వెంకన్న కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు ఎంత? | how much loan did venkateswara took, asks RTI acitivist narasimhamurthy | Sakshi
Sakshi News home page

వెంకన్న కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు ఎంత?

Published Sat, Dec 13 2014 2:23 PM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

వెంకన్న కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు ఎంత? - Sakshi

వెంకన్న కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు ఎంత?

బెంగళూరు : సామాన్యుడికి ఆయుధంగా మారిన సమాచార హక్కు చట్టం... ఇప్పుడు 'దేవుడు' తీసుకున్న అప్పు ఎంత అనే లెక్క కూడా అడుగుతోంది. 'తిరుపతి వెంకటేశ్వరస్వామి తన వివాహం కోసం కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు ఎంత? భక్తుల కానుకల ద్వారా ఇప్పటివరకూ తీర్చిన అప్పు లెక్క చెప్పండి? ఆ అప్పు ఎప్పుడు తీరుతుంది..' అని బెంగళూరుకు చెందిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త టి.నరసింహమూర్తి తిరుమల తిరుపతి దేవస్ధానానికి ప్రశ్నలు సంధించారు.

బెంగళూరులో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ...'చాలా కాలంగా వెంకటేశ్వరుడి అప్పు తీర్చడం కోసం భక్తులు హుండీలో డబ్బులు వేస్తున్నారు. ఇలా ఇంకెంత కాలం వేయాలి. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం ద్వారా టీటీడీకి 2012 ఫిబ్రవరి 6న దరఖాస్తు చేసుకున్నాను. అయితే ఇప్పటివరకూ సమాధానం రాలేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను. సమాధానం వచ్చే వరకూ పోరాటం సాగిస్తాను' అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement