న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులు, పాజిటివిటీ రేటు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో మరిన్ని ఆంక్షలు విధించాలని డీడీఎంకే నిర్ణయించింది. ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నేతృత్వంలోని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిస్థితిని సమీక్షించేందుకు భేటీ అయింది.
చదవండి: వైరల్: ‘సార్, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? పోలీసుల పంచ్ అదిరింది!
ఈ మేరకు ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్న రెస్టారెంట్లు, బార్లను పూర్తిగా మూసివేస్తూ.. కేవలం టేక్‌అవేలకు మాత్రమే అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రతిపాదించింది. అలాగే మెట్రో రైళ్లు, బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం మళ్లీ తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే అమల్లో ఉన్న కరోనా ఆంక్షలను ఎన్‌సీఆర్ పరిధిలోనూ కఠినంగా అమలుచేయాలని డీడీఎంకే తీర్మానించింది.
చదవండి: ఎవ్వరినీ వదలడం లేదు.. కరోనా బారిన పడ్డ మరో ఇద్దరు సీఎంలు
Comments
Please login to add a commentAdd a comment