సాక్షి, హైదరాబాద్: వైన్‌షాపులు గురువారం నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ బుధవారం తెలిపారు. పేద ప్రజలతో చెలగాటం ఆడుతున్న గుడుంబా తయారీని పూర్తిగా అరికడతామని, దాన్ని తయారు చేసేవారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం వైన్‌షాపుల సమయాన్ని పెంచామని మంత్రి తెలిపారు.
తెలంగాణను సీఎం కేసీఆర్ గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చారని పేర్కొన్నారు. బెల్లం సరఫరా, అక్రమమద్యం సరఫరా, గుడుంబా తయారు చేసేవారి సమాచారం తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి, తగిన పారితోషికం ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment