- 519 మద్యం దుకాణాలకు ౖలైసెన్సులు
- లైసెన్సు ఫీజు రూ.45.13 కోట్లు
- ముగిసిన మద్యం దుకాణాల వేలం
- 26 దుకాణాలకు రీనోటిఫికేష¯ŒSకు చర్యలు
కిక్ ఎక్కించారు
Published Sat, Apr 1 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
కాకినాడ క్రైం :
జిల్లాలోని 527 మద్యం దుకాణాల ఏర్పాటుకు కాకినాడ ఎ¯ŒSఎఫ్‌సీఎల్ రోడ్డులోని జీకన్వెన్ష¯ŒS హాల్లో లాటరీ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శనివారం తెల్లవారుజాము 2 గంటల వరకూ ప్రశాంతంగా సాగింది. 2017–2019కి జిల్లాలో 545 మద్యం దుకాణాల ఏర్పాటుకు మార్చి 24న ఎక్సైజ్ అధికారులు నోటిఫికేష¯ŒS జారీ చేయగా, 527 దుకాణాలకు 6,317 దరఖాస్తులు వచ్చాయి. చివరకు 519 మంది వ్యాపారులకు కొత్త మద్యం పాలసీ ప్రకారం దుకాణాలు నిర్వహించుకునేందుకు ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు జారీ చేశారు. మిగిలిన 26 దుకాణాలకు రీటెండర్లు వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
రూ.45.13 కోట్ల ఆదాయం
519 మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారుల నుంచి రిజిస్ట్రేష¯ŒS, దరఖాస్తు ఫీజుల రూపంలో రూ.39.66 కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. దీంతో పాటూ లైసైన్సుల రూపంలో మరో రూ.45.13 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లా మొత్తంమీద రూ.84.79 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఇందులో కాకినాడ యూనిట్ పరిధిలోని 184 మద్యం దుకాణాలకు లైసెన్సు ఫీజుగా రూ. 21.15 కోట్లు, రాజమహేంద్రవరం పరిధిలోని 134 దుకాణాలకు రూ.14.92 కోట్లు, అమలాపురంలోని 201 మద్యం దుకాణాలకు 9.06 కోట్ల ఆదాయం సమకూరింది.
ముందుగానే వేలం
జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండకూడదనే సుప్రీంకోర్టు తీర్పుతో లైసెన్సుల జారీ ప్రక్రియను ఈ ఏడాది ముందుగానే ప్రభుత్వం నిర్వహించింది. అయితే జాతీయ రహదారుల సమీపంలోని మద్యం దుకాణాలకు సంబం ధించి శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తుది తీర్పుతో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లీజు గడువు పూర్తయ్యే దాకా (జూ¯ŒS నెలాఖరు దాకా) కొనసాగించేందుకు అవకాశం ఉండటంతో వ్యాపారులు కాస్త ఊరటచెందారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి మద్యం దుకాణాలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
40 మద్యం దుకాణాలకు
సుప్రీం కోర్టు తీర్పు వర్తింపు
జిల్లాలో గతేడాది మద్యం దుకాణాల కేటాయింపునకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేష¯ŒSలో మిగిలిపోయిన 46 మద్యం దుకాణాల్లో 40 దుకాణాలకు అధికారులు శుక్రవారం వేలం నిర్వహించారు. ఈ వేలంలో కొత్త మద్యం పాలసీ ప్రకారం వ్యాపారులకు మద్యం దుకాణాలను కేటాయించించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల అవతల దుకాణాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
Advertisement