నాన్ ట్రాన్స్‌పోర్ట్, ట్రాన్స్‌పోర్టు వాహనాలకు ఎల్‌ఎల్‌ఆర్ మంజూరు చేసేందుకు శనివారం స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సుందర్‌వద్దీ తెలిపారు.
అనంతపురం సెంట్రల్ : నాన్ ట్రాన్స్‌పోర్ట్, ట్రాన్స్‌పోర్టు వాహనాలకు ఎల్‌ఎల్‌ఆర్ మంజూరు చేసేందుకు శనివారం స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సుందర్‌వద్దీ తెలిపారు. శుక్రవారం ఆయన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. నాన్ ట్రాన్స్‌పోర్టు ఆటోరిక్షా డ్రైవర్లు ట్రాన్స్‌పోర్టు వాహనాలకు ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ లైసెన్స్‌లు కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇలాంటి వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ప్రత్యేకంగా స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎల్‌ఎల్‌ఆర్ మంజూరు చేస్తామని వివరించారు. నెల రోజుల తర్వాత వారికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తామన్నారు. వయసు ధ్రువీకరణ పత్రం, స్కూల్ డిక్లరేషన్ సర్టిఫికెట్ లేకపోయినా వెరిఫికేషన్ చేసి ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్ ఎల్‌ఎల్‌ఆర్ మంజూరు చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.