licensed
-
Mohan Babu: గన్ సరెండర్ చేయాలని మోహన్ బాబును కోరిన పోలీసులు
-
పరకాలలో ఫైరింగ్ కలకలం
సాక్షి, హన్మకొండ జిల్లా: పరకాలలో ఫైరింగ్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన బిల్డర్ తిరుపతిరెడ్డి లైసెన్స్ తుపాకితో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఐదురోజుల క్రితం కాల్పుల ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. తుపాకీని సీజ్ చేశారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లైసెన్స్ తుపాకీతో సంవత్సరికం పంక్షన్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి గాలిలోకి కాల్పులు జరిపాడని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. నిందితున్ని కోర్టులో హాజరుపర్చిగా న్యాయస్థానం రిమాండ్ విధించిందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం డాక్టర్ దుర్మరణం -
ఆర్బీఐ ముందుకు బ్యాడ్‌బ్యాంక్ లైసెన్స్ దరఖాస్తు!
న్యూఢిల్లీ: నేషనల్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)కు సంబంధించి లైసెన్స్ కోసం ఆర్బీఐకి త్వరలోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) దరఖాస్తు చేసుకోనుంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ రంగంలో వసూలు కాని మొండి బకాయిల సమస్యకు పరిష్కారంగా ఎన్ఏఆర్సీఎల్ఎల్ (బ్యాడ్ బ్యాంకు) ఏర్పాటును 2021–22 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. రూ.100 కోట్ల అధీకృత మూలధనంతో కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఈ నెల 7న ఎన్ఏఆర్సీఎల్ను ఏర్పాటు చేసినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్స్ చెబుతున్నాయి. ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చినట్టయితే ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. -
మద్యం రగడ
నెల్లూరు : జిల్లాలో మద్యం షాపులు, బార్ల ఏర్పాటుపై రగడ కొనసాగుతోంది. ప్రధాన రహదారుల వెంట మద్యం షాపులు నెలకొల్పి రూ.కోట్లు గడించిన లిక్కర్ సిండకేట్ల ప్రతినిధులు వాటిని వేరేచోటుకు మార్చడానికి ససేమిరా అంటున్నారు. తమ పంతం నెగ్గించుకునేందుకు మంత్రుల ద్వారా పైరవీలు నడుపుతున్నారు. ఇదికాస్తా కొలిక్కి వచ్చినట్టే కనిపించినా.. అధికారిక ఉత్తర్వులు రాకపోవడంతో ప్రధాన రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను శనివారం నాటికి 500 మీటర్ల దూరానికి మార్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సర్వత్రా ఉత్కంఠ మద్యం దుకాణాల లైసెన్స్ కాల పరిమితి ముగియగా.. కొత్త లైసెన్స్‌లు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందనే దానిపై వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది. నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తే జిల్లాలో 164 మద్యం షాపులు, 30 బార్లను తప్పనిసరిగా రోడ్లకు దూరంగా మార్చాల్సి వస్తుంది. జిల్లాలో మొత్తం 350 మద్యం షాపులు, 43 బార్లు ఉన్నాయి. వీటిద్వారా నెలకు సగటున రూ.95 కోట్ల నుంచి రూ.100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అధికార పార్టీలో కీలకంగా వ్యవహరించే నేతలే లిక్కర్ సిండికేట్‌లో ప్రధానమైన వ్యక్తులుగా ఉంటున్నారు. వాయిదా వేస్తూ.. రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న మద్యం దుకాణాలను 500 మీటర్ల అవతలకు మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. జూలై 1నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ క్రమంలోనే జాన్ చివరి వారంలో నిర్వహించాల్సిన మద్యం షాపుల లైసెన్స్‌ల కేటాయింపును మార్చి 31లోపే నిర్వహించి.. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా కొత్త లైసెన్స్‌లు కేటాయించింది. ఈ దృష్ట్యా శనివారం నుంచి మద్యం దుకాణాలను ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, కోర్టు ఆదేశాల నుంచి తప్పించుకునే యత్నాల్లో భాగంగా సర్కారు చేయూతతో మద్యం సిండికేట్లు కొత్త ఎత్తుగడ వేశాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర రహదారుల్ని ఢీనోటిఫై చేయించి.. వాటిని నగర, మున్సిపాలిటీ, పంచాయతీ రహదారులుగా మార్పిస్తే వ్యాపారానికి ఢోకా ఉండదన్న ఉద్దేశంతో పైరవీలు సాగించాయి. మంత్రుల సాయంతో ఆ దిశగా కసరత్తు కూడా చేయిం చాయి. 20 రోజులుగా ఈ వ్యవహారం నానుతున్నా ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులేవీ అందలేదు. గందరగోళం రోడ్ల ఢీ నోటిఫైకి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాకపోవటంతో షాపులు మార్చాలా లేక ఉన్నచోటే కొనసాగించాలనే అనే దానిపై గందరగోళం నెలకొంది. షాపులు మార్పు చేయకుండా ఉండేదుకు మద్యం సిండికేట్ సభ్యులు అన్ని షాపుల నుంచి కొంత మొత్తం వసూలు చేసి పెద్దలకు మట్టజెప్పినట్టు సమాచారం. మార్పు తప్పనిసరి అయితే నెల్లూరు డివిజన్ పరిధిలో అత్యధికంగా 118 షాపులను మార్చాల్సి వస్తుంది. గూడూరు డివిజన్లో 66 షాపులు మార్చాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 30 బార్ల మార్పు అనివార్యం. మరోవైపు ఇళ్లమధ్య మద్యం దుకాణాలు పెట్టొద్దంటూ ప్రజలు, ప్రజా సంఘాల నుంచి పెద్దఎత్తున అధికారులకు వినతులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇళ్ల దుకాణాలు పెడితే నష్టపోతామనే అభిప్రాయం వ్యాపారుల్లో ఉంది. -
కిక్ ఎక్కించారు
519 మద్యం దుకాణాలకు ౖలైసెన్సులు లైసెన్సు ఫీజు రూ.45.13 కోట్లు ముగిసిన మద్యం దుకాణాల వేలం 26 దుకాణాలకు రీనోటిఫికేష¯ŒSకు చర్యలు కాకినాడ క్రైం : జిల్లాలోని 527 మద్యం దుకాణాల ఏర్పాటుకు కాకినాడ ఎ¯ŒSఎఫ్‌సీఎల్ రోడ్డులోని జీకన్వెన్ష¯ŒS హాల్లో లాటరీ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శనివారం తెల్లవారుజాము 2 గంటల వరకూ ప్రశాంతంగా సాగింది. 2017–2019కి జిల్లాలో 545 మద్యం దుకాణాల ఏర్పాటుకు మార్చి 24న ఎక్సైజ్ అధికారులు నోటిఫికేష¯ŒS జారీ చేయగా, 527 దుకాణాలకు 6,317 దరఖాస్తులు వచ్చాయి. చివరకు 519 మంది వ్యాపారులకు కొత్త మద్యం పాలసీ ప్రకారం దుకాణాలు నిర్వహించుకునేందుకు ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు జారీ చేశారు. మిగిలిన 26 దుకాణాలకు రీటెండర్లు వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రూ.45.13 కోట్ల ఆదాయం 519 మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారుల నుంచి రిజిస్ట్రేష¯ŒS, దరఖాస్తు ఫీజుల రూపంలో రూ.39.66 కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. దీంతో పాటూ లైసైన్సుల రూపంలో మరో రూ.45.13 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లా మొత్తంమీద రూ.84.79 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఇందులో కాకినాడ యూనిట్ పరిధిలోని 184 మద్యం దుకాణాలకు లైసెన్సు ఫీజుగా రూ. 21.15 కోట్లు, రాజమహేంద్రవరం పరిధిలోని 134 దుకాణాలకు రూ.14.92 కోట్లు, అమలాపురంలోని 201 మద్యం దుకాణాలకు 9.06 కోట్ల ఆదాయం సమకూరింది. ముందుగానే వేలం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండకూడదనే సుప్రీంకోర్టు తీర్పుతో లైసెన్సుల జారీ ప్రక్రియను ఈ ఏడాది ముందుగానే ప్రభుత్వం నిర్వహించింది. అయితే జాతీయ రహదారుల సమీపంలోని మద్యం దుకాణాలకు సంబం ధించి శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తుది తీర్పుతో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లీజు గడువు పూర్తయ్యే దాకా (జూ¯ŒS నెలాఖరు దాకా) కొనసాగించేందుకు అవకాశం ఉండటంతో వ్యాపారులు కాస్త ఊరటచెందారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి మద్యం దుకాణాలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 40 మద్యం దుకాణాలకు సుప్రీం కోర్టు తీర్పు వర్తింపు జిల్లాలో గతేడాది మద్యం దుకాణాల కేటాయింపునకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేష¯ŒSలో మిగిలిపోయిన 46 మద్యం దుకాణాల్లో 40 దుకాణాలకు అధికారులు శుక్రవారం వేలం నిర్వహించారు. ఈ వేలంలో కొత్త మద్యం పాలసీ ప్రకారం వ్యాపారులకు మద్యం దుకాణాలను కేటాయించించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల అవతల దుకాణాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.