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు. జూబ్లీహిల్స్ కాలనీవాసులు కూడా జీహెచ్ఎంసీని పల్లెత్తు మాట అనడం లేదు. మొద్దు నిద్రలో ఎక్సైజ్... ► జూబ్లీహిల్స్ కాలనీలో ఇబ్బడిముబ్బడిగా ఇష్టారాజ్యంగా పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు కావడంలో జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీసుల నిర్వాకం చెప్పనలవి కాదు. నెలనెలా మామూళ్లు దండుకుంటున్న ఈ పోలీసులు ఇక్కడ ఏం జరుగుతున్నదో పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ► న్యూ ఇయర్ వచ్చిందంటే పాస్‌లు, మామూళ్లకు అలవాటు పడుతున్న ఎక్సైజ్ పోలీసులు ఇక్కడ అర్ధరాత్రి దాటినా లిక్కర్ కొనసాగుతుండటాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి రాత్రి పరిమితికి మించి నడిస్తే ఎక్సైజ్‌పోలీసులు ఆ పబ్‌ను సీజ్ చేయాల్సి ఉంటుంది. ► అక్రమంగారోడ్డు పక్కన పార్కింగ్ చేస్తే జీహెచ్ఎంసీ ఆ భవనాన్ని సీజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ తప్పులన్నీ ఎక్సైజ్, జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా స్థానికులు మాత్రం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులను లక్ష్యంగా చేసుకొని బద్నాం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ► జీహెచ్ఎంసీ, ఎక్సైజ్ పోలీసులు సమన్వయం.. చిత్తశుద్ధితో వ్యవహరించి అడ్డదారులు.. ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న పబ్‌లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మద్యం మత్తులో బార్లో యువకుల వీరంగం
సాక్షి, బంజారాహిల్స్: మద్యంమత్తులో బార్లో యువకులు వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని టెయిల్స్ ఓవర్ స్పిరిట్ పేరుతో బార్ అండ్ రెస్టారెంట్ కొనసాగుతుంది. సోమవారం సాయంత్రం వెంపటి ఈశ్వర్, షణ్ముక్, దినేష్ రాజ్, సన్నీ, రోనిత్ అనే యువకులు పార్టీకి వచ్చారు. ఇందులో భాగంగా కొన్ని పాటలు ప్లే చేయాలంటూ డీజేని కోరగా అప్పటికే వాటిని ప్లే చేశామని, మరోసారి వేయలేమంటూ చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. మాటామాటా పెరగడంతో డీజేపై ఆ యువకుల్లో ఒకరు చేయిచేసుకున్నారు. దీంతో బార్ సిబ్బంది, యువకులు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగడంతో బార్ యజమాని శ్రీనివాస్ చేతికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కాగా తమపై దాడికి పాల్పడడంతో పా టు గదిలో బంధించారంటూ బాధిత యువకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయ గా, బిల్లు చెల్లించకుండా బయటకు వెళ్లేందుకు ప్రయ త్నిస్తే తమపై దాడి చేశారంటూ బార్ మేనేజర్ శ్రీశై లం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేశారు. -
లైసెన్స్ ఫీజుపై సైలెన్స్!
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ తర్వాత బార్ అండ్ రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా బార్ల లైసెన్స్ ఫీజు విషయంలో మాత్రం పీటముడి ఇంకా విప్పలేదు. లాక్‌డౌన్‌తో ఆరు నెలలకు పైగా బార్లు మూసివేయాల్సి వచ్చిన నేపథ్యంలో ఆ కాలానికి లైసెన్సు ఫీజును ప్రభుత్వం మినహాయిస్తుందనే ఆశలో బార్ యాజమాన్యాలున్నాయి. అయితే ఫీజు చెల్లించే విషయంలో వెసులుబాటు కల్పించేంతవరకు నిబంధనలు అనుమతిస్తాయి కానీ, ఫీజు మినహాయింపునకు అవకాశం లేదని ఎక్సైజ్ వర్గాలు అంటున్నాయి. బార్ యజమానులు మాత్రం అసలే నష్టాల్లో ఉన్నామని, ఈ పరిస్థితుల్లో ఫీజు చెల్లించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేదంటే లైసెన్సులు అమ్ముకోవడం మినహా మరో మార్గం లేదని చెపుతున్నారు. వెసులుబాటు వరకు ఓకే ఎక్సైజ్ అధికారుల సమాచారం ప్రకారం లైసెన్సు ఫీజు చెల్లించే విషయంలో బార్ యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి, గత నెలలోనే ఫీజు చెల్లించి లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. కానీ, బార్లు మూసి ఉండటంతో అది సాధ్యపడలేదు. ఇప్పుడు మళ్లీ బార్లు నడుపుకునేందుకు అనుమతిచ్చిన నేపథ్యంలో కుదుటపడేంతవరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. మరో నెల రోజులపాటు లైసెన్సు ఫీజుపై ఒత్తిడి తేవద్దని ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వ వర్గాల నుంచి మౌఖిక ఉత్తర్వులు అందినట్టు తెలుస్తోంది. అదే విధంగా గతంలో మూడు వాయిదాల్లో వార్షిక లైసెన్సు ఫీజు చెల్లించే నిబంధనను కొంత మార్చి దాన్ని నాలుగు వాయిదాలకు పెంచాలని, వడ్డీ లేకుండానే ఫీజు కట్టేందుకు అనుమతివ్వాలని కూడా ప్రతిపాదనలు తయారు చేసినట్టు తెలుస్తోంది. అయితే, అసలు ఫీజు ఎప్పటివరకు, ఎంత కట్టాలన్న దానిపై ఎక్సైజ్ వర్గాల నుంచి స్పష్టత లేకపోవడంతో ఎప్పుడు మళ్లీ ఫీజు పిడుగు తమ నెత్తిపై పడుతుందనే ఆందోళన బార్ యాజమాన్యాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే నష్టపోయాం.. కరోనా లాక్డౌన్ కాలానికి ఫీజు మినహాయింపు అంశాన్ని బార్ యజమానుల అసోసియేషన్ రెండు నెలల ముందు నుంచే తెరపైకి తెచ్చింది. ఎక్సైజ్ ఉన్నతాధికారులతో పాటు ఆ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను పలుమార్లు అసోసియేషన్ నేతలు కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదు. అయితే, బార్లు తెరిచేందుకు అనుమతినిచ్చిన సమయంలోనే వైన్‌షాపుల పర్మిట్‌రూంలను మూసి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం ద్వారా కొంతమేర బార్లకు ఊరట కలిగించారు. కరోనా కారణంగా లక్షల్లో నష్టపోయామని, ఇప్పుడు మళ్లీ బార్లు తెరిచేందుకు అడ్వాన్సుల కింద పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నామని, మళ్లీ లైసెన్సు ఫీజు కట్టాలంటే తమ వల్ల కాదని బార్ యజమానులు అంటున్నారు. -
బార్.. పీటముడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ల వ్యవహారం పీటముడి పడినట్టు కనిపిస్తోంది. కరోనా లాక్డౌన్ సమయంలో మూసి వేసిన బార్లను 6 నెలలవు తున్నా తెరిచేందుకు అనుమతించకపోవడంతో లైసెన్స్ ఫీజులు కట్టేందుకు బార్ల యజమానులు విముఖత చూపుతున్నారు. లాక్డౌన్ పేరుతో మూసివేసిన కాలానికి తమకు లైసెన్సు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తు న్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న సమయంలోనే... లైసెన్స్ ఫీజు కట్టాల్సిన గడువు సమీపించడంతో అసలు సమస్య ఏర్పడింది. రాష్ట్రంలోని వెయ్యి బార్ల ప్రస్తుత లైసెన్స్ గడువు ఈ నెలాఖరు వరకు ఉన్నా... 15 రోజుల ముందుగానే ఫీజులు చెల్లించి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చిన అన్‌లాక్–4 మార్గదర్శకాల్లో బార్లను నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలోనే బార్లు తెరుస్తారని చర్చ జరిగింది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో అసలు బార్లు ఎప్పుడు తెరుస్తారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న యజమానులు లైసెన్స్ ఫీజులు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. లాక్డౌన్ కాలానికి లైసెన్స్ ఫీజు మినహాయించాలనే బార్ యాజమాన్యాల డిమాండ్‌పై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అసలు లైసెన్సు ఫీజులు కట్టాలా వద్దా అనే గందరగోళంలో పడ్డారు రాష్ట్రంలోని బార్ల యజమానులు. సీఎందే తుది నిర్ణయం నిబంధనల ప్రకారం చూసుకుంటే... లైసెన్స్ ఫీజు మినహాయింపు సాధ్యం కాదని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మరోవైపు నిర్దేశిత గడువు ముగిసేలోపు లైసెన్సు ఫీజులు చెల్లించని పక్షంలో... ఆయా లైసెన్సులు రద్దు చేయాలా లేదా కొనసాగించాలా? అనే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వారు చెపుతున్నారు. ఫీజు కట్టకపోతే ప్రస్తుతమున్న లైసెన్సు సందిగ్ధంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. కానీ బార్ యజమానులు మాత్రం అసలే నష్టాల్లో ఉన్న తమను కరోనా మరింత నష్టాల్లోకి నెట్టిందని, ఈ పరిస్థితుల్లో లక్షల రూపాయల లైసెన్సు ఫీజులు తాము చెల్లించలేమని అంటున్నారు. యాజమాన్యాల అసోసియేషన్ కూడా ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. లైసెన్స్ ఫీజు మినహాయింపులో కానీ, బార్లు తెరిచే విషయంలో కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ బార్ల యజమానుల్లోనూ, ఎక్సైజ్ వర్గాల్లోనూ కనిపిస్తోంది. మరి, ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడు, ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే...! -
బార్ల యజమానుల బరితెగింపు
సాక్షి, నెల్లూరు: బార్ల యజమానులు బరితెగిస్తున్నారు. ఓ వైపు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తే..మరో వైపు లాక్డౌన్ చాటున అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. కరోనా మహమ్మరితో యావత్ ప్రపంచం వణికిపోతోంది. మన దేశంలో సైతం కరోనా విజృంభిస్తుండడంతో సామూహిక కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. జిల్లాలో 144 సెక్షన్‌ను అమలు చేస్తూ కేవలం నిత్యావసర సరుకులు మాత్రమే అందుబాటులో ఉంచి కఠిన ఆంక్షలతో బయట ఎవరూ తిరగకుండా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. అందులో భాగంగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ నగరంలోని బార్ల యజమానులు కరోనా కట్టడిని కూడా క్యాష్ చేసుకుంటున్నారు. బార్లకు సీల్ వేసినా దొంగచాటుగా విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 280 మద్యం దుకాణాలు, 46 బార్లు ఉన్నాయి. నగరంలో 31 వరకు బార్లు ఉన్నాయి. కరోనా కట్టడి కోసం ఈ నెల 31 వరకు మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపి వేశారు. మద్యం దుకాణాలు, బార్లకు సీల్ వేశారు. నగరంలోని కొందరు బార్ల యజమానులు ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నారన్న విషయం ముందుగానే పసిగట్టి మద్యం కేసులు రహస్య ప్రాంతాలకు తరలించారు. బార్ల ముందు వైపు సీల్ ఉన్నా వెనుక వైపు రహస్య ద్వారం నుంచి కేసులు బయటకు తెప్పించి మద్యం విక్రయాలు చేయిస్తున్నారు. మూడ్రోజుల క్రితం నగరంలోని లీలామహల్ సెంటర్లోని ఓ బార్‌ను నిబంధనలను అతిక్రమించి పబ్లిక్‌గానే ఓపెన్ చేసి మద్యం విక్రయాలు జరిపారు. కర్ఫ్యూ అమలవుతున్న సమయంలో బార్లో మద్యం విక్రయాలు చేయడాన్ని జిల్లా కలెక్టర్ సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అయ్యప్పగుడి, విజయమహాల్ గేట్, పత్తేఖాన్‌పేట, పొదలకూరు రోడ్ పరిసర ప్రాంతాల్లో మద్యాన్ని దొంగచాటుగా విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మార్పీ కంటే అధికం నగరంలో బార్ యజమానులు దొంగచాటుగా మద్యం విక్రయాలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. పుల్ బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే మూడింతలు అధిక రేట్లకు విక్రయాలు చేస్తున్నారు. మ్యాన్సన్ హౌస్ పుల్ బాటిల్ రూ.3500, బ్లాక్ క్యాట్ పుల్‌బాటిల్ రూ.6000..ఇలా ఎమ్మార్పీ కంటే మూడింతలు రేట్లు పెంచి విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. మద్యం ప్రియులు అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్‌ను బట్టి రేట్లు పెంచుతూ బార్ యజమానులు జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బార్లపై నిఘా ఉంచాం నగరంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లకు సీల్ వేశాం. దొంగచాటుగా అమ్మకాలు మా దృష్టికి రాలేదు. మూడ్రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తుండగా ఓ బార్‌ను సీజ్ చేశాం. ప్రతి బార్ వద్ద ఎక్సైజ్ సిబ్బందితో నిఘా పెట్టాం.– రత్నం, సీఐ, ఎక్సైజ్ శాఖ, నెల్లూరు -
చూసీ చూడనట్టు వదిలేశారు!
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలోని 83 బార్ అండ్ రెస్టారెంట్లపై సోమవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు 19 బృందాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని టీడీపీ నాయకుడికి చెందిన ఓ బార్లో ఫుల్ బాటిల్‌ను బయటికి పార్సిల్ చేసినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం బార్లలో మద్యాన్ని బయటికి విక్రయించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని బయటికి విక్రయించినట్లైతే సదరు బార్‌పై కేసు నమోదు చేసి లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. టీడీపీ నాయకుడి బార్లో ఫుల్ బాటిల్ మందు బయటకు విక్రయించినట్లు అధికారులు గుర్తించడంతో వెంటనే ఆయన జిల్లాకు చెందిన ఎక్సైజ్ ఉన్నతాధికారిని సంప్రదించినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో పాల్గొన్న ఎక్సైజ్ సీఐకు జిల్లా ఉన్నతాధికారి ఫోన్ చేసి బార్ యజమానికి తనకు కావాల్సిన వాడని చూసి చూడనట్లు వదిలేయమని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. బాస్ చెప్పడంతో సదరు టీడీపీ నాయకుడి బార్‌పై పార్సిల్ కేసు నమోదు చేయకుండా టెక్నికల్ కేసు నమోదు చేసి వదిలేసినట్లు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్లపై 7 కేసులు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా డెప్యూటీ డైరెక్టర్(ఎఫ్ఏసీ) డాక్టర్ కె. శ్రీనివాస్ తెలిపారు. -
హిమగిరి బార్ నిర్వాహకులపై కేసు
అనంతపురం, తాడిపత్రి: మద్యం అమ్మకాలకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడంతో తాడిపత్రిలోని హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులపై ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ‘మద్యం చీప్’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎక్సైజ్ సూపరిండెంట్ నారాయణస్వామి, స్థానిక ఎక్సైజ్ సీఐ దశరథరామిరెడ్డి సిబ్బందితో కలిసి హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్లను మంగళవారం తనిఖీ చేశారు. ఇక్కడ ఎక్కువ శాతం చీప్ లిక్కర్ విక్రయిస్తున్నట్లు తేలినట్లు తెలిసింది. 6బీ, 7బీ రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ముందే జాగ్రత్త పడ్డ నిర్వాహకులు? సాక్షిలో వచ్చిన కథనంతో ముందే జాగ్రత్త పడ్డ నిర్వాహకులు ఉదయమే రెస్టారెంట్లో ఉన్న నకిలీ మద్యాన్ని తరలించినట్లు తెలిసింది. భారీగా నకిలీ మద్యం నిల్వ ఉండడంతో ఎక్సైజ్ అధికారులు వచ్చి ఎక్కడ తనిఖీ చేస్తారో అని ముందు జాగ్రత్తగా ‘తగ్గింపు ధరకే మద్యం విక్రయాలు’ అని బార్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించడమే కాకుండా బార్లో ఉన్న నకిలీ మద్యాన్ని మరోచోటుకు తరలించేసినట్లు సమాచారం. ఇన్నేళ్లుగా హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్లో ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నా స్థానిక ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేయడం విశేషం. -
వీళ్లు మామూలోళ్లు కాదు
సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : రాష్ట్రంలో మద్యనిషేధం దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడంతో పాటు దుకాణాల సంఖ్యను కూడా తగ్గించింది. ఇది కొందరు ఎక్సైజ్ అధికారులకు మింగుడు పడటం లేదు. గతంలో మద్యం దుకాణాలు, బార్ల నుంచి లక్షల్లో మామూళ్లు వీరికి అందేవి. ప్రస్తుతం మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండటంతో వీరి ఆదాయానికి భారీగానే గండిపడింది. బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తుండటంతో వీరిని మామూళ్ల కోసం పట్టిపీడిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో 20 బార్లు జిల్లాలో గతంలో 437 బ్రాందీ షాపులు, 20 బార్లు ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకారం 90 షా పులను తగ్గించి 347 షాపులను ఏర్పాటుచేసింది. 20 బార్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మామూళ్ల మత్తులో ఉన్న ఎక్సైజ్ అధికారుల చూపు బార్ అండ్ రెస్టారెంట్ యజమానులపై పడింది. జిల్లాలోని 20 బార్ అండ్ రెస్టారెంట్ యాజమానుల నుంచి నెలకు బార్ ఒక్కింటికీ రూ.30 వేల చొప్పున వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై బార్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రైవేట్ బ్రాందీ షాపులు ఉండటం వలన బార్ల నుంచి మామూళ్లు ఎంతిస్తే అంతే తీసుకునేవారమని, ప్రస్తు తం ప్రభుత్వమే బ్రాందీ షాపులు నిర్వహించడం వలన ఎౖMð్సజ్ స్టేషన్‌కి ఆదాయం లేదని అధికారులు అంటున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌కు ఆదాయం లేదనే సాకుతో ఒక్కో బార్ యజమాని నుంచి రూ.30 వేలు దండుకుంటున్నట్టు చెబుతున్నారు. సొమ్ములు ముట్టజెప్పకపోతే కేసుల పేరుతో వేధిస్తున్నారని అంటున్నారు. ప్రైవే ట్ యజమానుల చేతుల్లో బార్ అండ్ రెస్టారెంట్లు ఉండటంతో కొందరు ఎక్సైజ్ అధికారులు మామూళ్ల కోసం ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. బెడద తగ్గలేదు జిల్లాలో గతంలో బ్రాందీషాపులు, బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల నుంచి ఎక్సై జ్ అధికారులు ప్రతి నెలా లక్షలాది రూపాయలు మామూళ్లు కింద వసూలు చేసేవారు. ప్రస్తుతం ప్రభుత్వమే మద్యం షాపులు ఏర్పాటు చేయడంతో కొందరు ఎౖMð్సజ్ అధికారులు బార్ యజమానులపై పడుతున్నారు. నెలకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. – ఆర్.వెంకటపతి, బార్ అండ్ రెస్టారెంట్ యజమాని, ఏలూరు -
నిలువు దోపిడీ!
దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో మద్యం అమ్మకాలు తగ్గడంతో రెస్టారెంట్స్ అండ్ బార్లకు వరంగా మారింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బార్ల యజమానులు నిబంధనలు తుంగల్లో తొక్కి దోపిడీకి తెరతీశారు. సాక్షి, విజయనగరం : నవరత్నాల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు నెలల పాలనలోనే దశలవారీ మద్య నిషేధానికి తెరతీశారు. జిల్లాలో విచ్చలవిడిగా ఉన్న బెల్టు దుకాణాలపై ఉక్కుపాదం మోపడంతో బెల్టు దుకాణాలు మూతపడ్డాయి. ప్రైవేటు మద్యం వ్యాపారుల చేతిలో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. నూతన మద్యం విధానంతో జిల్లాలో 210 మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించి 168కి పరిమితం చేశారు. దీంతో పాటు గతంలో ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు సాగించి రెండు చేతులా సంపాదించేవారు. మద్యం అమ్మకాలు నియంత్రించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాల నిర్వహణ మూడు గంటల సమయం తగ్గించారు. దీంతో రెస్టారెంట్ అండ్ బార్లుకు వరంగా మారింది. దీంతో నూతన మద్యం విధానం అమలుకాక ముందు రోజుకు ఒక్కో బార్లలో రూ.2 లక్షల వరకు విక్రయాలు జరిగితే ప్రస్తుతం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయాలు పెరగడం విశేషం. మందుబాబులకు ధరల ‘కిక్కు’ నూతన మద్యం విధానంతో జిల్లాలో మద్యం దుకాణాలు తగ్గడమే కాకుండా సమయానికే మూతపడటంతో మందుబాబులకు మద్యం దొరకడం కష్టమవుతుంది. దీంతోపాటు గతం లో మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్‌లు ఉండటంతో మందుబాబులు అక్కడే మద్యం కొనుగోలు చేసి పర్మిట్ రూమ్‌ల్లో తాఫీగా తాగి వెళ్లేవారు. ప్రస్తుతం పర్మిట్ రూమ్‌లు తొలగించడంతో మందుబాబులకు తాగేందుకు స్థలం లేక బార్లను ఆశ్రయిస్తున్నారు. ఒకరికి మూడు బాటిళ్లు కంటే ఎక్కువ అమ్మకాలు చేయడంగాని, తీసుకువెళ్లడం చేయరాదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో జిల్లాలోని 28 బార్ అండ్ రెస్టారెంట్లు మందుబాబులకు అనుకూలంగా మారాయి. దీంతో బార్ల యజమానులు దోపిడీకి తెరలేపేశారు. ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న బార్లు రాత్రి 1 గంట వరకు కొనసాగుతున్నాయి. రాత్రి 11 గంటలకే అమ్మకాలు బంద్ చేయాల్సిన బార్ల యజమానులు 12 వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఎంఆర్పీపై ప్రభుత్వం పెంచిన ధరను కలిపి విక్రయించాల్సిన మద్యాన్ని విడి విక్రయాలు, మద్యం కల్తీతో పాటు అదనంగా ధర పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా సర్వీసు ట్యాక్స్ పేరిట బార్ల యజమానులు మందుబాబులకు షాకిస్తున్నారు. దీంతో బార్లకు వచ్చిన మందుబాబులకు ధరల బాదుడు చూసి కిక్కు దిగిపోతుంది. నిబంధనలు బేఖాతరు వాస్తవంగా బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలతో పాటు మందుబాబులకు తిండి లభ్యమవుతుంది. తిండి పదార్థాలు వండడానికి అన్ని సౌకర్యాలు బార్లలో ఉండాల్సిందే. జిల్లాలో 80 శాతానికి పైగా బార్లలో వంట చేయడానికి కావాల్సిన సౌకర్యాలు లేవు. అనేక బార్లలో బయట తిండి తెచ్చి విక్రయాలు సాగిస్తున్నారు. పర్యవేక్షణేది? నిబంధనలు అతిక్రమిస్తున్న బార్లపై గట్టి నిఘా, పర్యవేక్షించాల్సిన ఎక్సైజ్ అధికారులు బార్ల యజమానులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో పర్యవేక్షణ గాలికొదిలేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 80 శాతం పైగా బార్లలో నిబంధనలు అమలుకాకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
బార్లలో మహిళా డ్యాన్సర్లు, సప్లయర్లు..
కర్ణాటక, బనశంకరి: ఉద్యాన నగరిలో నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న మూడు బార్ అండ్ రెస్టారెంట్లపై ఆదివారం రాత్రి సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు దాడిచేసి 100 మందికిపైగా యువతులను కాపాడి, సిబ్బందిని అరెస్ట్ చేశారు. అశోకనగరలోని రెసిడెన్సీరోడ్డులో గల పేజ్ త్రీ బార్‌పై దాడిచేసిన సీసీబీ పోలీసులు 17 మంది సిబ్బందిని అరెస్ట్ చేసి 67 మంది యువతులను కాపాడారు. యువతులందరూ బార్లో డ్యాన్సర్లుగా, సప్లయర్లుగా పనిచేసేవారు. బార్లో ఉన్న 27 మంది కస్టమర్లను పంపించేశారు. పరారీలో ఉన్న యజమాని సంతోష్, రాజు కోసం గాలిస్తున్నామని డీసీపీ చేతన్‌సింగ్ తెలిపారు. టైమ్స్ బార్‌పై దాడిచేసిన పోలీసులు 27 మంది యువతులను కాపాడి 16 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న యజమాని మహేశ్, పాయల్ కోసం గాలిస్తున్నారు. కబ్బన్‌పార్కు సమీపంలోని డయట్ బార్‌పై దాడిచేసిన పోలీసులు ముగ్గురు సిబ్బందిని అరెస్ట్ చేసి 15 మంది మహిళా ఉద్యోగుల్ని కాపాడారు. మూడు బార్లలోనూ పెద్ద శబ్ధంతో మ్యూజిక్ పెట్టడం, ఎక్సైజ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిసిందని డీసీపీ చేతన్‌సింగ్ తెలిపారు. అశోక్‌నగర, కబ్బన్ పార్కు పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. -
రాత్రి తెల్లవార్లూ.. బార్లా!
బీచ్‌రోడ్డు.. అందాల విశాఖ సుందరి మెడలో అపురూపమైన నగలా భాసిల్లుతున్న ఈ ప్రాంతం విశాఖవాసుల ఆహ్లాదానికి ఆటపట్టు.. పర్యాటకులకు స్వర్గధామం..పగలంతా సముద్ర కెరటాల హోరు.. పర్యాటకుల సందడి కనిపించే బీచ్‌రోడ్డు సాయంత్రమైతే చాలు.. రూపం మార్చుకుంటుంది.. వేల సంఖ్యలో సందర్శకులతో కిటకిటలాడుతుంది. విద్యుత్ వెలుగులతో ధగధగలాడుతుంది.చిన్నారులు, యువత కేరింతలు, తుళ్లింతలుసముద్రుని హోరును సవాల్ చేస్తాయి..ఆ హోరు.. ఆ జోరు.. ఆ హుషారును ఆదాయ మార్గంగా మలచుకొని కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నాయి..అయితే.. సందట్లో సడేమియా అన్నట్లు.. వ్యాపారాల ముసుగులో కొందరు అక్రమ దందాలకు పాల్పడుతున్నారు.. ముఖ్యంగా తినుబండాలు, ఆహార పదార్థాలు మాత్రమే అమ్మే రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల పేరుతో లైసెన్సు తీసుకొని నడుపుతున్నవారు.. రాత్రి పొద్దుపోయాక బోర్డు తిప్పేస్తున్నారు.ఫలితం.. హోటళ్లు కాస్త బార్లుగా మారిపోతున్నాయి. కొన్ని బెల్టుషాపుల స్థాయికి కూడా దిగజారిపోతున్నాయి. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో లక్షలు ఆర్జిస్తున్నాయి.బీచ్‌రోడ్డులో నిరంతరం పోలీస్ గస్తీ ఉంటుంది.. అయినా ఈ అక్రమ వ్యాపారాలు వారి కళ్లకు కనపడవు. కారణం.. వేలల్లో అందే మూమూళ్లే..బార్లు, రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసివేయాలి.. కానీ అప్పటి నుంచే ఈ అక్రమ వ్యాపారాలు రెక్కలు విచ్చుకోవడం కొసమెరుపు సాక్షి, విశాఖపట్నం: ఉదయం నుంచి రాత్రి వరకు అవన్నీ సాధారణ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లే.. కానీ రాత్రి 10 గంటలు దాటితే చాలు.. బార్లుగా మారిపోతాయి. బీచ్‌రోడ్డును మద్యంలో ముంచెత్తుతాయి. మద్యం మత్తు మరిగిన యువజనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతాయి. ఈ రోడ్డులోని కోస్టల్ బ్యాటరీ నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు పలు స్టార్ హోటళ్లతోపాటు సాధారణ హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. స్టార్ హోటళ్లు ముందుగానే అనమతులు తీసుకొని లోపల ప్రత్యేకం బార్లు నిర్వహిస్తుంటాయి. వాటి సంగతి పక్కన పెడితే.. ఆహార పదార్థాల విక్రయానికి మాత్రమే అనుమతులుండే చాలా రెస్టారెంట్ల నిర్వాహకులు రాత్రి పొద్దుపోయిన తర్వాత వాటిని బార్లుగా మార్చేస్తున్నారు. అధిక రేట్లకు మద్యం విక్రయాలు జరుపుతున్నారు. రాత్రివేళల్లో మద్యానికి బానిసలైనవారు, జల్సాలకు అలవాటు పడిన యువత వీటి వద్దకు చేరుకొని నానా హంగామా చేస్తుంటారు. చాలామంది బీచ్‌లోకి మద్యం బాటిళ్లతో వెళ్లి పూటిగా తాగి ఖాళీ సీసాలను అక్కడే పారేస్తుంటారు. రాత్రి 11 దాటితే నిషేధం ఎక్కడ? నగరంలో రాత్రి 11 గంటలకు బార్లతో సహా సాధారణ రెస్టారెంట్లను మూసివేయాలని నిబంధనలు ఉన్నాయి. కానీ బీచ్‌రోడ్డును ఆనుకొని ఉన్న సాగరంలో అవన్నీ కలిసిపోతున్నాయి. ఉదయం నుంచీ బిర్యానీలు, ఇతర ఆహార పదార్థాలతో కాలక్షేపం చేసే చాలా రెస్టారెంట్ల నిర్వాహకులు రాత్రి పొద్దుపోయాక అసలు వ్యాపారానికి తెర తీస్తారు. రాత్రి తెల్లవార్లూ విచ్చలవిడి అమ్మకాలతో లక్షల ఆదాయం వెనకేసుకుంటారు. బీచ్‌రోడ్డు పొడవునా సివిల్తోపాటు మెరైన్ పోలీసుల గస్తీ ఉంటుంది. కానీ వారెవరూ అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న వాటివైపు కన్నెత్తి చూడరు. లక్షల్లో ఆర్జిస్తున్న హోటళ్ల నిర్వాహకులు పోలీసు అధికారులను వేలల్లో ముట్టజెపుతూ.. వారు తమవైపు చూడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ ధీమాతో మరింత రెచ్చిపోయి.. అమ్మకాలు సాగిస్తున్నారు. ఫలితంగా యువత, వ్యసనపరులు మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా చిందులేస్తుంటే.. మామూళ్ల మత్తులో పోలీసులు వాటిని చూసి ఆనందిస్తున్నట్లుగా పరిస్థితి తయారైంది. నగరవాసుల ఆందోళన ఇప్పటికే నగరంలో ప్రశాంతత నానాటికీ చెదిరిపోతోంది. ఒకప్పుడు విశాఖ నగరం.. ప్రత్యేకించి బీచ్‌రోడ్డు ప్రశాంతతకు మారుపేరు. పర్యాటకులు సంగతి పక్కన పెడితే.. సాయంత్రమేతే చాలు వేల సంఖ్యలో నగరవాసులు బీచ్‌రోడ్డుకు కుటుంబ సమేతంగా చేరుకొని కొన్ని గంటలపాటు అక్కడ షికార్లు చేసి సేదదీరుతుంటారు. మరోవైపు బీచ్‌రోడ్డు పొడవునా పెద్ద సంఖ్యలో నిర్మించిన అపార్ట్మెంట్లు, కాలనీల్లో వేల సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా నిత్యం బీచ్‌రోడ్డు మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవలి పరిణామాలు వీరందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్నగాక మొన్న రాజకీయ ప్రముఖల విందువిలాసాల కోసం నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపింది. మరోవైపు డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది. వీటికి తోడు బీచ్‌రోడ్డు పొడవునా రాత్రితెలవార్లూ నిర్వహిస్తున్న అనధికార బార్ల కారణంగా పరిస్థితి మరింత దిగజారిపోతోంది. రాత్రి వేళల్లో తాగి తందనాలాడే వారి చేష్టలతో ఆ రోడ్డులో తిరిగేందుకే సమీప ప్రాంతాల నివాసులు భయపడే పరిస్థితి నెలకొంది. ఇంతకుముందు బీచ్‌లో ఆడుకునేందుకు తమ పిల్లలను స్వేచ్ఛగా పంపించే తల్లిదండ్రులు ఇప్పుడు అలా పంపేందుకు జంకుతున్నారు. ఇటువంటి అనైతిక చర్యలను, అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు రెస్టారెంట్ల వారి నుంచి మామూళ్లు అందుకుంటూ మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపిస్తున్నారు. -
అర్ధరాత్రి బార్లో రచ్చ
తాడేపల్లి రూరల్: మంగళగిరి పట్టణ పరిధిలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బార్ అండ్ రెస్టారెంట్లు తెరిచి ఉండడం, వాటిలో టీడీపీ నేతలు కూర్చొని సెటిల్మెంట్లకు పాల్పడడం తరచూ జరుగుతున్న సంఘటనలు. రెండురోజుల కిందట మంగళగిరి మున్సిపాలిటీ షాడో చైర్మన్ ఓ బార్ అండ్ రెస్టారెంట్లో సెటిల్మెంట్లు చేస్తుండగా పక్కనే మందు తాగుతున్న వారు పెద్దగా మాట్లాడడంతో ఆయనకు కోపం వచ్చి వారిపై దాడికి పాల్పడ్డాడు. అవతలివారు కూడా మందు బిగించి ఉండడంతో గొడవ కాస్తా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. దీంతో టీడీపీ నేతలు తమ బలాన్ని ఉపయోగించి వారిని చితకబాదారు. గాయపడ్డ యువకులు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడం, ఓ ముఖ్య నాయకుడు క్షణాల్లో అక్కడకు చేరి పోలీసు ఉన్నత వర్గాలతో ఫోన్లో మాట్లాడి కేసు నమోదు చేయకుండా చేశాడు. దీంతో తన్నులు తిన్న యువకులను బెదిరించడంతో పోలీసులు సైతం ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. షాడో చైర్మన్ లీలలు మంగళగిరి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అయినప్పటికీ, అదే పార్టీలో చైర్మన్ సతీమణి వర్గానికి చెందిన ముఖ్య నాయకుడు మున్సిపాలిటీ పాలనలో చక్రం తిప్పుతున్నాడు. టెండర్ల నుంచి సెటిల్మెంట్ల వరకు స్వయంగా చూసుకుంటూ తనదైన శైలిలో కాంట్రాక్టర్లను, అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అందినకాడికి దోచుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి మున్సిపాలిటీకి చెందిన ఓ లాండ్ సెటిల్మెంట్కు సంబంధించి బార్లో మాట్లాడుతుండగా, పక్క టేబుల్‌పై టాటా స్కైలో ఉద్యోగం చేస్తున్న చిరుద్యోగులు నలుగురు మద్యం తాగుతున్నారు. వీరు కంపెనీ విషయాలపై చర్చించుకుంటూ పెద్దపెద్దగా మాట్లాడడంతో, సదరు నేతకు కోపం వచ్చింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచి యువకులపై చేయి చేసుకున్నాడు. వారు కూడా ఎవరో తెలియక, లాగి గూబమీద కొట్టడంతో తట్టుకోలేని సదరు నాయకుడు ఫోన్లో తన అనుచరులను పిలిపించి, దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఈ గొడవలో ఓ యువకుడికి తలకు బీరు బాటిల్ తగలడంతో ఎనిమిది కుట్లు పడ్డాయి. మరో యువకుడికి ఛాతీపై బీరు బాటిల్ కోసుకుపోవడంతో రెండు కుట్లు పడ్డాయి. మిగతా ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన యువకులు మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు రాగా, పోలీసులు తమదైన శైలిలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఫిర్యాదు ఇస్తున్నా కూడా పట్టించుకోకుండా అందులో ఓ యువకుడిని సెల్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నించారు. వాస్తవానికి దెబ్బలు తగిలినవారిని ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా, వారిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో యువకులు బెదిరిపోయి పోలీస్‌స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. -
ఎనీ టైం.. మందు ఫుల్!
సిటీలో మద్యం విక్రయాలకు వేళాపాళా లేకుండా పోయింది. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి...తెల్లవారుజాము వరకు ఎనీటైం యథేచ్ఛగా మద్యం దొరుకుతోంది. తాగి ఊగే మందుబాబులకు ప్రధాన వీధుల్లో ఉన్న వైన్ షాపులు, బార్లు అడ్డాగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకే లిక్కర్ అమ్ముతున్నారు. వాస్తవంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం షాపులకు అనుమతి ఉంది. కానీ చాలా చోట్ల రెండు గంటల ముందే తెరవడం..అర్ధరాత్రి దాటాక మూసివేయడం చేస్తున్నారు. నిబంధనలు పాటించని, షాపులపై కొరడా ఝళిపించాల్సి ఉన్నా...అలాంటి దాఖలాలు లేవు. మంగళవారం సాక్షి క్షేత్రస్థాయిలో వైన్ షాపులు, బార్ల వద్ద పరిస్థితులను పరిశీలించగా ఈవిషయాలు వెల్లడయ్యాయి. సాక్షి, సిటీబ్యూరో/సాక్షి నెట్వర్క్: గ్రేటర్లో వేళాపాళా లేకుండా తాగుతూ.. ఊగుతున్న మందుబాబులకు ప్రధాన వీధుల్లో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు అడ్డాలుగా మారుతున్నాయి. ప్రధాన రహదారులు, సమీప కాలనీలు, బస్తీల్లో మందుబాబుల ఆగడాలు శృతిమించుతుండడంతో మహిళలు, విద్యార్థినులు, పాదచారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు) సుమారు 400 మద్యం దుకాణాలు, 500 బార్లు ఉన్నాయి. ఏటా సుమారు రూ.2 వేల కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. యేటికేడాది వీటి విలువ 15–20 శాతం పెరుగుతోంది. ఆబ్కారీ శాఖ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు. బార్లను ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. అయితే పలు మద్యం దుకాణాలు ఉదయం 9 గంటలకు తెరుచుకోవడంతో పాటు రాత్రి 1 గంట వరకు అమ్మకాలు జరుగుతున్నాట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ప్రధాన శివార్లలో ఇదే పరిస్థితి నెలకొంది. బార్లు అర్ధరాత్రి 2 గంటల వరకు తెరచి ఉండటం గమనార్హం. అయితే ఆబ్కారీ శాఖ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.మందుబాబుల ఆగడాలు శృతి మించినపుడు స్థానికులు ఫిర్యాదు ఇచ్చినపుడే ఆబ్కారీ, పోలీసుల విభాగాలు హడావుడి చేస్తున్నాయి. అరకొర జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు.ఎక్కడా లైసెన్సులు రద్దు చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. సమయపాలన, పార్కింగ్, పర్మిట్ రూమ్‌ల నిబంధనలు పాటించని దుకాణాలు, బార్లపై చర్యలు లేకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన అంశాలివీ... ఎల్బీనగర్, మలక్‌పేట్ నియోజకవర్గాల పరిధిలో.. దిల్సుఖ్నగర్ నుంచి చాదర్‌ఘాట్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న వైన్‌షాపులు, బార్ల యజమానులు నియమ, నిబంధనలను ఖాతరు చేయడం లేదు. పలుదుకాణాలను ఉదయం 9 గంటలకే తెరుస్తుండడం గమనార్హం. దిల్సుఖ్నగర్ బస్‌డిపో సమీపంలోని వైన్‌షాప్ ఉదయం 9 గంటలకే తెరుచుకోగా. మలక్‌పేట్ యశోద ఆస్పత్రి పక్కన ఉన్న వైన్‌షాపు 9.30 గంటలకు తెరిచి యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారు. కొన్ని వైన్‌షాపుల యజమానులు షాపుల వెనుక వైపు నుంచి ఉదయం 8 గంటల నుంచే మద్యం విక్రయాలు జరుపుతున్నారు. మైనర్లకు సైతం మద్యం విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. దిల్సుఖ్నగర్ బస్టాప్ సమీపంలో దేవాలయానికి ఆనుకునే మద్యం దుకాణం ఏర్పాటు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.కొన్ని మద్యం షాపుల యజమానులు సర్వీస్ రోడ్లపైనే పార్కింగ్‌ను ఏర్పాటు చేసి బహిరంగంగా మద్యం విక్రయిస్తున్నారు. కుత్బుల్లాపూర్‌లో... నియోజకవర్ పరిధిలో మందుబాబుల ఆగడాలకు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. కుత్బుల్లాపూర్ పరిధిలో పలు వైన్ షాపులు నిబంధనలను పట్టించుకోవడం లేదు.మద్యం దుకాణాలకు ఆనుకొని ఉన్న పర్మిట్ రూమ్‌లను నిబంధనలకు విరుద్ధంగా సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసి మందుబాబులకు అడ్డాగా తీర్చిదిద్దుతున్నారు. పలు దుకాణాల వద్ద మైనర్లే పనులు చేస్తూ కనిపించారు. సుచిత్రా నుంచి కొంపల్లి రూట్లో మద్యం షాపుల వద్ద అక్రమ పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చింతల్, కుత్బుల్లాపూర్ గ్రామం సర్కిల్ కార్యాలయం రోడ్డు, గాజులరామారం రోడ్డులోని వైన్స్ వద్ద నడి రోడ్డుపైనే మందుబాబులు మద్యం సేవిస్తూ కనిపిస్తున్నారు. నాంపల్లి.. ఆబిడ్స్‌లో.. సమయ పాలన పాటించకుండా తమ ఇష్టానుసారంగా మద్యం దుకాణాలను కొనసాగిస్తున్నారు. ఆబిడ్స్ జోన్ పరిధిలోని పురానాపూల్, జియాగూడ, జుమేరాత్ బజార్, కోఠి, ఎగ్జిబిషన్ గ్రౌండ్, గుడి మల్కాపూర్ తదితర ప్రాంతాలలోని పలు మద్యం దుకాణాల వద్ద ఇదే దుస్థితి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద నున్న ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఉదయం 8 గంటల నుంచే దొడ్డి దారిన తెరిచి విక్రయాలు కొనసాగించడం గమనార్హం. మద్యంతో పాటు తాటి, ఈత కల్లులను కూడా ఒకే ఆవరణలో విక్రయిస్తున్నారు. పురానాపూల్ చౌరస్తాలోని ఓ వైన్ షాప్ ఉదయం 9.15 గంటలకే తెరిచి విక్రయాలు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లోని పలు వైన్స్‌లు, బార్లలో పార్కింగ్ సదుపాయం లేక రోడ్లపైనే మందుబాబులు వాహనాలు నిలుపుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సికింద్రాబాద్‌లో... సికింద్రాబాద్‌లోని పలు వైన్ షాపులు, బార్ల ముందు ఉన్న ప్రధాన రహదారులు వాహనాల పార్కింగులతో నిండిపోయాయి. చిలకలగూడలోని దీంతో ఈ రోడ్డులో తరచూ ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. బౌద్ధనగర్ వారాసీగూడ చౌరస్తాలోని ఓ వైన్ షాపు ముందు ఇదే పరిస్థితి. అసలే ఇరుకైన రోడ్డు దానికి తోడు వాహనాల పార్కింగులతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. -
మద్యంపై యుద్ధం
►జనావాసాల్లో మద్యం దుకాణాలా..? ►మండిపడుతున్న మహిళా లోకం ►జిల్లాలో మిన్నంటుతున్న ఆందోళనలు ►పలుచోట్ల దుకాణాలు ధ్వసం ►జిల్లా మేజర్ రోడ్ల పేరుతో సర్కారు కొత్త ఎత్తుగడ ►వ్యాపారులకు కొమ్ముకాసేలా జీవో విడుదల జిల్లాలో మద్య వ్యతిరేక ఉద్యమం జోరందుకుంది. రోడ్లను వదిలి జనావాసాల్లోకి వస్తున్న మద్యం దుకాణాలపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. పేదల బతుకుల్లో మద్యం మహమ్మారి చిచ్చు పెడుతోందంటూ మహిళలు ఆందోళనలు, రాస్తారోకోలకు దిగుతున్నారు. మద్యం మహమ్మారిని తరిమి కొట్టండంటూ దుకాణాలను ధ్వంసం చేస్తున్నారు. మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు మిన్నంటుతున్న నేపథ్యంలో సర్కారు దిగొచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రీయ రహదారులుగా ఉన్న వాటిని జిల్లా మేజర్ రోడ్లుగా మార్పు చేస్తూ మంగళవారం జీవో విడుదల చేసింది. మద్యం వ్యాపారులకు కొమ్ము కాసేలా ఉన్న ఈ ఉత్వర్వులతో అధికశాతం మద్యం షాపులు యథాస్థానాల్లోనే కొనసాగనున్నాయి. ఒంగోలు క్రైం: ప్రకాశం జిల్లాలో మొత్తం 331 మద్యం షాపులున్నాయి. 33 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. 331 మద్యం షాపుల్లో జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులపై ఉన్న 165 మద్యం షాపులు జనావాస ప్రాంతాల్లోకి వెళ్తున్నాయి. మద్యం షాపులు వద్దంటూ ఒంగోలుతో పాటు కందుకూరు, చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనూ మహిళలు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మధ్యం దుకాణాలను రాష్ట్రీయæ, జాతీయ రహదారులకు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలకు 500 మీటర్ల దూరంలో ఉండాలని తీర్పు చెప్పటంతో తొలుత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ తీసేయటంతో అవికాస్తా జనావాసాల్లోకి రావటంతో మహిళలు ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. నిర్వాహకులు మరో మూడు నెలలు గడువు కోరడంతో ఇచ్చారు. ఆ తరువాత జూన్ 30 వరకు గడువు ఇచ్చి అప్పటికీ పూర్తిగా నిబంధనలను పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూలై ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ రావటంతో ప్రజలకు అసలు విషయం అర్ధం కాలేదు. సర్కారు కొత్త జీవో.. మద్యం మహమ్మారిపై జిల్లావ్యాప్తంగా మహిళల నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రీయ రహదారులను జిల్లా మేజర్ రోడ్లుగా మార్పులు చేస్తూ కేవలం మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు పూర్తి స్థాయి అవకాశం కల్పించింది. మంగళవారం జీవో ఎంఎస్ నెం.28ని విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది మార్చి 15న ప్రభుత్వం ఇచ్చిన మెమో ఆధారంగా జీవోను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. 75 శాతంకుపైగా మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు యథాతథ స్థానాల్లోనే ఉండేలా ఇచ్చిన ఉత్తర్వులతో ఈ ప్రభుత్వం మద్యం వ్యాపారులకు కొమ్ముకాస్తోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఒంగోలు నగరంలో అద్దంకి బస్టాండ్ సెంటర్ మొదలుకొని, బస్టాండ్ సెంటర్‌కు ఇరువైపుల ఉన్న అన్ని బార్లు, మద్యం షాపులు మూతేశారు. కొత్త జీవోతో మళ్లీ అవన్నీ రానున్నాయి. ఒక్క కర్నూలురోడ్డు బైపాస్, మంగమూరురోడ్డు బైపాస్ జంక్షన్లలో బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం షాపులు మాత్రం 500 మీటర్లు అవతలకు వెళ్ళాల్సి ఉంది. ఇక పోతే జాతీయ రహదారులు జిల్లాలో రెండున్నాయి. ఒకటి చెన్నై–కోల్కత్తా 16వ నంబర్ జాతీయ రహదారి, రెండోది చీరాల జాతీయ రహదారి. ఈ రెండు రోడ్ల వెంట ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం షాపులు 500 మీటర్లు అవతలకు కచ్చితంగా వెళ్లాల్సి ఉంది. జాతీయ రహదారులపై ఉన్న మండల కేంద్రాలు, ఒంగోలు నగరం, మున్సిపాలిటీల్లో ఉన్న బైపాస్ల్లో షాపులు మాత్రమే నిబంధనల ప్రకారం తీసివేయాలి. పట్టణాల్లోకి, మండల కేంద్రాల్లోకి వచ్చే రోడ్ల వెంట మాత్రం యథాతథంగా బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం షాపులు ఉండవచ్చు. మొత్తం మీద పాత సుప్రీంకోర్టు నిబంధనల మేరకు 165 మద్యం షాపులు, 19 బార్ అండ్ రెస్టారెంట్లు రోడ్లపై లేకుండా వెళ్లాల్సి ఉంటే, ఇప్పుడవి కేవలం 6 బార్ అండ్ రెస్టారెంట్లు, 30 నుంచి 40 మధ్యలో మద్యం షాపులు మాత్రమే జాతీయ రహదారులపై నుంచి 500 మీటర్లకు వెళ్లనున్నాయి. ►కొరిశపాడు మండలంలోని తిమ్మనపాలెం గ్రామ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేస్తున్న దుకాణ విషయంలో స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. రాస్తారోకో కూడా నిర్వహించారు. ►తాళ్లూరు మండలంలో బొద్దికూరపాడు బస్టాండ్ రోడ్లో ప్రాథమిక పాఠశాల పక్కన దుకాణం ఏర్పాటును స్థానికులు అడ్డుకున్నారు. ఇలా దుకాణాలను అడ్డుకోవడంతో అక్కడి స్టాకు బెల్ట్‌లకు చేరింది. దర్శి నియోజక వర్గంలో దాదాపు 225 బెల్ట్దుకాణాలను పైగా ఉన్నాయి. ► గిద్దలూరు రాజానగర్ వాసులు, మండలంలోని ముండ్లపాడు గ్రామస్థులు, బేస్తవారిపేటలోని వాల్మీకినగర్వాసులు, కంభంలోనూ మధ్యం దుకాణాల ఏర్పాటుపై ఆందోళనలు చేశారు. ► కందుకూరు నియోజకవర్గంలో మందుబాబుల ఆగడాలను ఎలా ఉంటాయో గుర్తించిన మహిళలు వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ► శింగరాయకొండలో జాలమ్మగుడి వద్ద ఏర్పాటు చే స్తున్న మద్యం షాపును వద్దని ఆప్రాంత వాసులు మహిళలు శింగరాయకొండ ఎక్త్సెజ్‌శాఖ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపి సీఐకి వినతి పత్రం అందించారు. ►జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో మద్యం షాపు ఏర్పాటు చేయనివ్వమని గ్రామ సర్పంచ్ సునీత, మాజీ సర్పంచ్ మనోహర్‌తో పాటు గ్రామస్ధులు ఎక్త్సెజ్ అధికారులకు తెగేసి చెప్పారు. కాదని ఏర్పాటు చేస్తే ప్రతిఘటిస్తామన్నారు. ►కనిగిరి ప్రాంతంలో మద్యం నూతన షాపులను నివాసాల మధ్య ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ పలు చోట్ల మహిళలు, ప్రజలు, స్థానికులు నిరసనలు తెలుపుతున్నారు. అనేక చోట్ల అడ్డుకోగా, ఒకట్రెండు చోట్ల షాపులను గోడలను పగుల కొట్టారు. ► మార్కాపురం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు, స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా మార్కాపురం, పొదిలి ప్రాంతాల్లో మద్యం షాపులు వద్దంటూ నిరసనల హోరు కొనసాగుతోంది. ►మద్దిపాడు మండలం బూరేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు, స్థానికులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను గ్రీవెన్స్‌లో కలిసి వినతిపత్రం అందించి మద్యం దుకాణాన్ని తొలగించాలని విన్నవించారు. ►చీమకుర్తిలోని లిటిల్‌స్టార్ హైస్కూలుకు సమీపంలో గాంధీనగర్‌లో ఉన్న మద్యం దుకాణం మీదుగా విద్యార్థుల రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందిగా ఉందని విద్యార్థులు ఎక్సయిజ్ అధికారులకు వినతిపత్రం అందించి మధ్యం దుకాణాన్ని తొలగించాలని విన్నవించుకున్నారు. -
ఇక బార్లోనే బీర్ తయారీ
- ఆదాయం పెంపుకోసంఎక్సైజ్ శాఖ సన్నాహాలు - వ్యాపారుల నుంచీ పెరుగుతున్న డిమాండ్ - ఇప్పటికే పుణే, గుర్గావ్, ముంబైల్లో తయారీ కేంద్రాలు న్యూఢిల్లీ: ఢిల్లీలోని బార్ అండ్ రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, ఫైవ్ స్టార్ హోటళ్లలో బీర్ తయారు చేసే సూక్ష్మ కేంద్రాలకు అనుమతించే యోచనలో ఉంది ఢిల్లీ ప్రభుత్వం. దీనిద్వారా ఆదాయ పెంపునకు కసరత్తులు చేస్తోంది. గుర్గావ్, ముంబై, పుణేల్లో ఇలాంటి బీర్ తయారీ కేంద్రాలు ఇప్పటికే ఉన్నాయి. వీటి తరహాలోనే ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం రెండేళ్ల కిందట ఆమోదించిన ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆ ప్రతిపాదనను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గుర్గావ్లో ఇలాంటి యూనిట్స్ నిర్వహిస్తున్న ఢిల్లీలోని హోటళ్లు, పబ్లనుంచి వివరాలు సేకరించామని అధికారులు వెల్లడించారు. ఒక్క మైక్రో బీర్ ప్లాంట్ ఏర్పాటుకు 4వేల చదరపు అడుగుల స్థలం అవసరం కాగా.. ఇందుకుగాను 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. గతంలో ఢిల్లీ మంత్రివర్గ ఆమోదం తరువాత ఈ ఫైల్‌ను కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు పంపారు. ఆ సమయంలో కేంద్రం ఢిల్లీ విమానాశ్రయంలో మాత్రమే బీర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతించింది కేంద్రం. హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో సైతం ఈ బీర్ తయారీ సూక్ష్మ యూనిట్ల ఏర్పాటుకు అనుమతివ్వాలని తాజాగా వ్యాపారవేత్తలనుంచి డిమాండ్ వస్తోంది. దీంతో ఎక్సైజ్ అధికారులు తమ ప్రతిపాదనను ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి మరో లేఖరాయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే... బీర్ వినియోగం మన దేశంలో చాలా తక్కువగా ఉందని హోటళ్ల వ్యాపారులు, విశ్రాంతి పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఈ సూక్ష్మ యూనిట్ల వల్ల వినియోగదారులకు ఇష్టమైన ఫ్లేవర్‌లో బీర్‌ను వారి ముందే తయారు చే సి అందించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల విశ్వసనీయత పెరిగి బీర్ వినియోగం పెరుగుతుందని గుర్గావ్ లోని ఓ పబ్ యజమాని చెబుతున్నాడు. గుర్గావ్, ఢిల్లీ సరిహద్దుల్లోని హర్యానా పట్టణ ప్రాంతాల్లో బహుళజాతి కంపెనీలు, సంపన్నులు నివసించే ప్రాంతాల్లో ఇప్పటికే ఎనిమిది బీర్ తయారీ సూక్ష్మ కేంద్రాలున్నాయని, వాటిలో వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తోందని ఆయన చెప్పారు.