రవాణా రంగం నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర
రవాణా రంగం నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర
Published Wed, Jan 18 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏగఫూర్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కేంద్ర ప్రభుత్వం రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే కుట్ర పన్నుతోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యద్శి ఎంఏ గఫూర్ ఆరోపించారు. పెంచిన ఆర్టీఏ చలానా, జరిమానాలతో కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మోటార్స్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కార్యాలయంలో ఈ.పుల్లారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. నూతన మోటార్ ట్రాన్స్‌ఫోర్టు చట్టంతో కార్మికులు జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఫీజులను తగ్గించకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు.
మోటార్ ట్రాన్స్‌ఫోర్టు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ సుభాన్ మాట్లాడుతూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక చాలా మంది యువకులు ఆటోలు, లారీలు, ఇతర వాహనానలు నడుపుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీరు రోజంతా కష్టపడితే వచ్చే నగదంతా చలానాలు, జరిమానాలు కట్టడానికే సరిపోతే వారి కుటుంబాల జీవనం ఎలా సాగించాలని ప్రశ్నించారు. ఇప్పటికే ఆర్‌టీఏ అధికారుల దాడులతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే చలానా, జరిమానాల ఫీజులను పెంచితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లాంగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మిన్నల్లా, లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు రామకృష్ణ, యూసుఫ్ మియ్యా, లైట్ వెహికల్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస యాదవ్, మెకానిక్స్ యూనియన్ నాయకులు గోవిందు పాల్గొన్నారు.
పోరాట కమిటీ ఎన్నిక
పెంచిన ఆర్టీఏ చలానా, జరిమాన ఫీజులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు పోరాట కమిటీని ఎన్నకున్నారు. కమిటీ కన్వీనర్‌గా సీఐటీయూ నాయకులు ఇ.పుల్లారెడ్డి, కోకన్వీనర్ మిన్నల్లా, యూసూఫ్‌మియాతోపాటు 12 రంగాల నుంచి 42 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
Advertisement
Advertisement