-
రేపటి నుంచి ప్రారంభం
-
ప్రతిరోజు 723 మందికే స్లాట్ బుకింగ్‌కు అవకాశం
-
రవాణాశాఖలో 57 రకాల ఆన్‌లైన్ సేవలు
-
పని ఒత్తిడికి లోనవుతున్న సిబ్బందికి ఉపశమనం
-
ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని అధికారుల పిలుపు
ఖిలా వరంగల్ : వరంగల్ ఉప రవాణాశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు ఇతర అన్నిరకాల సేవలు ఇప్పటి నుంచి ఆన్‌లైన్ ద్వారానే అందనున్నాయి. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆర్టీఏ అధికారులు ఈనెల 2వ తేదీ నుంచి 57 రకాల ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటివరకు ఆన్‌లైన్ సర్వీసుల్లో లెర్నింగ్, పర్మనెంట్ లైసెన్స్‌లతోపాటు 15 రకాల సేవలకు స్లాట్ బుకింగ్ ఉండేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న విధానం తో 57 రకాల సేవలు నగదు రహితంగా అందనున్నాయి. ఆన్‌లైన్ సేవలతో ప్రజలకు వేగంగా సేవలు అందడంతోపాటు సిబ్బం దిపై పనిభారం కూడా తగ్గుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లు నగదు రహిత సేవలను లాంఛనంగా ప్రారంభించగా.. మంగళవారం నుంచి వరంగల్‌లో అందుబాటులోకి రానున్నాయి.
సకాలంలో సేవలు
వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో మొత్తం 57 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా 723 మందికి స్లాట్ బుకింగ్ చేసుకునే ఆవకాశం కల్పించింది. ఇందులో లైసెన్స్‌లు 152, ఎల్‌ఎల్‌ఆర్‌లు 127, పర్మనెంట్ లైసెన్స్‌లు, ఇతరాలు 57, ఫ్రెష్ వా హన రిజిస్ట్రేషన్లు 271, ఫిట్‌నెస్‌లు 66, పర్మిట్లు 49, సబ్ కార్యాలయం జనగామలో 95, మహబూబాబాద్‌లో 125 మందికి ఆ¯Œæలైన్ ద్వారా సేవలు అందుతాయి. ఈ–సేవ, మీ–సేవ సెంటర్ నిర్వాహకులు అందజేసిన పత్రాలు చూపిన ప్రతి వాహనదారుడికి సేవలు అందుతాయి. వాహనదారుల వాహన ఇన్సూరెన్స్, పొల్యుషన్ సర్టిఫికెట్లను చూపిస్తే ఆర్టీఏ కార్యాలయంలో వేలిముద్ర, ఫొటోను తీసి సంబంధిత టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి అధికారులు సంబంధిత పత్రాలను వెంటనే అందజేయనున్నారు.
నగదు మాటే ఉండదు
వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో ఈనెల 2వ తేదీ నుంచి నగదు రహిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ–సేవ, మీ–సేవల్లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వాహనదారులు తమకు కేటాయించిన తేదీ రశీదును చూపిస్తే సేవలు అందుతాయి. వాహనదారుల నుంచి ఆర్టీఏ ఎలాంటి నగదు తీసుకునే అవకాశం ఉండదు. ఆన్‌లైన్ విధానంతో జీరో కౌంటర్ల వద్ద వాహనదారుల రద్దీ కూడా పూర్తిగా తగ్గుతుంది.
ఆన్‌లైన్‌లో పొందడం ఇలా..
1. ఆర్టీఏ వెబ్‌సైట్ htt@//www. transport.telangala.gov.inకు యాక్సిస్ చేసి ఆన్‌లైన్ సర్వీసులపై వాహనదారుడు
క్లిక్ చేయాలి. ఆప్పుడు వాహనదారుల వ్యవహారం రకం అనగా.. ప్రస్తుత సందర్భంలో ఎల్‌ఎల్‌ఆర్ కొరకు దరఖాస్తుపై క్లిక్ చేసి అవసరమైన డేటా పూర్తి చేయాలి.
2 వివరాలను పూర్తి చేసిన తర్వాత వాహనదారుడు తనకు అనుకూలమైన తేదీల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి.
3. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత వాహనదారుడి సెల్‌కు కార్యాలయానికి వచ్చేటప్పుడు తీసుకురావాల్సిన డాక్యుమెంట్ల వివరాలకు సంబంధించిన మెసెజ్ వస్తుంది.
4. వాహనదారులు అవసరమైన ఫీజును ఆన్‌లైన్‌లో లేదా ఈ–సేవ కౌంటర్‌లో చెల్లించాలి.
5. వాహనదారులు అవసరమైన డాక్యుమెంట్లతోపాటు పూర్తి చేసిన ఫారం ప్రింట్ అవుట్ లేదా ఎస్‌ఎంఎస్‌తో నిర్ణీత తేదీ, సమయంలో ఎంపిక చేసుకున్న స్లాట్ ప్రకారం కార్యాలయానికి రావాలి.
6. వాహనదారుడి మొబైల్‌లో ఎస్‌ఎంఎస్ చూపిన తర్వాత కౌంటర్ సిబ్బంది ఫారం ప్రింట్ అవుట్ తీసుకుని సంతకం తీసుకుంటారు.
7. వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ఫీజు, కొత్త వాహనాల హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబర్ ప్లేట్ రుసుములు డీలర్ స్థాయిలోనే సేకరించబడుతాయి.
8. అన్ని కౌంటర్లలో లేజర్ ప్రింటర్ వెబ్ కెమెరా, థంబ్ క్యాప్చరింగ్ యూనిట్, సిగ్నేచర్ క్యాప్చరింగ్ యూనిట్ ఉంటుంది. ఫొటో తీసేందుకు లేదా ఇతర పనికి సింగిల్ కౌంటర్‌ను దాటి దరఖాస్తుదారుడు తిరగాల్సిన అవసరం ఉండదు.
9. ఆన్‌లైన్ సేవల అమలు తీరును సిబ్బంది ప్రతిచోట ప్రచారం చేస్తారు.