రవాణాశాఖ సేవల కోసం మీ సేవా, ఈ సేవా కేంద్రాలకు వచ్చేవారికి మెరుగైన సేవలు అందించాలని కరీంనగర్ డీటీసీ వినోద్‌కుమార్ కోరారు. తిమ్మాపూర్ రవాణాశాఖ కార్యాలయంలో ఈ సేవా, మీ సేవా కేంద్రాల నిర్వాహాకుల శిక్షణ తరగతులను ఆయన బుధవారం ప్రారంభించారు.
మెరుగైన సేవలు అందించాలి
Jul 27 2016 10:37 PM | Updated on Sep 4 2017 6:35 AM
తిమ్మాపూర్ : రవాణాశాఖ సేవల కోసం మీ సేవా, ఈ సేవా కేంద్రాలకు వచ్చేవారికి మెరుగైన సేవలు అందించాలని కరీంనగర్ డీటీసీ వినోద్‌కుమార్ కోరారు. తిమ్మాపూర్ రవాణాశాఖ కార్యాలయంలో ఈ సేవా, మీ సేవా కేంద్రాల నిర్వాహాకుల శిక్షణ తరగతులను ఆయన బుధవారం ప్రారంభించారు. ఆర్టీఏ కార్యాలయానికి సంబంధించిన 57 సేవలను మీ సేవా, ఈ సేవా కేంద్రాలకు అప్పగించడం జరిగిందన్నారు. ఆగస్టు 2 నుంచి ఆర్టీఏ ఆఫీసుల్లో నగదు లావాదేవీలు జరుగవని తెలిపారు. సంబంధిత పత్రాలు లేకుండా ఆన్‌లైన్ చేస్తే దరఖాస్తులను తిరస్కరిస్తామన్నారు. జిల్లాలో 500 మంది వరకు నిర్వాహాకులకు నాలుగు రోజులపాటు విడతల వారిగా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఏవోలు శ్రీనివాస్, మస్లియొద్దిన్, టెక్నిషియన్లు కరుణాకర్, చేతన్, సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement