సాక్షి, బంజారాహిల్స్: మద్యంమత్తులో బార్‌లో యువకులు వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని టెయిల్స్ ఓవర్ స్పిరిట్ పేరుతో బార్ అండ్ రెస్టారెంట్ కొనసాగుతుంది. సోమవారం సాయంత్రం వెంపటి ఈశ్వర్, షణ్ముక్, దినేష్ రాజ్, సన్నీ, రోనిత్ అనే యువకులు పార్టీకి వచ్చారు. ఇందులో భాగంగా కొన్ని పాటలు ప్లే చేయాలంటూ డీజేని కోరగా అప్పటికే వాటిని ప్లే చేశామని, మరోసారి వేయలేమంటూ చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. మాటామాటా పెరగడంతో డీజేపై ఆ యువకుల్లో ఒకరు చేయిచేసుకున్నారు. దీంతో బార్ సిబ్బంది, యువకులు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగడంతో బార్ యజమాని శ్రీనివాస్ చేతికి తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కాగా తమపై దాడికి పాల్పడడంతో పా టు గదిలో బంధించారంటూ బాధిత యువకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయ గా, బిల్లు చెల్లించకుండా బయటకు వెళ్లేందుకు ప్రయ త్నిస్తే తమపై దాడి చేశారంటూ బార్ మేనేజర్ శ్రీశై లం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment