ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత | Women protest against wine shops in prakasam district | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత

Dec 11 2017 12:06 PM | Updated on Dec 11 2017 12:06 PM

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండలంలోని మలపాడులో మద్యం షాపు ఏర్పాటు చేయొద్దంటూ సోమవారం మహిళలు ధర్నాకు దిగారు. మహిళల ధర్నాను పోలీసులు అడ్డుకుని అరెస్టుకు యత్నించారు. దీంతో గ్రామస్తులు పోలీసులను అడ్డుకోవడంతో  ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 

మరోవైపు జిల్లాలోని సంతమగులూరులో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఇంటి స్థలం విషయంలో వివాదం నెలకొనడంతో ఇరువర్గాల వారు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో పలువురి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement