youth attack
-
మద్యం మత్తులో బార్లో యువకుల వీరంగం
సాక్షి, బంజారాహిల్స్: మద్యంమత్తులో బార్లో యువకులు వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని టెయిల్స్ ఓవర్ స్పిరిట్ పేరుతో బార్ అండ్ రెస్టారెంట్ కొనసాగుతుంది. సోమవారం సాయంత్రం వెంపటి ఈశ్వర్, షణ్ముక్, దినేష్ రాజ్, సన్నీ, రోనిత్ అనే యువకులు పార్టీకి వచ్చారు. ఇందులో భాగంగా కొన్ని పాటలు ప్లే చేయాలంటూ డీజేని కోరగా అప్పటికే వాటిని ప్లే చేశామని, మరోసారి వేయలేమంటూ చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. మాటామాటా పెరగడంతో డీజేపై ఆ యువకుల్లో ఒకరు చేయిచేసుకున్నారు. దీంతో బార్ సిబ్బంది, యువకులు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగడంతో బార్ యజమాని శ్రీనివాస్ చేతికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కాగా తమపై దాడికి పాల్పడడంతో పా టు గదిలో బంధించారంటూ బాధిత యువకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయ గా, బిల్లు చెల్లించకుండా బయటకు వెళ్లేందుకు ప్రయ త్నిస్తే తమపై దాడి చేశారంటూ బార్ మేనేజర్ శ్రీశై లం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేశారు. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి కేసులో పురోగతి
-
మద్యం మత్తులో ఎస్సైని దూషించి.. వీరంగం
నల్లబెల్లి: మద్యంమత్తులో పోలీస్‌స్టేషన్ ఎదుట ఇద్దరు యువకులు శనివారం అర్థరాత్రి వీరంగం సృష్టించిన సంఘటన రూరల్ జిల్లా నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎస్సై నరేందర్‌రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఆదివారం అర్థరాత్రి పెట్రోలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని రాంతీర్థం శివారు బిల్‌నాయక్‌తండాకు చెందిన మాలోత్ నమ్కు, మాలోత్ రాజా రతన్‌సింగ్‌లతో పాటు మరికొందరు శనిగరం క్రాస్ రోడ్డు జాతీయ రాహదారి సమీపంలో పబ్లిక్ ప్లేస్‌లో మద్యం సేవిస్తూ కనిపించారు. పోలీస్ వాహనంలో ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది అక్కడి వెళ్తున్న క్రమంలో కొందరు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నమ్కు, రాజారతన్‌సింగ్‌లు మాత్రం అక్కడే నిలుచున్నారు. ఇంతరాత్రి ఇక్కడ ఎందుకు ఉన్నారని వారిని పోలీసులు ప్రశ్నిస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో మద్యంమత్తులో ఉన్న యువకులు ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. పబ్లిక్ ప్లేసులో మద్యం తాగినందుకు కేసు నమోదు చేస్తామని ఎస్సై వారికి తెలియజేస్తూ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు పోలీస్ వాహనాన్ని ద్విచక్రంపై వెంబడిస్తూ పీఎస్‌కు చేరుకొని సుమారు రెండుగంటల పాటు ఎస్సైతో పాటు పోలీసులపై పరుషపదజాలాన్ని ఉపయోగిస్తూ దూషించారు. ఎస్సై, పోలీసులు క్షమాపన చేప్పేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని హంగామ సృష్టించారు. ఫ్రెండ్లీ పోలీస్ కావడంతో చేసేది ఎమిలేక చూస్తూ ఉండి పోయారు. కేసు నమోదు స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బిల్‌నాయక్‌తండా గ్రామానికి చెందిన మాలోత్ నమ్కు, మాలోత్ రాజా రతన్‌సింగ్‌లు మద్యంమత్తులో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఎస్ఐపై యువకుడి దాడి
-
బంజారాహిల్స్‌లో మత్తులో యువకుల హల్చల్
బంజారాహిల్స్ (హైదరాబాద్ సిటీ): మద్యం మత్తులో నగరంలో కొందరు యువకులు హల్చల్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్‌లోగల సుఖ్‌సాగర్ హోటల్‌కు ఆదివారం వేకువజామున ఇందిరానగర్‌లో నివసించే సాయి, రాజ్‌కుమార్ పటేల్‌తోపాటు మరో ఐదుగురు యువకులు మద్యం మత్తులో వచ్చారు. వచ్చి రాగానే ఇష్టం వచ్చినట్లు మాటలంటూ హోటల్ సిబ్బంది వెంకటేష్, అనిరుద్‌లపై దాడికి పాల్పడ్డారు. తాము వచ్చినప్పుడు పక్కకు జరగకుండా అడ్డుగా ఉన్నారంటూ సాయి వారితో వాగ్వాదానికి దిగాడు. జరుగుతున్నామని చెబుతున్నా వినిపించుకోకుండా మద్యం మత్తులో వారిని తీవ్రంగా కొట్టారు. బాధితులిద్దరూ సాయి ఇంట్లోనే కిరాయికి ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. -
హోటల్ ఓనర్‌పై దాడి చేసిన యువకులు
-
జీసీ కేబుల్‌పై యువకుల దాడి
గుంటూరు: నర్సారావు పేటలో జీసీ కేబుల్‌పై కొందరు యువకులు దాడి చేశారు. కేబుల్ సామాగ్రిని ధ్వంసం చేసి డిష్ యాంటెనాలను గొడ్డళ్లతో నరికివేశారు. దీంతో 94 గ్రామాలకు పూర్తిగా ప్రసారాలు నిలిచిపోయాయి. కేబుల్‌ను విక్రయించకపోవడంతోనే మొత్తం ఎనిమిదిమంది యువకులు దాడి చేశారని బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం పల్నాడు రోడ్డులో ఉన్న జీసీ కేబుల్ కార్యాలయంపై కూడా దాడి జరిగింది.